
సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ మద్దతు, వెల్స్ ఫార్గో భాగస్వామ్యంతో ‘అకడమిక్ గ్రాండ్ చాలెంజ్’ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఏఐ మిషన్ (టీ ఎయిమ్) బుధవారం ప్రకటించింది. ఈ చాలెంజ్‌లో భాగంగా దేశంలోని విద్యార్థి బృందాలు రెండు కోణాల్లో పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుంది. పూర్తిగా భవిష్యత్ బ్యాంకింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడి నుంచైనా లావాదేవీలు నిర్వహించేలా ఆధునిక టెక్నాలజీల సమ్మిళితంగా నూతన ఆవిష్కరణ చేయాలి.
దీంతో పాటు ఏడాది కాలంలో ఫైనాన్షియల్ మార్కెట్ల పనితీరును అంచనా వేసే విశ్లేషణాత్మక నమూనాను రూపొందించడం కూడా ఈ చాలెంజ్‌లో భాగంగా ఉంటుంది. విజేతగా నిలిచిన విద్యార్థి బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతితో పాటు పలు ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంతోపాటు వివిధ రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంలో ఇలాంటి చాలెంజ్‌లు తోడ్పడతాయని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థి బృందాలు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని, విజేతలను ఈ ఏడాది నవంబర్‌లో ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీ–ఎయిమ్ వర్గాలు వెల్లడించారు.
చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు: ఆరుగురు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment