ముంబై: రానున్న పండగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్) బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లను లోన్స్, ఈఎమ్‌ఐ, క్యాష్‌బ్యాక్స్, క్రెడిట్ కార్డ్స్, గిఫ్ట్ వోచర్స్, తదితర విభాగాలలో వర్తింప చేయనున్నట్లు ప్రకటించింది. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆటో, పర్సనల్ తదితర రుణాలలో ప్రాసెసింగ్ ఫీజు తగ్గించనున్నట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దిగ్గజ రిటైల్ బ్రాండ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు, అదనపు రివార్డ్ పాయింట్లు, ఆన్-లైన్ కొనుగోళ్లలో అందిస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, టాటాక్లిక్, మైంట్రా, పెప్పర్‌ఫ్రై, స్విగ్గీ, గ్రోఫర్స్ వంటి ఆన్‌లైన్ మేజర్‌లతో ఈ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.
మరోవైపు విజయ్ అమ్మకాలు, కోహినూర్, జీఆర్‌టీ, ఓఆర్‌ఆర్‌ఏ వంటి వివిధ ఉత్పత్తులు, సేవలపై 5 నుంచి 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను హెడ్‌ఎఫ్‌సీ అందిస్తుంది. ఈ ఆఫర్లపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి స్పందిస్తు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దేశ ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పండగల వేళ దేశంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందని, అందుకు గాను దేశ ప్రజల కొనుగోలు శక్తి మరింత పెంచేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తక్కువ రుణాల ఆఫర్లను ప్రకటించిందని ఆదిత్య పురి పేర్కొన్నారు. కాగా గత రెండు, మూడు నెలలుగా బ్యాంక్ రుణాలు తీసుకునేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారని, పండగ సీజన్లో కస్టమర్లు సంతృప్తి పరచే విధంగా తమ ఆఫర్లు ఉంటాయని ఆదిత్య పురి పేర్కొన్నారు. (చదవండి: కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం)
Comments
Please login to add a commentAdd a comment