ICICI Bank Customers ALERT Now Pay More For These Credit Debit Card Services - Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌..! మిస్సయ్యారో..రూ. 1200 పెనాల్టీ..!

Published Fri, Feb 11 2022 2:10 PM | Last Updated on Fri, Feb 11 2022 2:43 PM

ICICI Bank Customers ALERT Now Pay More For These Credit Debit Card Services - Sakshi

ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాకిస్తూ క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆలస్య రుసుముకు సంబంధించిన ఫీజులు ఉన్నాయి. కొత్తగా పెంచిన ఛార్జీలు నేటి (ఫిబ్రవరి 10) నుంచి అమలులోకి రానున్నాయి.

మిస్సయ్యారో పెనాల్టీ కట్టాల్సిందే..!
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కు చెందిన వివిధ సేవల ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించింది. ఇక నుంచి క్రెడిట్‌ కార్డు వినియోగించి ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఖాతాదారులు నగదు అడ్వాన్స్ లావాదేవీల మీద ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే చెక్‌ రిటర్న్‌ అయినా, ఆటో డెబిట్‌ ఫెయిల్‌ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేస్తారు. కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి లావాదేవీ చేసే వారు ఇకపై భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై 2.50 శాతం చొప్పున ఫీజుగా వసూలు చేయనున్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎమరాల్డ్‌ క్రెడిట్‌ కార్డులకు ఈ ఆలస్య రుసుము ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. 

క్రెడిట్‌ కార్డులపై ఐసీఐసీఐ బ్యాంకు సవరించిన ఛార్జీలు ఇలా ఉన్నాయి

  • రూ.100 కంటే తక్కువ బకాయి ఉంటే ఎలాంటి ఆలస్య రుసుము ఉండదు.
  • రూ. 100 నుంచి 500 మధ్య బకాయి ఉంటే రూ. 100 ఛార్జ్.
  • రూ. 501- రూ 5000 బకాయి ఉంటే రూ 500 ఛార్జ్‌.
  • రూ.10,000 వరకు బకాయి ఉంటే రూ. 750 ఛార్జ్‌.
  • రూ. 25000 వరకు బకాయి ఉంటే రూ. 900 ఛార్జ్‌.
  • రూ. 50,000 వరకు చెల్లించాల్సి ఉంటే రూ.1200 ఛార్జ్‌.

చదవండి: ఎంఅండ్‌ఎం లాభం జూమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement