న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు జూలైలో 50 శాతం పెరిగి 35.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఒక నెల్లో విలువలో ఎగుమతులు ఇంత భారీ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. పెట్రోలియం, ఇంజనీరింగ్, రత్నాలు–ఆభరణాల ఎగుమతులు మంచి ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 63 శాతం పెరిగి 46.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరిసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 10.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే..
► పెట్రోలియం (3.82 బిలియన్ డాలర్లు), ఇంజనీరింగ్ (2.82 బిలియన్ డాలర్లు), రత్నాలు–ఆభరణాల (1.95 బిలియన్ డాలర్లు) ఎగుమతుల్లో భారీ పెరుగుదల మొత్తం గణాంకాలపై సానుకూల ప్రభావం చూపింది.
► చమురు దిగుమతులు 97.45 శాతం పెరిగి 12.89 బిలియన్ డాలర్లకు చేరాయి.
► పసిడి దిగుమతులు 1.78 బిలియన్ డాలర్ల నుంచి (2020 జూలై నెల్లో) 4.2 బిలియన్ డాలర్లకు చేరాయి.
► ఆయిల్‌సీడ్స్, బియ్యం, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి.
► కాగా ముత్యాలు, ప్రీసియన్, సెమీ–ప్రీసియస్ రాళ్ల దిగుమతుల విలువ 1.68 బిలియన్ డాలర్లుగా ఉంది.
► రవాణా పరికరాలు, ప్రాజెక్ట్ గూడ్స్, వెండి దిగుమతులు క్షీణించాయి.
► అమెరికా (2.4 బిలియన్ డాలర్లు), యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (1.21 బిలియన్ డాలర్లు), బెల్జియం (489 మిలియన్ డాలర్లు) దేశాలకు ఎగుమతులు పెరిగాయి.
నాలుగు నెలల్లో...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య ఎగుమతులు 74.5 శాతం పెరిగి 130.82 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 75 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు ఇదే కాలంలో 94 శాతం పెరిగి 172.5 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఒక్క చమురు దిగుమతులను చూస్తే విలువ 123.84 శాతం పెరిగి 19.61 బిలియన్ డాలర్ల నుంచి 43.90 బిలియన్ డాలర్లకు ఎగసింది. కాగా, వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేస్తూ, ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యం. మరో ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టు–మార్చి 2022) 269.44 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అంటే నెలకు సగటును 33.68 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాల్సి ఉంది’’ అని పేర్కొంది.
గ్లోబల్ డిమాండ్ బాగుంది...
గ్లోబల్ డిమాండ్ ఏప్రిల్–జూలై మధ్య పటిష్టంగా ఉంది. ఎగుమతిదారుల ఆర్డర్ బుకిం గ్ పరిస్థితి ఎంతో మెరుగుపడింది. ఆగస్టు మొద టివారంలో 7.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదుకావడం మరో హర్షణీయ పరిణామం. – ఏ శక్తివేల్, ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్
నెలవారీ ఎగుమతుల్లో భారత్ రికార్డు
Published Sat, Aug 14 2021 6:20 AM | Last Updated on Sat, Aug 14 2021 6:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment