వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.
అమెజాన్ సంభవ్ సమ్మిట్ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.
ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్
భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్‌కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment