
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ పాట్నాతో జోడీ కట్టనుంది. త్వరలో కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్), మెషిన్ లెర్నింగ్ తదితర అంశాలలో కలిసి పనిచేయనున్నట్లు మంగళవారం తెలిపింది. విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక అవగాహన కలిగించేందుకు తమ కలయిక ఎంతో ఉపయోగపడుతుందని ఇరు వర్గాలు తెలిపాయి.
కాగా ఈ ప్రాజెక్ట్‌లో ఐఐటీ విద్యార్థులకు సెమినార్లు, రీసెర్చెపై అవగాహన, ఇంటర్న్‌షిప్, మెంటార్‌షిప్ తదితర అంశాలలో శిక్షణ పొందనున్నారు. ఈకామర్స్ రంగంలో వస్తున్న సాంకేతిక అంశాలు, వినియోగదారులు అభిరుచుల తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా ఇది వరకే ఫ్లిప్‌కార్ట్ ఐఐఎస్‌సీ, ఐఐటీ (ఖరగ్‌పూర్, బాంబే, కాన్పూర్) తదితర ఐఐటీ బ్రాంచ్‌లకు శిక్షణ ఇచ్చింది.