న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభతరం చేయడంతోపాటు, మొబైల్ ఫోనులోనూ ఉపయోగించుకునేలా ఈ-ఫైలింగ్ 2.0 కొత్త పోర్టల్ రానుంది. పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ విభాగం కొత్త పోర్టల్ ఈ-ఫైలింగ్ 2.0ను జూన్ 7న ప్రారంభించనుంది. కొత్త వెబ్‌సైట్ ఇప్పటికే ఉన్న పోర్టల్ (incometaxindiaefiling.gov.in) స్థానంలో తీసుకొని రానున్నారు. కొత్త ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్ ప్రారంభించటానికి ముందు, జూన్ 1 నుంచి జూన్ 6 మధ్య ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.
జూన్ 7 నాటికి కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్(incometax.gov.in) అమలులోకి వస్తుంది. "ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్" ముఖ్యమైన లక్షణాలను ఐటి విభాగం వివరించింది. మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నులను ఎలా చేయాలో మార్గనిర్దేశకం చేయడానికి యూజర్ మాన్యువల్లు, వీడియోలు ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా, ఆన్-పోర్టల్ పన్ను చెల్లింపుల కోసం మల్టిపుల్ ఆప్షన్ లు ఉంటాయి. ముందే మీరు ఇచ్చిన వివరాలు ఫిల్ చేసి ఉంటాయి. సురక్షితమెన లాగిన్, చాట్‌బాట్, హెల్ప్‌డెస్క్ సపోర్ట్ వంటివి పోర్టల్‌లోని ముఖ్యమైన లక్షణాలు.
Income Tax Department will launch its new e-filing portal https://t.co/GYvO3n9wMf on 7th June'21.
— Income Tax India (@IncomeTaxIndia) May 29, 2021
It will replace the existing portal of the Department https://t.co/EGL31K6szN. E- Filing services will be unavailable from 1st - 6th June'21. #NewPortal #eFiling #EasingCompliance pic.twitter.com/itEIgP39Bk
Comments
Please login to add a commentAdd a comment