Gold Price Today: దేశంలో నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈరోజు (అక్టోబర్ 2) పసిడి ధరలు 10 గ్రాములకు రూ.500 పైగా పెరిగాయి. ఈ పెరుగుదల ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నమోదైంది.
హైదరాబాద్ పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం తులం(10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.71,000 లకు చేరింది. అయితే 24 క్యారెట్ల బంగారం విషయంలో మాత్రం కాస్త ఊరట లభించింది. ఇది రూ.10 తగ్గి రూ. 76,900 వద్దకు వచ్చింది.
ఇక విశాఖపట్నం, విజయవాడ సహా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.71,000 లకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగి రూ. 77,450 వద్దకు చేరింది. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.500 పెరిగి రూ.71,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.540 పెరిగి రూ.77,600 వద్దకు ఎగిశాయి.
ఇదీ చదవండి: గోల్డ్ లోన్ల మంజూరులో లోపాలు.. ఆర్బీఐ డెడ్లైన్
నిలకడగా వెండి
Silver Price Today: దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు కూడా నిలకడగా కొనసాగుతన్నాయి. గత నాలుగు రోజులుగా వెండి ధర ఎలాంటి కదలిక లేకుండా స్థిరంగా ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి రూ.1,01,000 వద్దే కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment