Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొచ్చాయి. మూడు రోజులుగా పెరుగుతున్న పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 6) స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాములకు రూ.250 మేర బంగారం ధర క్షీణించింది. తెలుగురాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎంత మేర తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయి.. అన్న విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలో పసిడి ధరలు
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ.77,620 లకు తగ్గింది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో..
» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.250 క్షీణించి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గి రూ.77,620 లకు తగ్గింది.
» బెంగళూరు 22 క్యారెట్ల బంగారం రూ.250 తగ్గి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ.77,620 లకు క్షీణించింది.
» ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.250 క్షీణించి రూ.71,150 లకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గి రూ.77,620 లకు తగ్గింది.
» ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 కరిగి రూ.71,300 లకు చేరగా, 24 క్యారెట్ల పసిడి రూ.270 తగ్గి రూ.77,770 లకు దిగొచ్చింది.
ఇదీ చదవండి: భారత్ బంగారం.. 882 టన్నులు
వెండి ధరలు
ఇక దేశవ్యాప్తంగా వెండి ధరలలో (Silver Price Today) నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,01,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.92,000 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment