ఇళ్ల కొనుగోలు దారులకు శుభవార్త. వచ్చే ఏడాదిలో ఇళ్ల ధరలు భారీగా తగ‍్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ-లాంచ్ సేల్ ఆఫర్ల కారణంగా 2022 మార్చి నెల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ డైరెక్టర్ వై. కిరణ్ తెలిపారు.
అనరాక్ ప్రాపర్టీ
అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..సెప్టెంబర్ 30 నాటికి బిల్డర్లు 58,535 యూనిట్ల అమ్ముడుపోని ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు 8,000 యూనిట్లు మార్కెట్‌లో ఉండగా..ఈ కాలంలో 6,735 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సప్లయి ఎక్కువగా ఉండి, కొనుగోలు దారులు లేకపోవడంతో ప్లాట్లు అమ్ముడుకావడం లేదని, ఆ ప్లాట్లను సేల్ చేయాలంటే కొనుగోలు దారులకు అనుగుణంగా ధరల్ని తగ్గించడమని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు
ఈ నేపథ్యంలో గత కొద్ది కాలం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ డైరెక్టర్ వై. కిరణ్ స్పందించారు. 'చాలా కాలం క్రితం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎండ్యూసర్స్ మార్కెట్‌గా ఉండేది. ఇక్కడ ఎక్కువ మంది కొనుగోలుదారులు నివసించడానికి ఇళ్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు, ప్రీలాంచ్ సేల్ కాన్సెప్ట్ కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తుంది. తద్వారా ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ, పెట్టుబడిదారులు, బిల్డర్‌లు మార్కెట్ ధరకే ప్లాట్లను అమ్మడం కష్టంగా మారింది. దీంతో అమ్ముడుపోని ప్లాట్లు భారీగా మిగిలిపోతున్నాయని చెప్పారు. చాలా మంది కొనుగోలు దారులు ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులలో ఫ్లాట్‌ను కొనుగోలు చేయడం కంటే ఇతర బిల్డర్‌ల నుండి ప్రీ-లాంచ్ సేల్ ఆఫర్ ను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తద్వారా రియల్ ఎస్టేట్ ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్‌కే కాదండోయ్..ఈవీ ఇళ్లకూ భారీగా డిమాండ్ పెరిగింది..!
Comments
Please login to add a commentAdd a comment