real estate market
-
హైదరాబాద్ లో డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఇవే..
-
రియల్ బూమ్!
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో రెండు దశాబ్దాల పాటు భారీ బూమ్‌ను చూడనుంది. 2021 చివరికి 0.2 ట్రిలియన్ డాలర్లు (రూ.16.6 లక్షల కోట్లు సుమారు)గా ఉన్న మార్కెట్.. 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 830 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఇళ్లకు బలమైన డిమాండ్ కొనసాగుతోందని, మందగమన సంకేతాలు లేవని క్రెడాయ్ స్పష్టం చేసింది. ‘‘2021 నాటికి 0.2 ట్రిలియన్ డాలర్లతో భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగ వాటా 6–8 శాతం మధ్య ఉంది. గణనీయంగా పెరిగి 2031 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 2047 నాటికి 3 నుంచి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ఇది కనీస అంచనా మాత్రమే. వాస్తవానికి 5–7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఆశావహంగా చూస్తే 7–10 ట్రిలియన్ డాలర్లకు సైతం చేరుకునే అవకాశాలున్నాయి. అప్పటికి భారత జీడీపీలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 14–20 శాతం మధ్య ఉంటుంది’’ అని క్రెడాయ్, కొలియర్స్ ఇండియా నివేదిక తన అంచనాలను విడుదల చేసింది. అన్ని రియల్ ఎస్టేట్ విభాగాల్లోనూ స్థిరీకరణకు తోడు సంస్థల పాత్ర పెరుగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆఫీస్, నివాస రియల్ ఎస్టేట్‌తోపాటు, డేటా సెంటర్లు, వృద్ధుల ప్రత్యేక నివాసాల వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లో బలమైన వృద్ధిని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. చిన్న పట్టణాలకూ విస్తరణ.. రియల్ ఎస్టేట్ వృద్ధి పెద్ద పట్టణాలను దాటి చిన్న పట్టణాలకూ చేరుకుంటుందని క్రెడాయ్–కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘వేగవంతమైన పట్టణీకరణ, మధ్య వయసు జనాభా పెరుగుతుండడం, టెక్నాలజీ పరంగా పురోగతితో కొత్త తరం వృద్ధి, వైవిధ్య దశకంలోకి అడుగు పెట్టాం’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. 2047 నాటికి భారత జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే నివసించనున్నట్టు అంచనా వేశారు. దీంతో ఇళ్లు, కార్యాలయాలు, రిటైల్ వసతులకు ఊహించనంత డిమాండ్ ఏర్పడనున్నట్టు తెలిపారు.జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ అవసరం రియల్టీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ ప్రయోజనం కలి్పంచాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ డిమాండ్ చేశారు. అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చివరిగా 2017లో రూ.45 లక్షల వరకు ధరల్లోని వాటిని అందుబాటు ధరల ఇళ్లుగా పేర్కొనడం గమనార్హం. ఈ వృద్ధి నాన్‌స్టాప్!ఇళ్లకు డిమాండ్ బలంగా కొన సాగుతోందని, మందగమన సంకేతాల్లేవని క్రెడాయ్ స్పష్టం చే సింది. క్రెడాయ్ నాట్కాన్ సదస్సు సోమవారం ఢిల్లీలో మొదలైంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. డిమాండ్‌కు తగ్గ ఇళ్ల సరఫరా అవసరం ఉందని క్రెడాయ్ తెలిపింది. ఏదైనా ఓ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు తగ్గడం అన్నది, కొత్త ఆవిష్కరణలు తక్కువగా ఉండడం వల్లేనని పేర్కొంది. కరోనా విపత్తు తర్వాత ఇళ్లకు మొదలైన డిమాండ్ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు వివరించింది. డిమాండ్‌కు తగ్గ నిల్వలు లేవని ప్రెస్టీజ్ గ్రూప్ సీఎండీ, క్రెడాయ్ మాజీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ రజాక్ తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు జూమ్
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి–జూన్) బలమైన పనితీరు నమోదు చేసిందిజ ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 21 శాతం పెరిగి 18,573 యూనిట్లకు చేరాయి. ఇదే కాలంలో ఆఫీస్ వసతులకు డిమాండ్ 71 శాతం పెరిగి 5 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–జూన్ కాలంలో 11 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 1.73 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఎనిమిది నగరాల్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 33 శాతం పెరిగి 34.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బలంగా ఉండడం బలమైన ఆర్థిక మూలాలాలను, స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. దీని ఫలితమే ఇళ్ల అమ్మకాలు, కార్యాలయ వసతుల లీజింగ్ దశాబ్ద గరిష్ట స్థాయికి చేరుకోవడంగా పేర్కొన్నారు. 2024 తొలి ఆరు నెలల్లో మొత్తం అమ్మకాల్లో 34 శాతం ఖరీదైన ఇళ్లే ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం ఆఫీస్ వసతుల డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపించింది. స్థిరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులకు తోడు, ప్రస్తుత వృద్ధి జోరు ఆధారంగా 2024 సంవత్సరం మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు, వాణిజ్య వసతుల లావాదేవీలు బలంగా నమోదవుతాయనే అంచనా వేస్తున్నాం’’అని బైజాల్ వివరించారు. పట్టణాల వారీగా గణాంకాలు.. → ముంబై నగరంలో ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో 47,259 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 16 శాతం అధికం. ఇక ఆఫీస్ వసతుల లీజింగ్ పరిమాణం 79 శాతం వృద్ధితో 5.8 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 28,998 యూనిట్లుగా ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు చేరాయి. కార్యాలయ స్థలాల లీజింగ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → పుణెలో 24,525 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది 13 శాతం వృద్ధికి సమానం. ఆఫీస్ వసతుల లీజింగ్ 88 శాతం పెరిగి 4.4 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → చెన్నైలో 12 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 7,975 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ ఆఫీస్ వసతులకు డిమాండ్ 33 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. → కోల్‌కతాలో 9,130 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూస్తే 25 శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజు సైతం 23 శాతం వృద్ధితో 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్ పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 17 శాతం వృద్ధితో 9,377 యూనిట్లకు చేరాయి. ఆఫీస్ వసతుల లీజింగ్ భారీ వృద్ధితో 1.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది.సానుకూల పరిస్థితుల అన్ని ధరల విభాగాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా ఉన్నట్టు గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అధిక వృద్ధికితోడు, మౌలిక వసతుల అభివృద్ధి డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. సొంతిల్లు కలిగి ఉండాలనే అభిలాష, కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలు ఈ వృద్ధిని ప్రధానంగా నడిపిస్తున్నాయని ప్రాపర్టీ ఫస్ట్ రియల్టీ వ్యవస్థాపకుడు, సీఈవో భవేష్ కొఠారి అభిప్రాయపడ్డారు. -
ప్రభుత్వం మారితే.. విరామం సహజమే!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడైనా సరే స్థిరాస్తి మార్కెట్లో ప్రభుత్వం మారితే విరామం సహజమే. బ్రేక్ తర్వాతే సినిమాలో అసలు కథ మొదలైనట్టే.. రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ తాత్కాలిక స్తబ్ధత తర్వాతే రెట్టింపు వేగంతో పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. పాత విధానాల సమీక్ష, కొత్త పాలసీల రూపకల్పనకు సమయం పడుతుందని అప్పటివరకు మార్కెట్ మందకొడిగా ఉండటం సాధారణమేనని అభిప్రాయపడ్డారు. ► అనుమతుల మంజూరులో కమిటీల నియామకం, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థిరాస్తి రంగంపై ప్రభావం పడుతుంది ఇది సాధారణ ప్రక్రియే. దీంతో భూ లావాదేవీలలో స్తబ్ధత ఏర్పడుతుంది. గత 4 ఏళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు అసహజంగా పెరిగిపోయాయి. స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బడా వ్యాపారస్తుల భూముల కొనుగోళ్లు జరుపుతుంటారు. దీంతో సహజంగానే రేట్లు పెరుగుతాయి నగరంలో జరిగిందే. కొత్త లాంచింగ్లొద్దు.. ప్రతికూల సమయంలో కొత్త ప్రాజెక్ట్‌లను లాంచింగ్ చేసి పరిశ్రమ మీద భారం వేయకూడదు. వచ్చే 1–2 ఏళ్ల పాటు కొత్త యూనిట్లను ప్రారంభించడం కంటే పాత ప్రాజెక్ట్‌లలో విక్రయాలు చేపట్టడం, నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. మా ర్కెట్ పరిస్థితులు, ధోరణులను సమగ్రంగా అధ్య యనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృథా ఖర్చులు తగ్గించుకుంటూ నిర్మాణ పనులకే నిధులను కేటాయించాలి. కొనేముందు జాగ్రత్తలివే.. ► రాత్రికి రాత్రే బిల్డర్లుగా అవతారం ఎత్తి, తక్కువ ధరకే ఫ్లాట్లను ఇస్తామని మాయ మాట లు చెప్పే డెవలపర్లకు దూరంగా ఉంటే బెటర్. ► అప్పటికప్పుడే నిర్ణయాలుకాకుండా 2–3 నెల లు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించాలి. ► ప్రతికూల సమయంలోనూ గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసే ఆరి్ధక స్థోమత ఉన్న బిల్డర్ల వద్ద కొనుగోలు చేయడమే సురక్షితం. ► అన్ని అనుమతులతో పాటు మార్కెట్లో పేరున్న నిర్మాణ సంస్థలోనే కొనడం ఉత్తమం. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినవివే.. ► 111 జీ.ఓ రద్దు చేశారు కానీ విధి విధానాలపై స్పష్టత ఇవ్వలేదు. జోన్ల కేటాయింపు, నిర్మాణ పనులకు అనుమతి తదితరాలపై క్లారిటీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగ మార్పు చాలా క్లిష్టతరంగా మారింది. బిల్డర్లకే కాదు సామాన్యులకు సైతం భూ మార్పిడి చేసుకునేందుకు వీలుండే విధంగా ప్రక్రియను సులభతరం చేయాలి. ► ధరణి లోటుపాట్లపై కమిటీ సమరి్పంచిన నివేదికను సాధ్యమైనంత తర్వగా అమలు చేయాలి. పర్యావరణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలి. బేరసారాలకు ఇదే సమయం భౌగోళికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. హైదరాబాద్‌లో ఇప్పటికీ స్థిరాస్తి పెట్టుబడులలో సింహభాగం వాటా తెలుగు ప్రజలవే ఉంటాయని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. హైదరాబాద్ స్థిరమైన నగరం కావడంతో పాటు అధిక ఆదాయం, ఉద్యోగ కల్పన, మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపిస్తుంటారన్నారు. సాధారణంగా ఎన్నికల ఏడాదిలో మార్కెట్ స్తబ్దుగానే ఉంటుంది. అయితే వాస్తవానికి నిజమైన కొనుగోలుదారులకు గృహ కొనుగోళ్లకు ఇదే సరైన సమయం. ఎందుకంటే విక్రయాలు మందకొడిగా సాగే ఈసమయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. రోజువారి కార్యకలాపాలు, నిర్మాణ పనులకు అవసరమైన వ్యయం కోసం రేటు కాస్త అటుఇటైనా డెవలపర్ ఒక మెట్టు దిగే ఛాన్స్ ఉంటుంది. -
షాకింగ్:హైదరాబాద్ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి. ► అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు జనవరి-మార్చి కాలంలో 16 శాతం పెరగ్గా, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరగడం వరుసగా 11వ త్రైమాసికంలోనూ నమోదైంది. చదరపు అడుగు ధర 16 శాతం వృద్ధి చెంది రూ.8,432కు చేరుకుంది. ► ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇళ్ల ధరలు 59 శాతం మేర పెరిగాయి. గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్డులో 42 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. ►అహ్మదాబాద్ ప్రాంతంలో 11 శాతం వృద్ధి కనిపించింది. చదరపు అడుగు ధర రూ.6,324గా ఉంది. ►బెంగళూరులో చదరపు అడుగు ధర 14 శాతం పెరిగి రూ.8,748కి చేరుకుంది. చెన్నైలో చదరపు అడుగు ధర 4 శాతం వృద్ధితో రూ.7,395కు చేరింది. ► కోల్‌కతాలో 15 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,211గా ఉంది. ► పుణెలో 11 శాతం పెరిగి రూ.8,352గా నమోదైంది. ► ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో మాత్రం 2 శాతం తగ్గి చదరపు అడుగు ధర రూ.19,219గా నమోదైంది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) వృద్ధి కొనసాగుతుంది.. రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్ సర్వీసెస్ కు చెందిన అక్యుపయర్ సర్వీసెస్ ఎండీ పీయూష్ జైన్ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) -
స్పోర్ట్స్ థీమ్డ్ ప్రాజెక్ట్‌తో వస్తున్న జీ స్క్వేర్
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్క్వేర్ హౌసింగ్ సంస్థ ఇప్పడు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. రియాల్టీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాంపాదించిన జీ స్క్వేర్ హౌసింగ్ హైదరాబాద్‌లోనూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీఎన్ రెడ్డి నగర్లో మొట్టమొదటి స్పోర్ట్ థీమ్డ్ లగ్జరీ ప్లాట్ కమ్యూనిటీని ‘జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్’ (G Square Eden Garden) పేరుతో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. విలాసవంతమైన సౌకర్యాలు, కస్టమర్లు కొరుకునే వసతులు వంటివి ప్రత్యేకతలుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కమ్యూనిటీలలో నివసించేందుకు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ఇంతవరకు జీ స్క్వేర్ చేపట్టిన ప్రాజెక్ట్‌లన్నీ కూడా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, మెట్రోలు, మాల్స్ వంటి వాటికి సులభమైన యాక్సెస్‌ని అందించే గేటెడ్ కమ్యూనిటీలే. అంతేకాకుండా తక్షణమే నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా కూడా ఉంటాయి. కస్టమర్ల సౌకర్యాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ల రూపకల్పన వీరి స్పెషాలిటీ. ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఇందులో 484 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ(GHMC), TS (RERA) ద్వారా పూర్తి స్థాయి అమోదం పొందింది. ఇక్కడి నుంచి 5 నిమిషాల ప్రయాణం చేస్తే చాలు ఎల్బీ నగర్ సర్కిల్ చేరుకుంటాం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ హైవేకి పక్కనే ఉండడం ప్లాటెడ్ కమ్యూనిటీలోని సభ్యులందరూ ప్రపంచ శ్రేణి వసతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తుంది. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పార్కులలో ఒకటిగా ఉన్న ఆదిబట్లకు సమీపంలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్ సౌకర్యాలు అదరహా.. బ్లాక్-టాప్ రోడ్లు, ప్రీమియం స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అద్బతమైన నీటి సరఫరా వ్యవస్థ, అత్యుత్తమ డ్రైనేజీ అవుట్లెట్ సిస్టమ్‌తో పాటు 5 సంవత్సరాల ఫ్రీ మెయిన్టెనెన్స్ జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్ లగ్జరీతో పాటు ప్రశాంతమైన లివింగ్ స్టైల్ కోరుకునే వారి కోసం 100+ ప్రపంచ స్థాయి సౌకర్యాలు తన కస్టమర్లకు అందిస్తోంది. అందులో 40+ ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సరసమైన ధరతో కూడిన ఈ విల్లా ప్లాట్లు ప్రాజెక్ట్ సొంతం. జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ ..‘‘ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. నగరంలో జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్‌ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాము. ఇందులో కస్టమర్లు కోరుకునే సౌకర్యాలు, లగ్జరీ వసతులు, రవాణా సదుపాయం, క్రీడా సౌకర్యాలు వంటి ఈ ప్రాజెక్ట్‌కు ఆకర్షణగా నిలుస్తాయి. ప్లాట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, నగరంలో తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది గొప్ప అవకాశమన్నారు’’ (అడ్వర్టోరియల్) -
తొమ్మిది నెలల్లో 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చా యి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి అని కొల్లియర్స్ సర్వే వెల్లడించింది. ఆయా పెట్టుబడులలో 53 శాతం కార్యాలయ సముదాయంలోకి, 1,802 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 537శాతం వృద్ధి రేటుతో రిటైల్ విభాగంలోకి 491 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గిడ్డంగులు, నివాస సముదాయాల పెట్టుబడులు ఈసారి క్షీణించాయి. క్రితం ఏడాది జనవరి-సెప్టెంబర్‌లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌లోకి 895 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈసారి 78శాతం తగ్గి 199 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇక గృహ విభాగంలో 472 మిలియన్ డాలర్ల నుంచి 42 శాతం క్షీణించి 276 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు చేరుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో సంవత్సరానికి 2.5 రెట్లు పెరిగి 754 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది గత ఏడాది 301 మిలియన్ల డాలర్లతో పోలిస్తే. మొదటి తొమ్మిది నెలల్లో ఈ సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించింది, బెంగళూరులో పెట్టుబడులు 18 శాతం పెరిగి 317 మిలియన్ డాలర్ల నుంచి 375 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. చెన్నైకి ఇన్‌ఫ్లోలు 98 మిలియన్ డాలర్ల నుంచి 345 మిలియన్ డాలర్లకు పెరిగాయి.ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు 5 శాతం పెరిగి 452 నుంచి 477 మిలియన్ డాలర్ల చేరాయి. అయితే పూణేలో 96 శాతం క్షీణించి 232 9 మిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఇక హైదరాబాద్, కోల్‌కతాలో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌లో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. గత ఏడాది హైదరాబాద్‌కు 486 మిలియన్ డాలర్లు, కోలకతాకు 105 మిలియన్ల డాలర్లు వచ్చాయి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల సెంటిమెంట్ గ్లోబల్ మందగమనం ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనే భావన బలంగా ఉందనీ, ద్రవ్యోల్బణం ,వడ్డీ రేట్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక స్థితిపై దీర్ఘకాలిక ప్రభావం లేదని సర్వే తెలిపింది. -
కొత్త జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి మార్కెట్ విలువల్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించనుంది. జిల్లాల నోటిఫికేషన్ వెలువడి నూతన జిల్లా కేంద్రాలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ మార్కెట్ విలువలు మారేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో మార్కెట్ విలువల్ని సవరిస్తారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో సవరణను వాయిదా వేశారు. 2022 ఏప్రిల్ వరకు సవరణ ఉండదని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో సవరణ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి రెండు విడతలుగా మార్కెట్ విలువల సవరణపై కసరత్తు మొదలు పెట్టారు. మొదట కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలపై కసరత్తు చేశారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విలువల సవరణపైనా కసరత్తు పూర్తి చేశారు. వృద్ధి ఆధారంగా మార్కెట్ విలువల సవరణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి? ఆ ప్రాంతాల్లో జరిగిన వృద్ధి, కొత్తగా వచ్చిన పరిశ్రమలు, పెరిగిన వ్యాపారం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువల్ని ప్రతిపాదించారు. వాటికి జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తాత్కాలిక అనుమతులు ఇచ్చాయి. వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు చేసి మార్కెట్ విలువల్ని నిర్ధారించారు. ఆ విలువలకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం కూడా తీసుకున్నారు. ఏ క్షణమైనా మార్కెట్ విలువల్ని సవరించడానికి అనువుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ కూడా చేసుకుని అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాల పరిధిలో స్థిరాస్తి మార్కెట్ విలువల సవరణ అమలవుతుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు ప్రకటించాక ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, స్థిరాస్తి లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఇల్లు.. డిమాండ్ ఫుల్లు!
ముంబై: భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చక్రంలో ఉందని, ఇళ్లకు ఇక ముందూ డిమాండ్ బలంగానే ఉంటుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో ఇళ్ల మార్కెట్ వాస్తవికంగా ఉంటుందని, స్పెక్యులేషన్ శైలితో నడవదన్నారు. సీఐఐ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందస్తు స్థాయిని దాటిపోవడం బలమైన విశ్వాసానికి నిదర్శనంగా దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారితోపాటు, పెద్ద ఇళ్లకు మారేవారి నుంచి డిమాండ్ వస్తున్నట్టు చెప్పారు. ‘‘నా 50 ఏళ్ల వృత్తి జీవితంలో ఇళ్లు అందుబాటు ధరల్లో లభించడం ఇప్పుడున్న మాదిరిగా ఎప్పుడూ చూడలేదు. పుష్కలమైన నగదు లభ్యత, కనిష్ట వడ్డీ రేట్లు, ఇంటి యజమాని కావాలనే కోరికను గతంలో ఈ స్థాయిలో చూడలేదు. పాశ్చాత్య దేశాల్లో ఇళ్ల ధరలు కరోనా విపత్తు సమయంలో గణనీయంగా పెరగడం చూసే ఉంటారు. సరఫరా పెరగకపోవడానికితోడు, పెట్టుబడులు, స్పెక్యులేషన్ ధోరణి ధరలు పెరగడానికి కారణం. కానీ భారత్‌తో ఇళ్లకు డిమాండ్ నిజమైన కొనుగోలు దారుల నుంచే వస్తుంది. ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కనిష్ట వడ్డీ రేట్లు మద్దతుగా నిలిచాయి. రియల్ ఎస్టేట్ పరిశ్రమ గత క్షీణత సైకిల్ నుంచి కోలుకుంది’’అని పరేఖ్ వివరించారు. ఆదాయాలు పెరిగాయి... జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి 11 శాతంగా ఉన్నట్టు దీపక్ పరేఖ్ తెలిపారు. ఐటీ, ఈ కామర్స్, ప్రొఫెషనల్ సర్వీసులు, ఆర్థిక సేవల రంగం, పెద్ద కంపెనీల్లో పనిచేసేవారు, నూతన తరం పారిశ్రామికవేత్తలకు ఆదాయ స్థాయిలు పెరిగాయని చెప్పారు. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరిగితే చిన్న వయసులోనే ఇళ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాజెక్టుల ధరలు 15–20 శాతం వరకు పెరిగినట్టు చెప్పారు. కానీ, అందుబాటు ధరల ఇళ్లు ఇప్పటికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్నట్టు తెలిపారు. వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగితే అది ఇళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపబోదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) కాన్సెప్ట్‌కు ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాలని డెవలపర్లకు çపరేఖ్ సూచించారు. కరోనా కాలంలోనూ.. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించినా, పలు విడతలుగా మహమ్మారి విరుచుకుపడినా.. రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి బలంగా నిలదొక్కుకుంది. అంతేకాదు వృద్ధి క్రమంలో ప్రయాణిస్తోంది. నివాస గృహాల మార్కెట్ వృద్ధి క్రమంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుకుతోడు, కనిష్ట వడ్డీ రేట్లు ఉండడంతో 2022లోనూ రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు అదే పనిగా పెరిగిపోవడం 2021లో ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది. – ధ్రువ్ అగర్వాల్, ప్రాప్‌టైగర్.కామ్ గ్రూపు సీఈవో -
మార్కెట్ విలువలపై అధ్యయనం
సాక్షి, అమరావతి: స్థిరాస్తి మార్కెట్ విలువలపై రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుని స్థానిక మార్కెట్ విలువలు ఏమైనా పెరిగాయా? అనే కోణంలో విస్తృత సమాచారాన్ని సేకరిస్తోంది. ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా, ఎంఆర్వో, ఎంపీడీవో సభ్యులుగా కమిటీలు నియమించారు. పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్‌గా జడ్పీ సీఈవో, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఏకాభిప్రాయంతో ప్రతిపాదనలు సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, భూ మార్పిడి తదితర అంశాల ఆధారంగా మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని కమిటీ సమావేశాల్లో చర్చించి ఏకాభిప్రాయంతో మార్కెట్ విలువలపై ప్రతిపాదనలు తయారు చేస్తారు. అనంతరం ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కూడా స్వీకరించి మార్పులు చేర్పులుంటే నమోదు చేస్తారు. అనంతరం తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. వీటి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ విలువలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీలోపు ప్రతిపాదనలు సమర్పించాలని కమిటీలకు ప్రభుత్వం సూచించింది. గడువు ముగియనుండటంతో.. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి అభివృద్ధిని బట్టి ఆయా ప్రాంతాల మార్కెట్ విలువలను సవరిస్తారు. కరోనా కారణంగా గత సంవత్సరం సవరణను ప్రభుత్వం వాయిదా వేసింది. 2022 మార్చి 31 వరకు సవరణను వాయిదా వేస్తున్నట్లు గతేడాది ఉత్వర్వులిచ్చింది. ఆ గడువు ముగియనుండటంతో మార్కెట్ విలువలపై అధ్యయనం చేస్తోంది. -
విక్రయాలలో సైట్ ఆఫీస్ కీలకం
సాక్షి, హైదరాబాద్: షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు మన చూపు అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దిన డిస్ప్లే వస్తువులపై పడుతుంది. వెంటనే ఆయా వస్తువుల కొనేందుకు లేదా ఎంక్వైరీకి ప్రయత్నిస్తాం. ఇదే తరహాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ సైట్ ఆఫీస్ డిస్ ప్లే లాంటిది. శక్తివంతమైన మార్కెటింగ్ సాధనమిది. లగ్జరీ గృహాలతో పాటూ అఫర్డబుల్, మిడ్ సైజ్ గృహాల విక్రయాలలోనూ సైట్ ఆఫీస్ అనేది అత్యంత కీలకంగా మారింది. మన దేశంలో గృహ విక్రయాలు పోర్టా క్యాబిన్స్ లేదా నమూనా ఫ్లాట్ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తుంటారు. సేల్స్ ఆఫీస్ అనేది ముందుగా లగ్జరీ ప్రాజెక్ట్‌లలో డెవలపర్లు అనుభవం, ప్రాజెక్ట్ ఆఫర్ల గురించి ఏర్పాటు చేసేవాళ్లు. తర్వాతి కాలంలో ఈ కాన్సెప్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు కూడా పాకింది. ఎక్కువ మంది కస్టమర్లకు వసతి కల్పించడానికి, విక్రయాలను క్రమబద్దీకరించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి కొత్త ప్రాజెక్ట్ సైట్లో సేల్స్ ఆఫీస్ ఉంటుంది. సేల్స్, సైట్ ఆఫీస్ లేదా సేల్స్ గ్యాలరీ అనేది మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీలో సమగ్రమైన, కీలకమైన విభాగం. ఆకర్షణీయమైన, సమగ్ర నిర్వహణ సేల్స్ ఆఫీస్ లేకపోతే విక్రయాలు కూడా గణనీయంగా క్షీణిస్తాయి. ప్రాజెక్ట్‌లోని ఉత్తమ ఫీచర్ల ప్రదర్శన, ప్రయోజనాల డిస్ప్లే, వాకిన్స్, సైట్ విజిట్స్ నిర్వహణ వంటివి సేల్స్ ఆఫీస్ ప్రత్యేకత. మార్కెటింగ్‌లో కీలకం.. ప్రాపర్టీల మార్కెటింగ్‌లో సేల్స్ ఆఫీస్ కీలకమైన విభాగంగా మారింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌పై కొనుగోలుదారులలో మంచి అభిప్రాయం కలిగేది సైట్ ఆఫీస్ నుంచే మొదలవుతుంది. మార్కెటింగ్ బృందానికి అప్పటికే చేతిలోకి రాని ప్రాజెక్ట్‌లోని ఫీచర్లు, ప్రయోజనాలు కస్టమర్లకు అనుభవపూర్వకం చేసే అవకాశం కలుగుతుంది. అభివృద్ధి పనులు జరుగుతున్న దశల వారీగా సైట్ ఆఫీస్‌లో ప్రదర్శించే వీలుంటుంది. ఆయా ప్రాజెక్ట్‌లో తాము భాగస్వామ్యమైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే ఓ ఊహాజనిత చిత్రాన్ని చూపించేదే సైట్ ఆఫీస్. కొందరు కస్టమర్లు పలుమార్లు సైట్ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం ప్రభావవంతంగా, క్రియాత్మకంగా ఉండాలి. రియల్టీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రోజు నుంచి 2–3 ఏళ్ల పాటు సాగుతాయి. ప్రాజెక్ట్‌లోని ఇన్వెంటరీలో 90 శాతం విక్రయాలయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుందని అనరాక్ గ్రూప్ స్ట్రాటర్జీ హెడ్ సునీల్ మిశ్రా తెలిపారు. ► ప్రాజెక్ట్ నిర్మాణం, విక్రయాలు పూర్తయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుంది. నిర్మాణ సంస్థకు, కొనుగోలుదారులకు మధ్య వారధి లాంటివి సేల్స్ ఆఫీస్. ఇక్కడి నుంచే కస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ఫీచర్లను ప్రదర్శిస్తారు. దీంతో పాటు ధర నిర్ణయం, లావాదేవీలు కూడా జరుగుతాయి. ప్రవాస కస్టమర్లు మినహా వంద శాతం ప్రాపర్టీ లావాదేవీలు సైట్ ఆఫీస్‌ల నుంచే జరుగుతాయి. సేల్స్ ఆఫీస్ అనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మాత్రమే కాదు.. కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్, 80–85 శాతం కస్టమర్ల ఫిజికల్ ప్రాపర్టీ అనుభవం ఇక్కడ్నుంచే జరుగుతాయి. మంచి సేల్స్ ఆఫీస్ కారణంగా కస్టమర్ల అంతర్గత ప్రచారంతో సైట్ విజిట్స్ పెరుగుతాయి. విక్రయాల నిష్పత్తి 4–5% వరకు వృద్ధి చెందుతాయి. కొత్త మార్కెట్లలో కూడా డెవలపర్ బ్రాండ్‌ను తెలిపేది సైట్ ఆఫీసులే. గ్రేడ్–ఏ, బీ డెవలపర్లు సేల్స్ ఆఫీస్‌ల నిర్వహణతో 50% విక్రయాలను మెరుగుపర్చుకుంటున్నారు. సేల్స్ ఆఫీస్ క్లబ్ హౌస్‌గా.. మంచి సేల్స్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 0.5 శాతం అవుతుంది. చాలా మంది డెవలపర్లు తాత్కాలిక సేల్స్ ఆఫీస్‌ను ఏర్పాటు కంటే శాశ్వత నిర్మాణాన్ని చేపడతారు. వాస్తవానికి ఇది మంచి నిర్ణయం. ప్రాజెక్ట్ పూర్తయ్యాక సేల్స్ ఆఫీస్‌ను క్లబ్ హౌస్‌గా మార్చేసి.. హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తారు. దీంతో సైట్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా సేల్స్ ఆఫీస్ పరిమాణం 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటుంది. కొన్ని టౌన్‌షిప్‌లలో 8 వేల నుంచి 10 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి కూడా ఉంటాయి. -
ఇళ్ల కొనుగోలు దారులకు శుభవార్త..!
ఇళ్ల కొనుగోలు దారులకు శుభవార్త. వచ్చే ఏడాదిలో ఇళ్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ-లాంచ్ సేల్ ఆఫర్ల కారణంగా 2022 మార్చి నెల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ డైరెక్టర్ వై. కిరణ్ తెలిపారు. అనరాక్ ప్రాపర్టీ అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ విడుదల చేసిన డేటా ప్రకారం..సెప్టెంబర్ 30 నాటికి బిల్డర్లు 58,535 యూనిట్ల అమ్ముడుపోని ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు 8,000 యూనిట్లు మార్కెట్లో ఉండగా..ఈ కాలంలో 6,735 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సప్లయి ఎక్కువగా ఉండి, కొనుగోలు దారులు లేకపోవడంతో ప్లాట్లు అమ్ముడుకావడం లేదని, ఆ ప్లాట్లను సేల్ చేయాలంటే కొనుగోలు దారులకు అనుగుణంగా ధరల్ని తగ్గించడమని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో గత కొద్ది కాలం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సుచిర్ ఇండియా గ్రూప్ సీఈఓ డైరెక్టర్ వై. కిరణ్ స్పందించారు. 'చాలా కాలం క్రితం, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎండ్యూసర్స్ మార్కెట్‌గా ఉండేది. ఇక్కడ ఎక్కువ మంది కొనుగోలుదారులు నివసించడానికి ఇళ్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు, ప్రీలాంచ్ సేల్ కాన్సెప్ట్ కొనుగోలు దారుల్ని ఆకర్షిస్తుంది. తద్వారా ప్రాజెక్ట్ పూర్తయినప్పటికీ, పెట్టుబడిదారులు, బిల్డర్లు మార్కెట్ ధరకే ప్లాట్లను అమ్మడం కష్టంగా మారింది. దీంతో అమ్ముడుపోని ప్లాట్లు భారీగా మిగిలిపోతున్నాయని చెప్పారు. చాలా మంది కొనుగోలు దారులు ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులలో ఫ్లాట్‌ను కొనుగోలు చేయడం కంటే ఇతర బిల్డర్ల నుండి ప్రీ-లాంచ్ సేల్ ఆఫర్ ను దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తద్వారా రియల్ ఎస్టేట్ ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్‌కే కాదండోయ్..ఈవీ ఇళ్లకూ భారీగా డిమాండ్ పెరిగింది..! -
ఫ్లాట్ ఖరీదు రూ.111 కోట్లు
కరోనా మహమ్మారి లగ్జరీ గృహాలను తాకలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, లగ్జరీ ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని నగరాలలో స్టాంప్‌డ్యూటీ, సర్కిల్ ధరల తగ్గింపులు వంటివి డిమాండ్ వృద్ధికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) మధ్య కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డ్ స్థాయిలో లగ్జరీ ప్రాపర్టీలు రూ.4 వేల కోట్లకు పైగా లావాదేవీలను నమోదు చేశాయని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్‌లో ప్రీమియం గృహాల విక్రయాలు 158 శాతం వృద్ధిని నమోదు చేశాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత ఆకర్షణీయమైన, ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముంబై ఒకటని మరోసారి రుజువైంది. ఈ ఏడాది హెచ్1లో ముంబైలో రూ.15 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ గృహాల లావాదేవీలపై స్క్వేర్ యార్డ్స్ నివేదికను విడుదల చేసింది. హెచ్1లోని మొత్తం గృహ విక్రయాలలో రూ.15 కోట్లకు పైగా ధర ఉండే గృహాలు 45 శాతం, రూ.30–40 కోట్ల ధర ఉండేవి 10 శాతం, రూ.50 కోట్లపైగానే ధర ఉండే గృహాలవి 7 శాతం లావాదేవీలు జరిగాయి. 60 శాతం లగ్జరీ గృహాల లావాదేవీలు సౌత్ ముంబైలోని లోయర్ పరేల్‌లోని నివాస ప్రాజెక్ట్‌లలోనే కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీని 2 శాతం తగ్గించడం, అధిక విలువ గల గృహాల ధరలలో 15–30 శాతం క్షీణించడం వంటివి లగ్జరీ ప్రాపర్టీల డిమాండ్‌కు ప్రధాన కారణమని స్క్వేర్ యార్డ్స్ బిజినెస్ హెడ్ ఆనంద్ మూర్తి తెలిపారు. 58 శాతం లావాదేవీలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో జరగగా.. 14 శాతం తుది దశకు చేరుకున్న నిర్మాణాలలో, 28 శాతం నిర్మాణంలో ఉన్న వాటిల్లో జరిగాయి. స్టాంప్‌డ్యూటీ తగ్గింపుతోనే జోరు.. ఈ ఏడాది మార్చి 31 వరకు 2 శాతం స్టాంప్‌డ్యూటీ మినహాయింపు అందు బాటులో ఉండటంతో జనవరి–మార్చి (క్యూ1) వరకు రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. ఆ తర్వాత త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. క్యూ1తో పోలిస్తే క్యూ2లో రిజిస్ట్రేషన్లు 73 శాతం తగ్గాయి. క్యూ1లోని మొత్తం రిజిస్ట్రేషన్ల లావాదేవీలలో లగ్జరీ గృహాల వాటా 79 శాతంగా ఉంది. వీటి విలువ రూ.3 వేల కోట్ల పైమాటే. ఇక క్యూ2 నాటికి వీటి వాటా 21 శాతానికి క్షీణించింది. విలువ రూ.900 కోట్లుగా ఉంది. రూ.50–100 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా క్యూ1లో 4 శాతంగా ఉండగా.. క్యూ2 నాటికి 1 శాతం క్షీణించి 3 శాతానికి చేరింది. క్యూ1లో రూ.100 కోట్లకు పైగా విలువ ఉన్న గృహాల వాటా 6 శాతంగా ఉండగా.. క్యూ2 నాటికి 2 శాతానికి చేరింది. ఎవరు కొన్నారంటే? నలభై, అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్లలో 34 శాతం లావాదేవీలు జరిగాయి. 43 శాతం ట్రాన్సాక్షన్స్ 4–6 వేల చ.అ. మధ్య విస్తీర్ణ గృహాలవే ఉన్నాయి. 67 శాతం గృహాలు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్లు కొనుగోలు చేయగా.. 40 శాతం లావాదేవీలు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్లే జరిపారు. బాంద్రాలోని మౌంట్‌మేరీ అపార్ట్మెంట్లో రూ.111 కోట్లతో 59,184 చ.అ.లలో అపార్ట్‌మెంట్‌ను అవధర్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసింది. మలబార్ హిల్స్‌లోని సీసేన్లో రూ.103 కోట్లతో 7,833 చ.అ. ఫ్లాట్‌ను అబిస్ రియల్కాన్ కొన్నది. లోయర్ పరేల్‌లోని రహేజా ఆర్టీసియాలో సుప్రీంకోర్ట్ న్యాయవాది నటాషా ఎస్ దాల్మియా 4,074 చ.అ. రెండు అపార్ట్మెంట్లను ఒక్కోటి రూ.34 కోట్లతో కొనుగోలు చేసింది. ఓశివారాలోని ది అట్లాంటిస్ ప్రాజెక్ట్‌లో అమితాబ్ బచ్చన్ 5,704 చ.అ. ఫ్లాట్‌ను రూ.31 కోట్లతో కొనుగోలు చేశారు. ఇదే ప్రాజెక్ట్‌లో సన్నీలియోన్ 4,365 చ.అ. ఫ్లాట్‌ను రూ.16 కోట్లతో కొనుగోలు చేసింది. వీరితో పాటు సినీ నిర్మాతలు, దర్శకులు ఎల్ రాయ్, విపుల్ అమృతల్ షా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపఖ్ పరేక్ భార్య స్మిత డీ పరేఖ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ అండ్ సీఈఓ ధీరజ్ రెల్లీ, మహారాష్ట్ర మంత్రి అశోక్ ఎస్ చవాన్, గోల్డ్‌మన్ శాక్స్ ఎండీ రజత్ సూద్ వంటి వాళ్లు జాబితాలో ఉన్నారు. రహేజా ఆర్టీసియా ప్రాజెక్ట్‌లో 18, ఇండియాబుల్స్ బ్లూలో 17, ఓంకార్ 1973, రహేజా వివేరా ప్రాజెక్ట్‌లలో చెరో 10 లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లోనూ ప్రీమియం జోరు కరోనా మహమ్మారి తర్వాతి నుంచి హైదరాబాద్‌లోనూ లగ్జరీ గృహాల విక్రయాలు, లాంచింగ్స్ జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది హెచ్1లో 11,974 గృహాలు అమ్ముడుపోగా... రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 44 శాతం, రూ.1–2 కోట్లకు పైన ధర ఉన్న యూనిట్లు 35 శాతం విక్రయమయ్యాయి. కొత్త గృహాల ప్రారంభాలను గమనిస్తే.. గతేడాది హెచ్2లోని మొత్తం లాంచింగ్స్‌లో లగ్జరీ గృహాల వాటా 18 శాతంగా ఉంది. అంటే మొత్తం 4,422 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 1,544 యూనిట్లు రూ.1–2 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్లే. ఇక ఈ ఏడాది హెచ్2లో చూస్తే.. మొత్తం 16,712 గృహాలు లాంచింగ్ కాగా 28 శాతం వృది రేటుతో 4,444 యూనిట్లు లగ్జరీ ఇళ్లే ఉన్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గండిపేట, కోకాపేట, మోకిల, శంకర్పల్లి, కొంపల్లి, బాచుపల్లి వంటి ప్రాంతాలలో ప్రీమియం అపార్ట్మెంట్లు, విల్లాలు, శివారు ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 6 వేల చ.అ.ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా అంతస్తుకు ఒకటే అపార్ట్మెంట్ ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా కారణంగా ఆతిథ్య రంగంలోని కంపెనీలు విస్తరణ లేకపోవటంతో వాటి యజమానులు, క్యాపిటల్ గెయిన్ లాభాలను ఆర్జించే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈ తరహా గృహాలను కొనుగోలు చేస్తున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఇతర పొదుపు సాధనాల కంటే ఎక్కువ రాబడి, భద్రత, పన్ను ప్రోత్సాహకాలు ఉండటంతో రియల్టీలో పెట్టుబడులు పెరిగాయి. అవసరమైనప్పుడు ఎక్కువ ధరకు విక్రయించుకునే వీలుండటంతో దీని వైపే మొగ్గుచూపుతున్నారు. -
గృహ అమ్మకాలపై కరోనా దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం దేశీయ నివాస విభాగం మీద గట్టిగానే పడింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో గృహాల అమ్మకాలు, ప్రారంభాలు రెండింట్లోనూ క్షీణత నమోదైంది. ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు 47 శాతం క్షీణించి 1.38 లక్షలకు చేరాయి. అలాగే కొత్త గృహాల ప్రారంభాలు 46 శాతం క్షీణించి 1.28 లక్షలకు చేరాయి. 2019లో అమ్మకాలు 2.61 లక్షల యూనిట్లు కాగా.. ప్రారంభాలు 2.37 లక్షలుగా ఉన్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 2019లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 6,48,400 కాగా.. 2020 నాటికి 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరాయి. కోవిడ్-19 వైరస్ ఊహిం చని విపత్కర సంవత్సరంగా నిలిచిందని అనరాక్ చైర్మన్ అనూజ్ పురీ చెప్పారు. డిస్కౌంట్లు, ఆఫర్లు, గృహరుణ వడ్డీ రేట్ల తగ్గింపు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటివి గృహాల అమ్మకాల్లో కాసింత సానుకూలత నెలకొందని.. గత రెండు త్రైమాసికాల్లో పరిస్థితుల్లో కాసింత సానుకూల వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. (జీఎంఆర్‌కు ‘ఫిలిప్పీన్స్’ షాక్!) హైదరాబాద్‌లో... హైదరాబాద్‌లో గతేడాది 16,590 గృహాలు అమ్ముడుపోగా.. ఈ ఏడాది 48 శాతం క్షీణించి 8,560 గృహాలకు పడిపోయాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలన్నీ కొత్త గృహాల ప్రారంభంలో క్షీణత నమోదైతే ఒక్క హైదరాబాద్‌లోనే వృద్ధి నమోదయింది. గతేడాది నగరంలో కొత్తగా 14,840 ఇళ్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది 42 శాతం వృద్ధితో 21,110 యూనిట్లకు పెరిగాయి. నగరాల వారీగా అమ్మకాలు... ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అత్యధిక అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఇక్కడ 44,320 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఎంఎంఆర్‌లో 80,870 యూనిట్లు (45 శాతం క్షీణత) అమ్ముడుపోయాయి. బెంగళూరులో గతేడాది 50,450 గృహాలు కాగా.. ఇప్పుడవి 51 శాతం తగ్గి 24,910 యూనిట్లకు చేరాయి. పుణేలో 40,790 నుంచి 23,460 (51 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్లో 46,920 నుంచి 23,210 (42 శాతం), చెన్నైలో 11,820 నుంచి 6,740 (43 శాతం), కోల్‌కతాలో 13,930 నుంచి 7,150 (49 శాతం) తగ్గాయి. ఇతర నగరాల్లో లాంచింగ్స్.. గతేడాది ఢిల్లీ-ఎన్సీఆర్లో కొత్తగా 35,280 గృహాలు ప్రారంభం కాగా.. 2020 నాటికి 47 శాతం క్షీణించి 18,530లకు చేరాయి. ఎంఎంఆర్‌లో 77,990ల నుంచి 30,290లకు (61 శాతం), బెంగళూరులో 39,930 నుంచి 21,420లకు (46 శాతం), పుణేలో 46,110 నుంచి 23,920లకు (48 శాతం), చెన్నైలో 13,000 నుంచి 9,170లకు (29 శాతం), కోల్‌కతాలో 9,420 నుంచి 63 శాతం తగ్గి 3,530లకు తగ్గాయి. స్టాంప్ డ్యూటీ తగ్గిస్తేనే... న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో తగ్గిన గృహాల అమ్మకాలు తిరిగి పుంజుకోవాలంటే స్టాంప్ డ్యూటీ తగ్గించడమే ప్రత్యామ్నాయమని నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిర్‌నందానీ సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కోవిడ్ సమయంలోనూ రికార్డ్ స్థాయిలో విక్రయాలు జరిగాయని ఉదహరించారు. ఇతర రాష్ట్రాలు కూడా స్టాంప్ డ్యూటీని తగ్గించాలని.. ఆయా రాష్ట్ర నరెడ్కో చాప్టర్లు ఈ అంశాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రం అద్దె గృహాలను ప్రోత్సహించాలని, గృహ రుణ వడ్డీని తగ్గించడంతో పాటు ఇన్వెంటరీ గృహాల మీద పన్నును మినహాయించాలని కోరారు. అఫర్డబుల్ అండ్ మిడ్–సైజ్ హౌసింగ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) కోసం ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు. ఇలాంటి ఫండ్సే సుమారు నాలుగైదు కావాలని.. బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలతో కలిసి ప్రభుత్వం రూ.1,25,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. -
ప్లాట్లకు తగ్గని గిరాకీ!
ఆదిభట్ల, యాదాద్రి, షామీర్పేట, షాద్‌నగర్.. దశాబ్ధ క్రితం దాకా శివారు ప్రాంతాలు! కానీ, ఇప్పుడు అభివృద్ధికి హాట్‌స్పాట్స్. ఇంకా చెప్పాలంటే ప్రధాన నగరంతో సమానమైన ధరలున్న ప్రాంతాలు! గతంలో గజానికి రూ. 2–3 వేలు కూడా పలకని స్థలాల ధరలు నేడు ఆకాశాన్నంటాయి. మరీ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కొత్త జిల్లాల విభజనతో స్థలాల ధరలు మరింత పెరిగాయి. సాక్షి, హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ అభివృద్ధికి సెంటిమెంటే ప్రధానం. ప్రత్యేకించి ప్లాట్ల విషయంలో! ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశముందంటే చాలు ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ప్లాట్లు కొంటుంటారు. ఉద్యోగావకాశాలను కల్పించే సంస్థలు ఏ ప్రాంతంలో వస్తున్నాయో పరిశోధన చేసి మరీ పెట్టుబడులు పెడుతుంటారు. అప్పు చేసో.. ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టో.. బ్యాంకు రుణం తీసుకుని మరీ ఆయా ప్రాంతాల్లోని స్థలాలపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులో రేటు పెరిగి పిల్లల చదువులకో, పెళ్లికో అక్కరకొస్తుందనే దూరదృష్టితో ఉంటారు. వ్యాపారులు, పెట్టుబడిదారులు జట్టుగా ఏర్పడి ఎకరాల విస్తీర్ణాల్లో భూములను కొంటారు.పొరపాటున ధరలు తగ్గినా.. మార్కెట్ మందగమనానికి చేరినా.. ముందడుగు వేయరు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారముందని తెలిసినా కొనడానికి సందేహిస్తుంటారు. ⇔ 2002 వరకూ శివారు ప్రాంతాల్లో గజం ధర రూ.2–3 వేలు పలకడమే ఎక్కువ. తెలంగాణ ఏర్పడ్డాక, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక రూ.20 వేల పైకి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ధరలు తక్కువగా ఉండటం, సానుకూల వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, జీవన వ్యయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రవాసాంధ్రులు, పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో స్థలాలను కొనుగోలు చేశారు. చేస్తున్నారు కూడా. ఐటీతో జోరు.. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, మణికొండ వంటి ప్రాంతాలపై అమ్మకాలు ఏనాడు కూడా ప్రతికూల పరిస్థితులకు చేరవు. కారణం ఐటీ హబ్‌గా పేరొం దడమే. ఇప్పుడిదే తరహా వాతావరణాన్ని తూర్పు ప్రాంతం సంతరించుకుంటోంది. మెట్రో రైలు తొలిసారిగా పరుగులు పెట్టేది ఇక్కడి నుంచే కావటం అదనపు అంశం. ఉప్పల్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, ఏరో స్పేస్ సంస్థలొచ్చాక స్థిరాస్తికి మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడీ ప్రాంతాల్లో ప్లాట్ల మార్కెట్టే కాదు అపార్ట్మెంట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు కూడా భారీగా వెలుస్తున్నాయి. ప్రధాన ర హదారికి ఎంత చేరువలో ఉంది? ప్లాటు దిక్కు ఆధారంగా తుది రేటు ఆధారపడి ఉంటుందనేది మరిచిపోవద్దు. ⇔ మెట్రో రైలు ప్రయాణించే మార్గంలో, డిపోలు ఏర్పాటుకానున్న ప్రాంతాల్లోని స్థలాలకు గిరాకీ పెరిగింది. మెట్రో పనులు జోరుగా జరుగుతుండటం వల్ల ప్లాట్ల ధరల్ని అంతే స్పీడుగా పెంచేశారు కొందరు డెవలపర్లు. అయితే గత కొంతకాలంగా మియాపూర్, బాచుపల్లి, ప్రగతినగర్, చందానగర్ తదిత ర ప్రాంతాల్లో అమ్మకాలు కాసింత తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిస్థితి కొంత కాలమేనని రియల్టర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. -
పాతనోట్లపై దళారుల బంపర్ ఆఫర్!
లక్షకు అరవైవేల చొప్పున డీల్ రియల్ ఎస్టేట్‌లో మళ్లుతున్న నల్లధనం మీ దగ్గర నల్లధనం పెద్దఎత్తున ఉందా? పాత నోట్లయిన రూ. 500, వెయ్యినోట్లను పెట్టుబడులరూపంలో మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్. 60:40 నిష్పత్తిలో మీరు లక్షరూపాయలు పాత నోట్లు ఇస్తే.. రూ. 60వేలుగా పరిగణించి.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో పెట్టుబడులుగా మళ్లిస్తాం.. ఇది లక్నోకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్ సారాంశం ఇది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, లక్నో, ఘజియాబాద్, నోయిడా తదితర నగర వాసులకు ఇలాంటి ఆఫర్లు పోటెత్తుతున్నాయి. 30శాతం నుంచి 50శాతం కమిషన్‌తో మీ దగ్గరున్న బ్లాక్‌మనీని వైట్ చేస్తామని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులను ఊరిస్తున్నారు. అంతేకాదు బ్లాక్‌మనీ ఉన్న పెద్దలు కూడా ఇలాంటి ఆఫర్లతో తమను ఆశ్రయిస్తున్నారని, తమ బ్లాక్‌మనీని పెట్టుబడులుగా మళ్లించాలని కోరుతున్నారని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ తెలిపారు. తనకు 60:40 ఆఫర్ అందిందని సాఫ్వేర్ ఉద్యోగి మనీష్ గుప్తా మీడియాకు తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో దేశమంతటా రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద కుదుపు ఎదురైంది. చిన్న చిన్న ప్రాజెక్టులు చేపట్టిన రియల్ వ్యాపారులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, పెద్దనోట్ల రద్దుతో ఎదురైన చిక్కులను ఎదుర్కొనేందుకు రియల్ ఏజెంట్లు లొసుగులను అస్త్రంగా చేసుకుంటున్నారు. 100-150కిపైగా బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌తో రియల్ ఏజెంట్లు తమకు బ్లాక్‌మనీ రూపంలో అందే పెట్టుబడులను వైట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, రియల్ ఏజెంట్లు గుట్టుగా నిర్వహిస్తున్న చైన్ నెట్వర్క్ ఖాతాలు బట్టబయలు అయితే, పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోకతప్పదని చార్టెట్ అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు. -
భూముల మార్కెట్ విలువలను సవరించం
హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం - సవరణ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని వాదన - భూ సేకరణ నోటిఫికేషన్లకు ముందు సవరించారో లేదో చెప్పండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ వచ్చే వారానికి వారుుదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించరాదని నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ‘‘మార్కెట్ విలువల సవరణ పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. దాని పెంపు తగ్గింపుల నిర్ణయాన్ని రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాం. నిర్దిష్ట ప్రాంతంలో ప్రస్తుతమున్న భూముల మార్కెట్ విలువ ఆధారంగా సవరణ ఉంటుంది. మార్కెట్ విలువను 2008, 2010ల్లో సవరించాం. 2013లో ఆఖరి సవరణ జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలుగుతున్న సమయంలో మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తప్పనిసరిగా మార్కెట్ విలువను సవరించాలని చట్టంలో ఎక్కడా లేదు. ఇండియన్ స్టాంపు చట్టం 1899ను అమలు చేయడానికే 1998లో మార్కెట్ విలువ సవరణల నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది’’అని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదనలు విన్పించారు. వీటిని పరిశీలించిన హైకోర్టు, 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రకటించే ముందు ఆయా జిల్లాల కలెక్టర్లు మార్కెట్ విలువను సవరించారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంబంధిత వివరాలన్నింటినీ తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వారుుదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కోదండరెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఆదేశించిన మేరకు మేరకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. మార్కెట్ విలువ సవరణాధికారం జిల్లా కలెక్టర్‌దేనని ఏజీ రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సేకరణకు నిర్ణరుుంచిన భూమికి సంబంధించి కలెక్టర్ సవరించిన మార్కెట్ విలువ సంతృప్తికరంగా లేదని ఎవరైనా భావిస్తే 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం మార్కెట్ విలువ సవరణకు నిర్దేశించిన విధానానికి అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి భూ సేకరణ చర్యలు ప్రారంభించడానికి ముందే జిల్లా కలెక్టర్ మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదు’’అని వివరించారు. రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంతకు ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భారీగా భూములను సేకరిస్తోందని, మార్కెట్ విలువలను మాత్రం సవరించడం లేదని వివరించారు. -
జిల్లా కానుందని తొందరొద్దు!
సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి మార్కెట్ చిత్రమైంది. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వెలువడిన ప్రతీసారి ధరలకు రెక్కలొస్తాయి. ఆ తర్వాత అంతే జోరుగా పడిపోతాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ర చించింది. దీంతో రాత్రికి రాత్రే జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి ధరలు హద్దులు దాటేశాయి. ఇంకా చెప్పాలంటే వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాల్లో హైదరాబాద్‌లోని ప్రైమ్ లొకేషన్లో లేనంత రేట్లు చెబుతున్నారు స్థానిక డెవలపర్లు. అయితే స్థిరాస్తి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని.. అదే సమయంలో గతంలో భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ అనుభవాలనూ గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కొనకపోతే ఇక భవిష్యత్తులో కొనలేమనే తొందర్లో.. అప్పు తెచ్చి మరీ అసలే కొనొద్దని సలహా ఇస్తున్నారు. విమానాశ్రయం పేరిట.. గతంలో హైదరాబాద్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటవుతుందనే వార్త కొన్ని ప్రాంతాల్లో షికారు చేసింది. ముందుగా కరీంనగర్ రోడ్డులో వస్తుందన్నారు.. ఆ తర్వాత దుండిగల్ విమానాశ్రయం పక్కనే అన్నారు.. మరికొంతకాలమయ్యాక పటాన్చెరు వద్ద ఇక్రిశాట్.. ఆ తర్వాత కీసర.. ఇలా పుకార్లు వ్యాపించిన ప్రాంతాల్లో భూముల ధరలు రెండు, మూడు రెట్లు అమాంతం పెరిగాయి. తర్వాత త గ్గుముఖం పట్టాయి. కాకపోతే అధిక ధరకు స్థలం కొన్నవారు.. మరింత రేటు పెరగడానికి చాలా కాలం ఎదురుచూశారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొందరు వేచి చూస్తున్నారు. నేటికీ హైటెక్‌సిటీలో అదే ధర.. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ ఆరంభమైంది 1995లో. అప్పట్లో గజం ధర రూ.5 వేలు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా తక్కువే ఉండేది. దాదాపు ఏడేళ్ల వరకూ ఇంచుమించు ఇదే ధర కొనసాగింది. 2003లో సంస్థలు పెరిగాయి. ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. వేరే రాష్ట్రాల నుంచి నిపుణులు రావటం మొదలైంది. ఇతర వ్యాపారాలు జోరందుకున్నాయి. ఇక అప్పట్నుంచి స్థలం ధర పెరుగుతూ 2006 నాటికి గజం రేటు రూ.50 వేలు అయ్యింది. కాకపోతే అప్పట్నుంచి రేటు పెరిగిన దాఖలాల్లేవు. ప్రస్తుతమూ ఇదే ధర కొనసాగుతోంది. మహేశ్వరంలో ఎదురుచూపులు.. మహేశ్వరంలో.. మార్కెట్ పెద్దగా లేనప్పుడు 1997లో ఎకరం ధర లక్ష వరకుండేది. 2005లో బూమ్ ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, హార్డ్‌వేర్ పార్క్, ఫ్యాబ్‌సిటీ, ముచ్చర్ల ఐటీ పార్క్ వంటివి వస్తున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మహేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది భూములు కొనడానికి తిరిగేవారు. ఉదయమున్న రేటు సాయంత్రం ఉండేది కాదు. అగ్రిమెంట్ల మీద ఒప్పందాలు జరిగేవి. యజమానులెవరో తెలియదు. అసలు అవి ఎలాంటి భూములో తెలియదు. అయినా కొనేశారు. ఈ క్రమంలో ఎకరం ధర రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలు దాటింది. అక్కడ కొనకపోతే ఏదో జాక్‌పాట్ పోయినట్టు భావించేవారు. వేలంవెర్రిగా ఫ్లాట్లను కొన్నారు. ఇప్పుడేమో ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. -
జోరుగా రిజిస్ట్రేషన్లు
కాకినాడ లీగల్ :నగర, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ ఆగస్టు ఒకటి నుంచి 30 శాతం పెరగబోతుందన్న వార్తతో జూలైలో చివరిరోజైన గురువారం రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా రెండువేల వరకు క్రయవిక్రయాలు జరగ్గా, ఆ శాఖకు రూ.2 కోట్ల ఆదాయం సమకూరిందని అంచనా. సాధారణంగా కాకినాడ, రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ల పరిధిలోని 32 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రోజూ రాష్ర్ట ఖజానాకు కోటి నుంచి కోటిన్నర ఆదాయం వస్తుంది. రోజూ కాకినాడ, రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సగటున 50, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 10 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. భూముల విలువ పెరిగితే రిజిస్ట్రేషన్ రుసుము పెరుగుతుందన్న భావనతో క్రయవిక్రయదారులు ఎగబడడంతో గురువారం రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఏటా మాదిరే ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించిన పెంపు బాధ్యతను జిల్లాస్థాయి కమిటీకి అప్పగించింది. పలు దఫాలు సమావేశమైన ఈ కమిటీ చివరకు 30 శాతం మేర పెంచాలని తీర్మానించింది. ఆగస్టు ఒకటి నుంచి పెంపు వర్తించేలా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇదే గురువారం నాటి ముమ్మర రిజిస్ట్రేషన్లకు కారణమైంది. అయితే భూముల విలువ పెంపును తాత్కాలికంగా వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ (ఇన్చార్జి) విజయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం అమలుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు రిజిస్ట్రేషన్లు పాత రేట్లతోనే జరుగుతాయన్నారు. -
అవలీలగా అమ్మండిలా!
సాక్షి, హైదరాబాద్: కొనేటప్పుడు తక్కువ రేటులో కావాలి. అమ్మేటప్పుడు మాత్రం అధిక ధర రావాలని చాలామంది కోరుకుంటారు. ప్రస్తుతం మార్కెట్లో బూమ్ లేదు కాబట్టి.. మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు అలవర్చుకోవడం ద్వారా ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి స్థిరాస్తిని సులభంగా అమ్ముకోవచ్చు. కొనుగోలుదారులు ఏం కోరుకుంటున్నారో ముందుగా కనుక్కోవాలి. అంతేకాదు, స్థిరాస్తి మార్కెట్లో ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవాలి. సొంతిల్లు అనగానే చాలామందికి డాబా ఇల్లా? ఫ్లాటా? అనే సందేహం వస్తుంది. పాత, కొత్త ఇళ్లలో వేటిని కోరుకుంటున్నారు? లేదంటే ఇళ్ల స్థలాలనా? అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అమ్మాలనుకునే ఆస్తికి మార్కెట్లో ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. ఇంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం బిల్డర్లకో, డెవలపర్లకో ఉంటుంది కానీ.. స్థలాన్నో, ఇంటినో అమ్ముకునే వారికెందుకన్న భావన చాలామందిలో కలుగుతుంది. కానీ మార్కెట్ గురించి తెలుసుకోవడం వల్ల వ్యక్తిగత ఆస్తులు అమ్మేవారికీ ఎంతగానో ఉపయోగం. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరను ప్రభావితం చేస్తాయి. ఒక వేళ అవి ప్రతికూలంగా ఉన్నా వాటిని మెరుగుపర్చడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాస్తి ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగు పొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే పర్వాలేదు. ఇందుకు భిన్నంగా ఉంటే.. విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవడం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారుడిని పట్టుకోవడం వంటివన్నమాట. అయితే ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించలేవు. మార్కెట్ సెంటిమెంట్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేరకు ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున ్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది, ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టి పెట్టాలి. స్థిరాస్తికి ఏ చిన్నపాటి తేడా ఉన్నా కొనుగోలుదారులు ముందుకు రాకపోవచ్చు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలని అనుకుంటున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారునికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్తా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందడుగు వేస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు.