
గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు ఉలుకు పలుకు లేకుండా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఏలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు తులం బంగారం ధర రూ. 58,150 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,420 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి. 22 క్యారెట్స్ గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. 24 క్యారెట్ గోల్డ్ మాత్రం 10 గ్రాములపై రూ. 20 పెరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, విజయవాడలలో నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. రూ.58000 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63270 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
చెన్నైలో మాత్రం ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 100 నుంచి రూ. 110 మాత్రమే తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో నిన్న రూ. 58600గా ఉన్న 22 క్యారెట్స్ తులం గోల్డ్ రేటు ఈ రోజు రూ. 58500కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63820కి చేరింది.
ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి
వెండి ధరలు
బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు కూడా ఈ రోజు బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు మొదలైన ప్రాంతాల్లో కూడా స్థిరంగా ఉన్నాయి. నిన్న కూడా వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment