ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ నుంచి కొత్త పాలసీ | ICICI Pru Guaranteed Pension Plan Flexi increase in annuity pay out | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ నుంచి కొత్త పాలసీ

Published Mon, Nov 25 2024 11:18 AM | Last Updated on Mon, Nov 25 2024 11:18 AM

ICICI Pru Guaranteed Pension Plan Flexi increase in annuity pay out

పెరిగే వ్యయాలను ఎదుర్కొనడంలో పదవీ విరమణ చేసిన వారికి కొంత తోడ్పాటు అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ కొత్త పాలసీని ఆవిష్కరించింది. ఏటా అయిదు శాతం అధికంగా యాన్యుటీ చెల్లింపు ప్రయోజనాలను అందించే ఫీచరుతో గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీని ప్రవేశపెట్టింది. ఈ తరహా పాలసీల్లో ఇదే మొట్టమొదటిదని సంస్థ తెలిపింది.

ద్రవ్యోల్బణం వల్ల కాలక్రమేణా కొనుగోలు శక్తి తగ్గినా, జీవన ప్రమాణాలను స్థిరంగా కొనసాగించుకోవడంలో కస్టమర్లకు ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్‌ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పల్టా తెలిపారు. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఉన్న నేపథ్యంలో జీవితకాలం పాటు అధిక రాబడులను అందుకునేలా యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేసేందుకు ఇది సరైన తరుణమని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement