న్యూఢిల్లీ: ఇండియా సోథ్‌బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ద్వారా గతేడాది దాదాపు 280 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,100 కోట్లు) విలువ చేసే 182 లగ్జరీ ప్రాపర్టీల విక్రయాలు జరిగాయి. 2020తో పోలిస్తే ఇది 47 శాతం అధికం. అప్పట్లో 190 మిలియన్ డాలర్ల విలువ చేసే 102 ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి. విలువపరంగా 47 శాతం పరిమాణంపరంగా 78 శాతం అధికంగా విక్రయాలు నమోదైనట్లు సంస్థ సీఈవో అమిత్ గోయల్ తెలిపారు.
విలాసవంతమైన నివాస గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరగడం ఇందుకు తోడ్పడిందని ఆయన వివరించారు. 10 మిలియన్ డాలర్లకు మించి విలువ చేసే లావాదేవీలు డజను పైగా నమోదైనట్లు గోయల్ పేర్కొన్నారు. అత్యధికంగా 15 మిలియన్ డాలర్ల విల్లా విక్రయ లావాదేవీ.. గోవాలో జరిగిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment