ఇండియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు ఉలుకుపలుకు లేకుండా స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రూ. 450 నుంచి రూ. 490 వరకు తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మాత్రం ఎలాంటి మార్పుకు లోనుకాకుండా ఉండటం చూడవచ్చు. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలో ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
👉 హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు బంగారం ధరలు వరుసగా రూ. 5730 (22 క్యారెట్స్), రూ. 6251 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఈ లెక్కన తులం బంగారం ధర రూ. 57300, రూ. 62510గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.
👉 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా నేడు గోల్డ్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5790 కాగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 6316గా ఉంది. 10 గ్రాముల బంగారం ధరలు చెన్నైలో రూ. 57900 (22 క్యారెట్స్), రూ. 63160 (24 క్యారెట్స్) గా ఉంది.
ఇదీ చదవండి: పరుగులు పెట్టిన ఈవీ రంగం.. 2023లో ఇవే హైలెట్స్
👉 దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ రోజు తులం బంగారం ధర రూ. 57450 (22 క్యారెట్స్), రూ. 62660 (24 క్యారెట్స్). ఈ ధరలను గమనించినట్లతే.. నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ధరల్లో ఈ రోజు ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం.
వెండి ధరలు
👉 బంగారం ధరలు మాత్రమే కాకుండా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, చెన్నై, ఢిల్లీలలో వెండి ధరలు కూడా ఈ రోజు స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment