హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంత క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా భవన డిజైన్‌ను ఆయన ఆవిష్కరించారు. గూగుల్‌కు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ కానుంది. 30,000 మందికిపైగా ఉద్యోగులు ఇక్కడ పనిచేయడానికి వీలుగా భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలాన్ని సంస్థ 2019లో కొనుగోలు చేసింది.
యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని 2015లో కేటీఆర్ సందర్శించారు. సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఆ సందర్భంగా ఒప్పందం కుదిరింది. ఇప్పటికే హైదరాబాద్‌లో గూగుల్ 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.
సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా !
వెనుకబడిన యువతకు గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ స్కాలర్‌షిప్‌లను ఆఫర్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉపకార వేతనాలు అందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్‌తో కలిసి గూగుల్ పనిచేయనుంది. ఐటీ సపోర్ట్, ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఉంటుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు వివిధ సంస్థలతో అనుసంధానిస్తారు. అలాగే వి–హబ్‌తో కలిసి విమెన్‌విల్ కార్యక్రమాన్ని సైతం గూగుల్ చేపట్టనుంది. మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు మార్గదర్శకత్వం, మద్దతు అందిస్తారు. విద్యార్థులకు డిజిటల్ విద్య చేరువయ్యేందుకు ప్రభుత్వ పాఠశాలలతో కలిసి గూగుల్ పని చేయనుంది.
చదవండి👉జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు!
Comments
Please login to add a commentAdd a comment