Gold Price Today: దేశంలో క్రితం రోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు (డిసెంబర్ 5) స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.
తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,400 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.77,890 లకు ఎగిసింది. చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.71,550 లకు చేరగా, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.110 పెరిగి రూ.78,040 లకు చేరింది.
ఇదీ చదవండి: సిప్‌తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
మళ్లీ రూ.లక్ష దాటిన వెండి
మరోవైపు వెండి ధరలు (Silver Price Today) నేడు భారీగా ఎగిశాయి. హైదరాబాద్‌లో వెండి కేజీకి రూ.1500 పెరగడంతో మళ్లీ రూ.లక్షను దాటింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment