Gold Price Today: దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులలో దడ పుట్టిస్తున్నాయి. పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 11) హ్యాట్రిక్ కొట్టాయి. వరుసగా మూడో రోజు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మూడు రోజుల్లో బంగారం ధర తులానికి (10 గ్రాములు) దాదాపు రూ. 1800 పైగా పెరిగింది.
ఇక ఈరోజు పసిడి ధరలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లపై రూ.800, 24 క్యారెట్లపై రూ.870 చొప్పున పెరిగింది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.72,850, రూ.79,470 వద్దకు ఎగిశాయి.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరిగి రూ.73,000 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ. 870 ఎగిసి రూ.79,620 వద్దకు చేరాయి. ఇక చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.72,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.79,470 లుగా ఉన్నాయి. క్రితం రోజుతో పోల్చితే నేడు వీటి ధరలు వరుసగా రూ.800, రూ.870 చొప్పున పెరిగాయి.
ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్ అకౌంట్.. అదిరిపోయే బెనిఫిట్లు
సిల్వర్ రివర్స్
దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) నేడు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో వెండి కేజీ ధర రూ.1,03,000 వద్ద ఉండగా ఢిల్లీలో రూ.95,500 వద్ద కొనసాగుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment