న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లోనే నిర్వహించుకునే అంశంపై భారత్, యూఏఈ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రూపాయి, దిర్హామ్‌లలో వాణిజ్య నిర్వహణకు సంబంధించిన నమూనా పత్రంపై ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు.
లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవడమనేది ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాలు ఫిబ్రవరిలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. ఈ ఒప్పందం ఊతంతో వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment