అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ హవా జోరుగా సాగుతున్న వేళ.. చాలామంది ఏఐ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఏఐ ఫెలోషిప్ నామినేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇండియా ఏఐ (IndiaAI) ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ (IBD) బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ స్కాలర్‌ల నుంచి నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆసక్తికలిగిన విద్యార్థులు తమ నామినేషన్లను సెప్టెంబర్ 30లోపు సమర్పించాలి.
ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేయాలనుకునే బీటెక్, ఎంటెక్ విద్యార్థులు రెగ్యులర్‌గా కోర్స్ పూర్తి చేసి ఉండాలి. విద్యార్థులు మొత్తం 80 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఫెలోషిప్ బీటెక్ విద్యార్థులకు ఒక సంవత్సరం, ఎంటెక్ విద్యార్థులకు రెండు సంవత్సరాలు ప్రాజెక్ట్ వ్యవధిని కవర్ చేస్తుంది.
పీహెచ్‌డీ స్కాలర్స్ తప్పకుండా టాప్ 50 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిన పరిశోధనా సంస్థల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో రీసెర్చ్ చేసి ఉండాలి. అయితే వీరు ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే సమయంలో మరే ఇతర సంస్థ నుంచి స్కాలర్‌షిప్ లేదా జీతం వంటివి పొందకూడదు.
ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్‌మన్
ఇండియా ఏఐ ఫెలోషిప్ కోసం అభ్యర్థుల ఎంపిక అనేది అర్హత, రీసెర్చ్, స్టూడెంట్ ప్రొఫైల్, నేషనల్ లెవెల్ ఫెలోషిప్‌ల లభ్యత ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment