దేశంలో బంగారం ధరలు (Gold Price) మళ్లీ భగ్గుమన్నాయి. పండుగకు ముందు వరుసగా పెరిగిన పసిడి రేట్లు మరోసారి హ్యాట్రిక్ కొట్టాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 17) భారీగా ఎగిశాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మాత్రం తగ్గం లేదు.
పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.600 (22 క్యారెట్స్), రూ.650 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,500కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,270 వద్దకు ఎగిశాయి.
ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,420 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,650 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.600, రూ.650 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.
చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ. 74,500 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 ఎగిసి రూ. 81,270 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు హ్యాట్రిక్ పెరుగుదలను కనబర్చాయి. వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు, ఢిల్లీలో రూ. 96,500 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Comments
Please login to add a commentAdd a comment