Gland Pharma To Acquires Cenexi Group For Rs 1000 Crores, Details Inside - Sakshi
Sakshi News home page

గ్లాండ్‌ ఫార్మా చేతికి సెనెక్సి: వెయ్యి కోట్ల డీల్‌

Published Wed, Nov 30 2022 2:09 PM | Last Updated on Wed, Nov 30 2022 4:46 PM

Gland Pharma acquires CENEXI for Rs.1000Cr - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  హైదరాబాద్‌కు చెందిన ఔషధ రంగ కంపెనీ గ్లాండ్‌ ఫార్మా భారీ డీల్‌కు తెరలేపింది. యూరప్‌కు చెందిన సెనెక్సి గ్రూప్‌ను గ్లాండ్‌ ఫార్మా ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోంది. డీల్‌ విలువ రూ.1,015 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టేందుకు కంపెనీకి ఈ డీల్‌ వీలు కల్పిస్తుంది.

థర్డ్-పార్టీ ఫండింగ్‌కు ఎటువంటి ఆధారం లేకుండా అంతర్గత వనరుల ద్వారా లావాదేవీకి నిధులు సమకూరుతాయని గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌ అయిన సెనెక్సి గ్రూప్‌నకు ఫ్రాన్స్‌లో మూడు, బెల్జియంలో ఒక ప్లాంటు ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement