గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు! | Gold Prices Surge Within Hours Sharp Rise Seen Across Major Indian Cities | Sakshi
Sakshi News home page

గంటల వ్యవధిలో.. మారిపోయిన గోల్డ్, సిల్వర్ రేటు!

Apr 6 2026 8:04 PM | Updated on Apr 6 2026 8:11 PM

Gold Prices Surge Within Hours Sharp Rise Seen Across Major Indian Cities

బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్లలో చాలా మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం ఈ కథనంలో చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు (ఏప్రిల్ 6) ఉదయం రూ.1,36,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,38,100 రూపాయల వద్దకు చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,49,130 నుంచి రూ.1,50,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

చెన్నైలో బంగారం ఉదయం అమాంతం తగ్గి.. సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,50,660 రూపాయల దగ్గర నుంచి 1,52,620 రూపాయల వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,100 నుంచి రూ.1,39,900 వద్దకు చేరింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150810 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,38,250 వద్ద ఉంది.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఉదయం ధరలు స్థిరంగా ఉండటం చేత రూ.2.55 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.2.60 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు మళ్లీ దూసుకెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement