auto industry
-
ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ
వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.అమెజాన్ సంభవ్ సమ్మిట్ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్‌కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. -
వాహన పరిశ్రమ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమ టర్నోవర్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటిందని వాహన తయారీదారుల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ వెల్లడించారు. మొత్తం వస్తు, సేవల పన్నుల్లో (జీఎస్టీ) 14–15 శాతం వాటా ఆటో పరిశ్రమదే ఉంటోందని ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గణనీయంగా ఉపాధి కలి్పస్తోందని ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 64వ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమ వాటా 6.8 శాతంగా ఉండగా ఇది మరింత పెరగగలదని వివరించారు. అంతర్జాతీయంగా భారతీయ ఆటో రంగం పరపతి పెరిగిందని అగర్వాల్ చెప్పారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఉత్పత్తి చేయగలిగే 50 క్రిటికల్ విడిభాగాలను పరిశ్రమ గుర్తించిందని ఆయన వివరించారు. 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: కేంద్ర మంత్రి గోయల్ భారతీయ వాహన సంస్థలు 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏసీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. ఇందులో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, స్థానికంగా ఉత్పత్తిని మరింతగా పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాహన ఎగుమతులు 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ప్రభుత్వం 20 స్మార్ట్ ఇండస్ట్రియల్ నగరాలను అభివృద్ధి చేస్తోందని, వాహనాల విడిభాగాల పరిశ్రమ ఈ టౌన్íÙప్ల రూపంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి చెప్పారు. మరోవైపు, లోకలైజేషన్‌ను పెంచేందుకు సియామ్, ఏసీఎంఏ స్వచ్ఛందంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
2030 నాటికి టార్గెట్ ఇదే! - పియూష్ గోయల్
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన దేశం నుంచి ఎగుమతయ్యే వాహనాల శాతాన్ని పెంచాలని వాణిజ్య & పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటోమొబైల్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన వాహనాలు 14 శాతమని తెలుస్తోంది. ఇది 2030 నాటికి 50 శాతానికి చేరుకోవాలని మెగా మొబిలిటీ షో 'భారత్ మొబిలిటీ' కోసం లోగో అండ్ బుక్‌లెట్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో గోయల్ అన్నారు. 2024 ఆటో ఎక్స్పో 2024 గ్లోబల్ ఎక్స్పో వచ్చే నెల ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల్లోని చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో భవిష్యత్తులో రానున్న వాహనాలు, ఆటోమోటివ్ భాగాలలో అత్యాధునిక సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీలు, అర్బన్ మొబిలిటీ సొల్యూషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అటానమస్ వంటి వినూత్నమైన సాంకేతికతలు దర్శనమివ్వబోతున్నాయి. సుమారు 50కి పైగా దేశాల నుంచి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లతో, ఎక్స్పో అత్యాధునిక సాంకేతికతలతో కనిపించనుంది. 27కంటే కంపెనీలు కొత్త మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో హైబ్రిడ్, CNG వాహనాలను ప్రదర్శిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: బంగారం, వెండి కొనటానికి కరెక్ట్ టైమ్ వచ్చింది! ఎందుకంటే? 2024 ఎక్స్‌పోలో జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాల పెవిలియన్లను ఉంటాయి. అయితే యుఎస్, స్పెయిన్, యుఎఇ, రష్యా, ఇటలీ, టర్కీ, సింగపూర్, బెల్జియం నుంచి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. సరఫరా గొలుసులో తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొంటూ మరో కార్ల తయారీ సంస్థ హోండా తన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు పాక్‌కు గుడ్‌బై చెబుతుండగా, ఈ జాబితాలో తాజాగా ఆటోమొబైల్ దిగ్గజం హోండా కూడా చేరింది. ప్రస్తుతం పాక్‌లోని హోండా అట్లాస్ కార్స్ పేరుతో కార్లను అసెంబుల్ చేస్తోంది. దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే మూసివేతకు కారణమని ప్రకటించింది. జియో న్యూస్ ప్రకారం మార్చి 9 నుంచి 31 వరకు హోండా తన ఫ్లాంట్‌ను మూసివేయనుంది. పాక్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తిని కొనసాగించలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి స్టాక్ఎక్స్ఛేంజ్‌కు అందించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. ప్రభుత్వం పూర్తి నాక్-డౌన్ కిట్ల దిగుమతి కోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ నిషేధం, ముడిసరుకు, విదేశీ చెల్లింపుల స్తంభన లాంటి చర్యలతో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ తెలిపింది. కాగా అధిక ద్రవ్యోల్బణం, పాక్ కరెన్సీ క్షీణత, దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన పాకిస్తాన్ ఆటో పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని జియో న్యూస్ నివేదించింది. వాణిజ్య లోటును నియంత్రించేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిగుమతుల ఆంక్షలతో ఆటో పరిశ్రమ కూడా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించింది. ఉత్పత్తి కార్యకలాపాలు దెబ్బతినడమే కాకుండా కంపెనీలు తమ సీకేడీ మోడళ్ల ధరలను కూడా పెంచాయి, ఇది ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తిని ప్రభావితం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పాక్‌లోని టయోటా-బ్రాండ్ ఆటోమొబైల్స్‌కు చెందిన సుకుజీ మోటార్ కంపెనీ (PSMC) ఇండస్ మోటార్ కంపెనీ (IMC) అసెంబ్లర్లు కూడా తమ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. -
ప్రపంచ ఆటో తయారీ హబ్‌గా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ కేంద్రం(హబ్)గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో దేశీ ఆటో పరిశ్రమ విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరే అంచనాలున్నట్లు తెలియజేశారు. జైపూర్‌లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ ఏర్పాటు చేసిన వాహనాలను తుక్కుగా మార్చే(స్క్రాపింగ్) ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభించిన గడ్కరీ ప్రస్తుతం ఆటో పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 7.8 లక్షల కోట్ల పరిమాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2025కల్లా ఈ సంఖ్య 5 కోట్లను తాకనున్నట్లు అభిప్రాయపడ్డారు. జైపూర్‌లో టాటా మోటార్స్ వార్షికంగా 15,000 వాహన స్క్రాపింగ్ సామర్థ్యంతో తొలిసారి రిజిస్టర్డ్ ప్లాంటును ఏర్పాటు చేసింది. రూ. 15 లక్షల కోట్లకు..: గ్లోబల్ ఆటో తయారీ కేంద్రంగా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. సమీప కాలంలో పరిశ్రమ పరిమాణాన్ని రూ. 15 లక్షల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. పాత, పనికిరాని వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపేజ్ పాలసీ దశలవారీగా పర్యావరణ అనుకూల కొత్త వాహనాలకు దారి చూపుతుందని వివరించారు. తుక్కుగా మార్చే తాజా విధానాల వల్ల వాహన డిమాండు ఊపందుకుంటుందని, రూ. 40,000 కోట్ల ఆదనపు జీఎస్టీ ఆదాయానికి వీలుంటుందని తెలిపారు. -
టాటా మోటార్స్‌కు ఫోర్డ్ ప్లాంటు
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సణంద్‌లోని ఫోర్డ్ ఇండియా తయారీ ప్లాంటును 2023 జనవరి 10కల్లా పూర్తిగా చేజిక్కించుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా ఫోర్డ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన గుజరాత్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు దాదాపు రూ. 726 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ కొనుగోలులో భాగంగా మొత్తం భవంతులు, మెషీనరీ, భూమితోపాటు, వాహన తయారీ ప్లాంటును సొంతం చేసుకోనుంది. అర్హతగల ఉద్యోగులు సైతం బదిలీకానున్నారు. ప్రభుత్వం, సంబంధిత ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందిన నేపథ్యంలో 2023 జనవరి 10కల్లా లావాదేవీని పూర్తి చేయాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో వివరించింది. లక్ష్యంలో 59 శాతానికి ద్రవ్యలోటు న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ ముగిసే నాటికి లక్ష్యంలో 59 శాతానికి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్–2023 మార్చి) ముగిసే నాటికి రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. స్థూల దేశీయోత్పత్తి అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే నవంబర్ ముగిసే నాటికి ఇది 9.78 లక్షల కోట్లకు చేరింది. అంటే వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 59 శాతానికి చేరిందన్నమాట. -
పర్యావరణ అనుకూల పరిష్కారాలు కావాలి
న్యూఢిల్లీ: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు, దేశ స్వావలంబనకు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహన ఆవిష్కరణలపై ఆటోమొబైల్ పరిశ్రమ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) 62వ వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధాని లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. దీన్ని సియామ్ ప్రెసిడెంట్ కెనిచి అయుకవ చదవి వినిపించారు. ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించాల్సిన అమృత కాల అవకాశం మన ముందుందని పేర్కొంటూ, అందుకు ఆటోమొబైల్ రంగం కూడా అతీతం కాదన్నారు. ఉపాధి కల్పన, దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆటోమొబైల్ రంగానికి భవిష్యత్తు బ్లూప్రింట్‌ను అభివృద్ధి చేసే విషయంలో పరిశ్రమ నిపుణులు, తయారీదారులు, విధానకర్తలు వార్షిక సదస్సులో భాగంగా చర్చలు నిర్వహించాలని సూచించారు. వాహన తయారీలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించడంలో పరిశ్రమ పాత్రను మెచ్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, ఆటోమొబైల్ పరిశ్రమ సాధించిన ఈ విజయాలు దేశ ఆర్థిక పునరుజ్జీవానికి తోడ్పడినట్టు చెప్పారు. తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. మానవాభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశ వృద్ధికి నాణ్యమైన, సౌకర్యమైన రవాణా కీలకమన్నారు. నాణ్యత ముఖ్యం.. ధర కాదు: గడ్కరీ వాహన తయారీ సంస్థలు నాణ్యతకే ప్రాముఖ్యం ఇవ్వాలి కానీ, ధరకు కాదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఎందుకంటే వాహనదారుల ప్రాధాన్యతలు మారుతున్నట్టు చెప్పారు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడం.. రహదారులు, వాహన భద్రతపై చర్చ నడుస్తున్న నేపథ్యంలో మంత్రి సూచన గమనార్హం. ప్రపంచంలో టాప్–2లో భారత్: సియామ్ వాహన తయారీలోని ప్రతి విభాగంలోనూ భారత్‌ను ప్రపంచంలోని రెండు అగ్రగామి దేశాల్లో ఒకటిగా వచ్చే 25 ఏళ్లలో చేర్చడమే తమ లక్ష్యమని సియామ్ ప్రకటించింది. సియామ్ కొత్త ప్రెసిడెంట్‌గా వినోద్ అగర్వాల్ ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) నూతన ప్రెసిడెంట్‌గా 2022–23 సంవత్సరానికి వినోద్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కెనిచి అయుకవ ఈ బాధ్యతలు నిర్వహించారు. వినోద్ అగర్వాల్ వోల్వో ఐచర్ కమర్షియల్ వెహికల్స్‌కు ఎండీ, సీఈవోగా పనిచేస్తున్నారు. సియామ్ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర ఎన్నికయ్యారు. దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ సీఈవో, ఎండీ సత్యకమ్ ఆర్యను ట్రెజరర్‌గా సియామ్ ఎన్నుకుంది. -
మారుతి సక్సెస్ మంత్ర ఇదే! సీక్రెట్ రివీల్ చేసిన ఛైర్మన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకీ ఇండియా విజయం మాదిరే.. ఇతర రంగాల్లోనూ భారత్ విజయం సాధించాలని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా భార్గవ మీడియాతో మాట్లాడారు. భారత ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధిలో మారుతి సుజుకీ ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆటో విడిభాగాల సప్లయ్ చైన్, అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పడిందని, ఇప్పుడు ఇవి ప్రపంచ మార్కెట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ‘‘తయారీలో భారత్ పాత్ర చాలా తక్కువ. కానీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా ఉంది. అంతే కాదు ఆటో విడిభాగాల పరిశ్రమ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. కనుక వీటిల్లో కొన్నింటిని మా కృషి వైపు నుంచి చూడాలి’’అని భార్గవ వివరించారు. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్‌గా పేర్కొన్నారు. (Eicher Motors: సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!) ఇతర రంగాల్లోనూ.. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎంతో విజయవంతమైన కంపెనీగా మారుతి సుజుకీ ఇండియా అవతరించినట్టు భార్గవ చెప్పారు. మారుతి విషయంలో విజయం సాధ్యమైనప్పుడు, ఇతర పరిశ్రమల్లోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘‘మారుతి విజయానికి కారణం భారత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సామర్థ్యం. జపనీస్ యాజమాన్య సామర్థ్యం. వనరుల సమర్థ వినియోగం, భాగస్వాములు, యాజమాన్యం, పనివారు, ఇతర భాగస్వాముల మధ్య విశ్వాసం’’అని భార్గవ వివరించారు. మారుతి సుజుకీ ప్రయాణం అంత సాఫీ ఏమీ కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీ కార్ల మార్కెట్లో సుజుకీ 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. -
ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్
ముంబై: ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మంచి వృద్ధిని చూస్తుందని.. కంపెనీల ఆదాయం 20–23 శాతం పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీ ఆటోమొబైల్ రంగం కోలుకోవడానికి తోడు, ఎగుమతులు సైతం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. అయితే, కీలక ముడి సరుకుల ధరలు అధికంగా ఉండడం, సెమీ కండక్టర్ల కొరత పరిశ్రమను వేధిస్తున్న అంశాలుగా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటో విడిభాగాల పరిశ్రమ మంచి రికవరీని చూసినట్టు వివరించింది. ప్రయాణికుల వాహనాలు (పీవీ), ట్రాక్టర్లకు డిమాండ్ బలంగా ఉందని.. కరోనా ముందస్తు నాటి డిమాండ్ స్థాయికి చేరుకున్నట్టు నివేదికలో పేర్కొంది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాల విభాగాలు సైతం కోలుకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయని తెలిపింది. పెరిగిన ముడి పదార్థాల ధరలను బదలాయించినట్టయితే ఇది కూడా ఆదాయ వృద్ధికి తోడ్పడే అంశమేనని పేర్కొంది. పరిశ్రమ స్థూల మార్జిన్లు 2021–22 మొదటి మూడు నెలల్లో సీక్వెన్షియల్‌గా (మార్చి త్రైమాసికం నుంచి) మెరుగుపడినట్టు.. నివేదికలో వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే... చదవండి : ఫేస్బుక్ సమర్పించు....వరల్డ్రూమ్ ♦పరిశీలనలోకి తీసుకున్న 50 ఆటో పరికరాల విభాగాలను తీసుకుంటే, వార్షికంగా క్యూ1లో పటిష్ట స్థాయిలో 140 శాతం వృద్ధి నమోదయ్యింది. లో–బేస్ ఎఫెక్ట్ నామమాత్రంగా ఉంది. ♦సీక్వెన్షెయల్గా చూస్తే, (మార్చి త్రైమాసికంతో పోల్చి) సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, క్షీణత 19 శాతానికి పరిమితమైంది. అంచనాలు 30 నుంచి 35 శాతం క్షీణతకన్నా ఇది ఎంతో తక్కువ. ♦త్రైమాసికంగా 19 శాతం క్షీణతలోనూ టైర్లు, బ్యాటరీలు వంటి విడిభాగాల క్షీణత కేవలం 13కే పరిమితమైంది. ♦ కీలక ముడిపదార్థాలు, కమోడిటీ ధరలు తీవ్రంగా ఉండడం ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాలు. ♦గ్లోబల్ సెమీ కండక్టర్ డిమాండ్‌లో భారత్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ వాటా 11 శాతం. అయితే ఇప్పుడు వీటి కొరత పరిశ్రమకు సవాలుగా మారింది. ఈ విభాగంలో ఊహించినదానికన్నా పటిష్ట రికవరీ, కొన్ని సెమీ–కండక్టర్ తయారీ సంస్థల్లో సరఫరాల సమస్యలు, అంతర్జాతీయంగా పెరిగిన చిప్ కొరత సవాళ్లు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ♦పరిశ్రమలో సరఫరాల సవాళ్లు తొలగిపోలేదు. కొన్ని మోడళ్లు, వేరియెంట్లకు సంబంధించి సరఫరాలు నాలుగు నెలలకుపైగా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. డిమాండ్ పటిష్టంగా ఉన్నప్పటికీ సరఫరాలు అందుకు తగిన విధంగా లేవు. 2021 క్యాలెండర్ ఇయర్ వరకూ ఈ పరిస్థితి కొనసాగుతునందని పరిశ్రమ ప్రతినిధులు అంచనావేస్తున్నారు. ♦పరిశ్రమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశమిది. ♦కోవిడ్–19 సెకండ్‌వేవ్ వల్ల ఆటో విడిభాగాల సరఫరాదారుల్లో మెజారిటీ భాగం ఆపరేటింగ్ మార్జిన్లు తగ్గాయి. -
వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన విక్రయాలు తిరిగి గాడినపడుతున్నాయి. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. జూన్ నెల దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లోనూ కలిపి 12,96,807 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14.7 శాతం వృద్ధి. ప్యాసింజర్ వెహికిల్స్ 1,05,617 నుంచి 2,31,633 యూనిట్లకు ఎగిశాయి. ద్విచక్ర వాహనాలు 10,14,827 నుంచి 10,55,777 యూనిట్లకు చేరాయి. గత నెలలో త్రీ వీలర్లు 9,397 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 జూన్‌లో ఈ సంఖ్య 10,300 యూనిట్లు నమోదైంది. తొలి త్రైమాసికంలో ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో వాహన అమ్మకాలు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా నమోదయ్యాయి. ఈ కాలంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి 31,80,039 వెహికిల్స్ విక్రయమయ్యాయి. కోవిడ్–19 దెబ్బతో 2020–21 తొలి త్రైమాసికంలో ఈ సంఖ్య 14,92,612 యూనిట్లకు పరిమితమైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 1,53,734 నుంచి 6,46,272 యూనిట్లకు పెరిగాయి. ద్విచక్ర వాహనాలు దాదాపు రెండింతలై 24 లక్షల యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వెహికిల్స్ మూడు రెట్లు అధికమై 1,05,800 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు రెండింతలై 24,376 యూనిట్లకు చేరుకున్నాయి. చదవండి: ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు -
ఆటో డిమాండ్‌కు కరోనా షాక్
సాక్షి,ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు..ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగు పడినట్లు కనిపించడం లేదని ఇండ్-రా నివేదికలో తెలిపింది. (భారత్ ఎకానమీకి నష్టం తప్పదు!) నివేదిక ఇతర విశేషాలు.. ► 2021 మార్చి దాకా దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ వరుసగా ఎనిమిదో నెల సానుకూల వృద్ధి నమో దు చేసింది. 2020 మార్చి నాటి లో బేస్ ఎఫెక్ట్ కారణంగా 2021 మార్చిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 115 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 73 శాతం వృద్ధి కనపర్చాయి. ► ఎగుమతుల పరిమాణం 2020 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 57 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల ఎగుమతులు 63 శాతం పెరిగాయి. ► 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఎగుమతుల పరిమాణం 13 శాతం క్షీణించింది. ► కరోనా పరిస్థితులతో వ్యక్తిగత రవాణా వాహనాలకు డిమాండ్ పెరగడం వల్ల ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్‌కు కాస్త ప్రయోజనం చేకూరింది. మిగతా విభాగాలతో పోలిస్తే తక్కువ క్షీణత నమోదైంది. మధ్య స్థాయి, ఎగ్జిక్యూటివ్, ప్రీమియం కార్లు.. వ్యాన్ల సెగ్మెంట్‌తో పోలిస్తే కాంపాక్ట్, సూపర్ కాంపాక్ట్, మినీ, మైక్రో కార్ల అమ్మకాలు మెరుగ్గా నమోదయ్యాయి. తొలిసారిగా కారు కొనుగోలు చేస్తున్న వారు వీటికి ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. ► యుటిలిలటీ వాహనాలకు డిమాండ్ కొనసాగింది. కొత్త వాహనాల ఆవిష్కరణ కారణంగా ఈ విభాగం 12 శాతం వృద్ధి చెందింది. ► గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ .. ద్విచక్ర వాహనాల విభాగానికి సానుకూలంగా దోహదపడింది. అయితే, విద్యా సంస్థలను తెరవడంలో జాప్యం జరగడం, ఇంధన ధరల పెరుగుదలతో వాహనాల నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, కోవిడ్ సంబంధ లాక్‌డౌన్‌తో ఆదాయాలు పడిపోయి కొంత మేర ప్రతికూల ప్రభావమైతే పడింది. ముఖ్యంగా ఎంట్రీ స్థాయి మోడల్స్‌పై ఇది కనిపించింది. చదవండి : కరోనా ముప్పు: ఎస్బీఐ సంచలన రిపోర్ట్ -
టయోటా మోటార్స్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో ఆటో పరిశ్రమపై అధిక పన్నుల విధానం కారణంగా మరింత విస్తరించబోమని ప్రకటించింది.ఇక మీదట ఇండియాలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి లేదనీ, అయితే మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతామని జపాన్ కు చెందిన టయోటా తెలిపింది. భారతీయ పన్నుల విధానం వల్ల కార్ల ఉత్పత్తి చేసినా డిమాండ్ లేదని ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక పెట్టుబడులు పెట్టేది లేదని స్పష్టం చేసింది టయోటా. కార్లు, మోటారు బైకులపై ప్రభుత్వం పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ దీంతో తమ ఉత్పత్తి దెబ్బతింటోందనీ, ఫలితంగా ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అన్నారు. భారీ పెట్టుబడుల తరువాత కూడా అధిక పన్నుల ద్వారా మిమ్మల్ని కోరుకోవడం లేదనే సందేశం అందుతోందని అని విశ్వనాథన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానంగా ఇన్నోవా, ఫార్చునర్ కార్లతో భారతీయ వినియోగదారులకు చేరువైన ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో కార్ల కంపెనీ టయోటా 1997లో ఇండియా మార్కెట్లోకి వచ్చింది.(సేల్స్ మరోసారి ఢమాల్, ఆందోళనలో పరిశ్రమ) అతిపెద్ద మార్కెట్ భారత్ నుంచి ఇప్పటికే (2017లో) అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ వైదొలిగింది.ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలకు స్వస్తి చెప్పి మహీంద్రాలో జాయింట్ వెంచర్ గా కొనసాగుతోంది. హార్లీ డేవిడ్ సన్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు సహా మోటారు వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇంజిన్ సైజు, పొడుగు, లగ్జరీ కేటగిరీ వారీగా 1 శాతం నుంచి 22 శాతం అదనపు పన్నులు భారం పడుతోంది. 1500 సీసీ ఇంజిన్‌తో పాటు, నాలుగుమీటర్ల పొడువు దాటిన ఎస్‌యూవీల దాదాపు 50శాతం వరకూ పన్నులు పడుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. కరోనా సంక్షోభం కంటే ముందే ఆటో రంగం కుదేలైన సంగతి తెలిసిందే. అమ్మకాలు క్షీణించి, ఆదాయాలు లేక ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆటో పరిశ్రమను కరోనా మరింత దెబ్బతీసింది. పలు కంపెనీలు దేశం నుంచి వైదొలగుతున్నాయి. ఈ మందగమనం నుంచి బయటపడేందుకు కనీసం నాలుగేళ్లు పడుందని అంచనా. అటు టయోటా తాజా నిర్ణయంతో మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలను ఆకర్షించి, భారీగా పెట్టుడులవైపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బేనని ఆటో రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నెల 23న టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 ఎం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించింది. -
ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 25% క్షీణత
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు భారీగా క్షీణించాయి. ఈ జూలైలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 1,57,373 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది(2019)లో ఇదే జూన్‌లో అమ్ముడైన 2,10,377 యూనిట్లతో పోలిస్తే 25శాతం తక్కువని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. కరోనా ఎఫెక్ట్ జూలైలోనూ కొనసాగడం వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఎఫ్ఏడీఏ చెప్పుకొచ్చింది. ద్విచక్ర వాహన అమ్మకాలు జూలైలో 37.47శాతం క్షీణించి 8,74,638 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే జూలైలో మొత్తం అమ్మకాలు 13,98,702 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన అమ్మకాలు ఏకంగా 72.18శాతం పడిపోయి 19,293 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే జూలైలో త్రిచక్ర వాహనాల విక్రయాలు క్షీణతను చవిచూశాయి. గతేడాది జూలైలో పోలిస్తే అమ్మకాలు 74.33శాతం పతనమై 15,132 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని విభాగాలు కలిపి మొత్తం అమ్మకాలు 11,42,633 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 17,92,879 యూనిట్లతో పోలిస్తే 36.27శాతం తగ్గదల చోటుచేసుకుంది. వాహన విక్రయాలపై ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలే మాట్లాడుతూ ‘‘జూన్‌తో పోలిస్తే జూలైలో రిటైల్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన పరిశీలిస్తే విక్రయాలు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వాస్తవ డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. గతేడాది జూలైలో లోబేస్ ఉన్నప్పటికీ అమ్మకాలు డబుల్ డిజిట్ క్షీణతను చవిచూశాయి’’ అన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తారమైన వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్, చిన్న వాణిజ్య వాహనాలు, మోటర్ సైకిల్ విభాగాల్లో అమ్మకాల వృద్ధి కొనసాగిందని ఖేల్ తెలిపారు. డిమాండ్‌ను పెంచే విధివిధానాలను ప్రకటించాలని ఎఫ్ఏడీఏ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు. ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానం కోసం పరిశ్రమ ఆత్రంగా ఎదురుచూస్తోందని ఇది మధ్య, భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అటో తయారీ హబ్స్‌లో లాక్డౌన్ విధింపు లేకపోతే అగస్ట్ అమ్మకాలు ఆశాజనకంగా ఉండొచ్చని కాలే అభిప్రాయపడ్డారు. -
సేల్స్ మరోసారి ఢమాల్ , ఆందోళనలో పరిశ్రమ
సాక్షి, ముంబై: దేశీయంగా ఆటో మొబైల్ పరిశ్రమకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే దశాబ్దం కనిష్టానికి పడిపోయిన వాహనాలు అమ్మకాలు కొత్త ఏడాదిలో కూడా అదే ధోరణిని కొనసాగించాయి. 2020 జనవరిలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 6.2 శాతం క్షీణించాయి. వరుసగా మూడవ నెల క్షీణత. 2019 సెప్టెంబర్ అమ్మకాలు దాదాపు 24 శాతం క్షీణించాయి. వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు క్రమేపీ క్షీణతను నమోదు చేయడం మరింత ఆందోళనకు రేపుతోంది. తాజా గణాంకాల ప్రకారం జనవరి నెలలో కారు సేల్స్ కూడా 8.1 శాతం తగ్గిపోయాయి. గత ఏడాది జనవరిలో ఈ సేల్స్ 1,79,324 యూనిట్లు కాగా, ఈ జనవరిలో 1,64,793 యూనిట్లకు పడిపోయాయి. వ్యాన్ల అమ్మకం 28 శాతం క్షీణించి 12,992 వద్ద ఉంది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం తగ్గి 75,289 యూనిట్లకు చేరుకోగా, గ్రామీణ వినియోగ ధోరణిని సూచించే ద్విచక్ర వాహనాలు 16 శాతం తగ్గి 13,41,005 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ నెలలో మొత్తం ఆటో మొబైల్స్ అమ్మకాలు 14 శాతం తగ్గి 17,39,975 యూనిట్లకు చేరుకున్నాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 14.04 శాతం మేర తగ్గి 87,591నుండి 75,289కు పడిపోయాయి. ఆటోఎక్స్‌పో కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ బలపడుతుందని భావిస్తున్నామని, తద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఓనర్షిప్ వ్యయం పెరగడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు మందగింపు లాంటివి అమ్మకాలు పతనానికి కారణమని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ సియామ్ సోమవారం వెల్లడించింది. దీనికితోడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న బీఎస్-6 నిబంధనలకనుగుణంగా మారాల్సిన నేపథ్యం కూడా సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణమని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాధేరా తెలిపారు. ఈ పరివర్తనం చెందడానికి పరిశ్రమకున్న సమయం చాలా తక్కువ అని పేర్కొన్నారు. ప్యాసెంజర్ వాహనా అమ్మకాల క్షీణత రేటు గతంలో ఉన్నదానికంటే చాలా తక్కువగా ఉన్నప్పటికీ దేశంలో ముదురుతున్న ఆర్థిక మందగమనానికి ఇది నిదర్శనమని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష మీనన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ఇతరకారణాల రీత్యా ఉద్గార నిబంధనల అమలు గడువును మరింత కాలం పొడిగించాలని కూడా కోరుతున్నాయి. -
బడ్జెట్ 2020 : ఆటో ఇండస్ట్రీ ఏం ఆశిస్తోంది?
సాక్షి, ముంబై: రాబోయే యూనియన్ బడ్జెట్లో తమకు ప్రోత్సాహకాల కల్పించాలని ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది. సుదీర్ఘ మందగమనం, 2019 లో రెండు దశాబ్దాలు కనిష్టానికి పడిపోయిన అమ్మకాలు నేపథ్యంలో ఆటో రంగ పునరుద్ధరణకు కొన్ని ఆర్థిక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వాహనలపై జీఎస్టీ భారం తగ్గింపు, లిథియం-అయాన్ బ్యాటరీల దిగుమతిపై సుంకం రద్దు చేయడం వంటి చర్యలను పరిశ్రమ ఆశిస్తోంది. దాదాపు ఏడాది కాలంగా తిరోగమనాన్ని ఎదుర్కొంటున్న ఆటో మొబైల్ పరిశ్రమ, పాత వాహనాల వాడకాన్ని నిరుత్సాహపరిచేందుకు ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానంతోపాటు వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని భావిస్తోంది. అలాగే బీఎస్-6 ఉద్గార నిబంధనల అమలును పరిశ్రమ స్వాగతిస్తోంది. ఈ చొరవ వాహన వ్యయంలో 8-10 శాతం పెరుగుదలకు దారితీస్తుందని, తద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని భావిస్తోంది. అయితే, ఈ అదనపు ఖర్చు డిమాండ్ తగ్గడానికి దారి తీస్తుందనీ, ఈ క్రమంలో ఏప్రిల్ నుండి బీఎస్ 6 వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతోంది. కాగా 2019 లో వాహనాల అమ్మకాలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. గత వారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అన్ని వాహన విభాగాల్లో నూ 13.77 క్షీణతను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
లక్షకు పైగా ఉద్యోగాలు పోయాయ్
సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమం సంక్షోభం, ఇతర సెగ్మెంట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఆటోరంగ ఉత్పత్తి 13 శాతం క్షీణతను నమోదు చేసింది. డిమాండ్ తగ్గడం, ఆర్థికమందగనం కారణంగా పలు సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి ప్లాంట్లను తాత్కాలికంగా మూసేశాయి. దీంతో ఆటో రంగంలోనూ ఉద్వాసనలకు తెర లేచింది. అంతేకాదు ఈ ప్రభావంతో ఆటో స్పేర్స్‌లో ఈ ఏడాది జూలై నాటికి 1 లక్ష మంది తమ తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయారని ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) శుక్రవారం తెలిపింది. ఊహించనంత సుదీర్ఘమైన మందగమనం వాహన పరిశ్రమను దెబ్బతీస్తోందని, అమ్మకాలు బాగా తగ్గాయని, ఇది ఇతర సెగ్మెంట్లను దెబ్బతీస్తోదని అసోసియషన్ ప్రెసిడెంట్ దీపక్ జైన్ చెప్పారు. 2013-14 తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులేర్పడ్డాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆటో ఉత్పత్తి తగ్గడంతో విడిభాగాల పరిశ్రమ సామర్థ్య వినియోగం 50 శాతం పడిపోయినట్లు తెలిపింది. గతంలో ఇది గరిష్టంగా 80 శాతం నమోదయిందన్నారు. భారతదేశపు 57 బిలియన్ డాలర్ల ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ, దేశ జిడిపిలో 2.3 శాతం వాటాను కలిగిఉంది. అలాగే 5 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఆటో కంపోనెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ గత ఏడాది ఏప్రిల్ - సెప్టెంబర్ కాలంలో రూ.1.99 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది ఇదే కాలంలో 10.1 శాతం తగ్గి రూ.1.79 లక్షల కోట్లుగా ఉందని అసోసియేషన్ పేర్కొంది. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు పేర్కొంది. అయితే ఎగుమతులు 2.7శాతం పెరిగి రూ.51,397 వేల కోట్లకు (7.5 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయని ఏసీఎంఏ తెలిపింది. -
ఆర్థికమంత్రి వ్యాఖ్యలు : నెటిజనుల దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: ఆటో మొబైల్ రంగం రోజు రోజుకు సంక్షోభంలోకి జారుకోవడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త వాదన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆటోరంగం మందగమనానికి యువత ఒక కారణమని, ఈ రోజుల్లో యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లవైపు మొగ్గు చూపడం లేదని, ఈఎంఐ భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లపై ఆసక్తి చూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందన్నారు. దీంతో సోషల్ మీడియాలో సేఇట్ సీతారామన్తాయి లైక్, బాయ్‌కాట్ మిలీనియల్స్ హ్యాష్‌ట్యాగ్‌లు దుమారం రేపుతున్నాయి. ఆర్థికమంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువతకు పానీ పూరీ ఇష్టం...అందుకే బీహెచ్ఈఎల్ 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ బాయ్‌కాట్ మిలీనియల్స్ ట్రెండ్స్ హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు నిజమే..సొంత వాహనం ఉంటే డబ్బుల దండగ. డబ్బుని మిగిలించుకోవాలి కదా అనే కమెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా కొత్త మోటారు సవరణ చట్టంపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. డ్రైవింగ్ టెన్షన్స్, నిబంధనల ఉల్లంఘనల చలాన్లు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. అందుకే వాహనాలు కొనుగోలు చేయటం లేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. డాలర్‌ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోంది. ‘రోడ్లు బాగా లేవు అందుకే లారీల విక్రయాలు పడిపోయాయి. అంతేకదా మంత్రి గారు’. ప్రతీదానికి యువతనెందుకు ఆడిపోసుకుంటారు...ఇలా ఒకటి కాదు రెండుకాదు, సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అప్రతిహతంగా పంచ్ లు పేలుతున్నాయి.. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల పాలనముగింపు సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆటో రంగం మందగించడం వెనుక ఒక ప్రధాన అంశం మిలీనియల్స్ మనస్తత్వం మారడమే అని పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనానికి కారణమని వ్యాఖ్యానించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు,లారీల విక్రయాలు ఇటీవల రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమొబైల్ రంగంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో తమ ఫ్లాంట్లను తాత్కాలికంగా మూసివేశాయి. అశోక్ లేలాండ్ అయిదు ప్లాంట్లలో 16 రోజుల పాటు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి విషయం తెలిసిందే. చదవండి : పెట్టుబడులపై టాస్క్‌ఫోర్స్ దృష్టి.. దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం Oxygen crisis will be occur because millennial inhale more oxygen in the morning. #BoycottMillennials pic.twitter.com/0LKxC8u3BW — Muhammd Ali (@alikarwi00) September 11, 2019 BHEL is at its lowest in 15 years because millennials prefer "Paani puri". #BoycottMillennials #SayItLikeNirmalaTai — ERVJ 🇮🇳 (@iam_vjoshi) September 10, 2019 #BoycottMillennials as they are preferring live-in relationships instead of marriages. Result: brahmins, pandits and jyotish, are becoming jobless. — Check_Mate (@IndianScooter) September 10, 2019 The market for 'Gobar' is down, because millennials ain't buying 'no shit'.#SayItLikeNirmalaTai #BoycottMillennials — Anoop Tomer (@anooptomer) September 10, 2019 -
దారుణంగా పడిపోయిన అమ్మకాలు : మరింత సంక్షోభం
సాక్షి, ముంబై: దేశీయ ఆటో పరిశ్రమ మరింత కుదేలవుతోంది. వరుసగా పదవ నెలలో కూడా అమ్మకాలు భారీగా పడిపోయాయి. నెలవారీ ప్యాసింజర్ వాహనాలు,ఇతర కార్ల అమ్మకాలు ఆగస్టులో దారుణంగా పడిపోయాయి. భారతీయ ఆటోమొటైల్ ఉత్పత్తుల అసోసియేన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత మాసంలో రికార్డు క్షీణతను నమోదు చేశాయి. 1997-98 సంవత్సం నుంచి డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద క్షీణత అని సియామ్ వెల్లడించింది. దీంతో భారత ఆటో రంగ సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 31.57 శాతం పడిపోయి ఆగస్టులో 196,524 యూనిట్లకు చేరుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సమవారం విడుదల చేసిన గణాంకాలు ప్రకారం ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఎగుమతులు 14.73 శాతం పుంజుకున్నాయి. కాగా ఆటో అమ్మకాల క్షీణత ఈ రంగంలో భారీగా ఉద్యోగ నష్టానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. వాహన కంపెనీలు ఇప్పటికే 15 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. గత మూడు నెలల్లో దాదాపు 300 డీలర్‌షిప్‌లు మూతపడగా, దేశవ్యాప్తంగా 2.8 లక్షల ఉద్యోగులను డీలర్లు తొలగించారు. మాంద్యం కొనసాగితే మరో పది లక్షల ఉద్యోగాలు పోతాయనే భయాందోళనలు నెలకొన్నాయి. అటు భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత వారం హర్యానాలోని తన గురుగ్రామ్, మనేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని రెండు రోజులు నిలిపివేసినట్లు తెలిపింది. గత వారం జరిగిన ఒక సమావేశంలో లక్షలాది మంది ఉద్యోగాల కోతలకు కారణమైన మందగమనం ఇలాగే కొనసాగితే మరింత సంక్షోభం తప్పదని పరిశ్రమ వర్గాలు ఆందోళనపడుతున్నాయి. మరోవైపు అశోక్ లేలాండ్ తాజా గణాంకాల నేపథ్యంలో మరో 16 రోజుల పనిదినాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. -
ఆటో మొబైల్ పరిశ్రమకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఆటో పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడికి ఎలాంటి గడువు లేదని తేల్చి చెప్పారు. ఇ-వాహనాల పరివర్తన సహజంగా జరుగుతుందని స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా మందగమనంలో విలవిల్లాడుతూ, విక్రయాలు 19ఏళ్ల గరిష్ఠానికి పడిపోయిన నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలుకు గడ్కరీ ప్రకటన భారీ ఊరటనివ్వనుంది. 2023 నుంచి 150 సీసీ లోపు ద్విచక్రవాహనాలు, 2025 నాటికి త్రిచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా పూర్తిగా మారాలని ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై స్పందించాల్సిందిగా కేంద్రమంత్రిని కోరినపుడు ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఈ గడువులోగా నిషేధించాలనే గడువు లేదని, అలాంటిదేమైనా వుంటే సంబంధిత వర్గాలను సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. పరివర్తన సహజ ప్రక్రియగా జరుగుతుందన్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఇంజన్లను నిషేధించదని లోక్‌సభ సమావేశాల్లో కూడా గడ్కరీ ఆటోమొబైల్ పరిశ్రమకు హామీ ఇచ్చిన సంగతి గమనార్హం. ఈవీ వాహనాల పరివర్తన గడువుపై ఆటోమొబైల్ మేజర్స్ టీవీఎస్ మోటార్ బజాజ్ ఆటో కూడా ఇలాంటి ఆకస్మికంగా ఈ మార్పును సాధించలేమని టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఇంతకుముందే వెల్లడించారు. ఈ విషయంలో దేశం, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ రెండూ చాలా దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫలితంగా 4 మిలియన్ల ఉద్యోగాలను కల్పిస్తున్న ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతింటుందని శ్రీనివాసన్ తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా ఆటో పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డిమాండ్ క్షీణించి తో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిలో మందగమనంలో ఉందని, గత కొన్ని నెలలుగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నివేదికలు వెలువడ్డాయి. అటు ఈ ధోరణి మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే, 10లక్షలకు పైగా ఉద్యోగనష్టాలకు దారితీస్తుందని ఆటోమోటివ్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా వ్యాఖ్యానించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల ప్రకారం, ఆటో పరిశ్రమ గత సంవత్సరంతో పోల్చితే 2019 లో అమ్మకాలలో 31శాతం తగ్గుదల నమోదైంది. -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరాచేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16,17న (2 రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అందరమూ దానికోసమే వెదుకుతున్నాం..!
సాక్షి, ముంబై : 2019 కేంద్ర బడ్జెట్లో ఆటో పరిశ్రమ ఆశలు, అంచనాలపై పారిశ్రామికవేత్త మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఆటో మొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) తగ్గించాలని కోరుకున్నారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని అన్నారు. ఆటో పరిశ్రమ రంగం చిన్న కంపెనీలు, ఉపాధి కల్పనపై పెను ప్రభావం చూపుతుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే (అమృతాన్నిపంచే) మందర పర్వతం(క్షీరసాగర మథనంలోని పర్వతం) వైపు అందరం చూస్తున్నాం. తానూ పక్షపాతంగానే ఆలోచిస్తున్నప్పటికీ.. జీఎస్టీ తగ్గిస్తే.. ఉద్యోగాల కల్పన, చిన్న పరిశ్రమల వృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఆటోకార్ ప్రొఫెషనల్ అనే ఆటోమోటివ్ మ్యాగజీన్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్ర స్పందించారు. దేశంలో భారీగా(మూడో వంతు) ఉద్యోగాలు సృష్టించే ఆటోమొబైల్ రంగం మళ్లీ వృద్ధి దిశగా పయనించాలంటే వాహనాలపై జీఎస్టీ తగ్గించాల్సిన అవసరం ఉందన్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జాన్ కే పాల్ వ్యాఖ్యలను మ్యాగజైన్ ట్వీట్ చేసింది. అటు పరిశ్రమ బాడీ సియామ్ కూడా వాహనాలపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా 18 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పతనమయ్యాయి. మే నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 20 శాతానికి పైగా క్షీణించాయి. అంతక్రితం 2001 సెప్టెంబరులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 21.91శాతం పడిపోయాయి. What we’re all searching for is the ‘Mt. Mandara’ which can start the ‘Manthan’ of the economy & get it spinning faster. I’m biased, of course,but the auto industry is one such ‘Mandara.’ It has a huge multiplier effect on small companies & on employment. Lowering GST would help https://t.co/13SOajY3Lt — anand mahindra (@anandmahindra) June 26, 2019 -
టోయోటా క్రేజీ వెహికిల్, మీరే చూడండి ఎలా ఉందో..
జపాన్‌కు చెందిన టోయోటా కంపెనీ, క్రేజీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాన్ని విడుదల చేసింది. ఇ-పాలెట్ పేరుతో లాస్ వేంగాస్లో జరుగుతున్న అంతర్జాతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)లో ఈ వాహనాన్ని టోయోటా ప్రదర్శించింది. బాక్స్ ఆకారంలో ఉన్న ఈ వాహనం మూడు సైజుల్లో మార్కెట్లోకి వస్తుంది. దీనిలో పెద్ద సైజు వాహనం అచ్చం బస్సు మాదిరి ఉంది. సరుకు రవాణాకు, పెద్ద పెద్ద డెలివరీలకు దీన్ని వాడుకోవచ్చు. వివిధ సైజుల్లో ఉన్న ఈ వాహనాన్ని పలు అవసరాలకు వాడుకోవచ్చని టోయోటా కూడా చెబుతోంది. వెహికిల్ సైజు బట్టి సరుకుల డెలివరీకి, ప్రజారవాణాకు, మొబైల్ స్టోర్ఫ్రంట్కు లేదా ఆఫీసు అవసరాల కోసం వినియోగించుకోవచ్చని పేర్కొంటోంది. అమెజాన్, దీదీ, పిజ్జా హట్, ఉబర్ లాంటి కంపెనీల ఇన్పుట్ల ద్వారా ఈ వాహనాన్ని డిజైన్ చేశామని, 2020 నుంచి ఈ వాహానాన్ని టెస్ట్ చేయనున్నట్టు టోయోటా పేర్కొంది. 2020లో టోక్యోలో జరుగబోయే పారాలింపిక్ గేమ్స్‌లో కూడా ఈ వాహనం పాలుపంచుకోనుంది. టెక్నాలజీలో మార్పులు సంభవిస్తున్న కొద్దీ, దానికి అనుకూలంగా ఆటో పరిశ్రమ కూడా రూపాంతరం చెందుతోంది. ఎలక్ట్రిఫికేషన్, కనెక్టెడ్, ఆటోమేటెడ్ డ్రైవింగ్ ఇవన్నీ ప్రస్తుతం రాబోతున్న తరాల వారి ముందుకు వస్తున్న వాహనాలు. సంప్రదాయ కార్లకు మించి తమ విస్తరణను ఇది ప్రదర్శిస్తుందని టోయోటా ప్రెసిడెంట్ అకియో టోయోడా చెప్పారు. ఎయిర్‌లెస్ టైర్లతో ఓ కాన్సెప్ట్ వాహనాన్ని కూడా టోయోటా 2017లో ప్రవేశపెట్టింది. -
జీఎస్టీ: కార్ల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?
న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నుల రేటుపై ఆటోమొబైల్ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ తాజా పన్ను రేటు 28శాతంగా నిర్ణయించడం పరిశ్రమకు లబ్ది చేకూర్చనుందని ఆటో మొబైల్ పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ రేట్లు ఊహించిన రీతిలో ఉన్నాయని సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. జీఎస్టీ 28శాతం గా నిర్ణయించినప్పటికీ కమర్షియల్ వెహికల్స్ , టూవీలర్ ధరలు దాదాపుగా తటస్థంగా ఉండవచ్చని పేర్కొన్నారు అయితే పెద్ద సెడాన్లు, ఎస్యూవీ లాంటి లగ్జరీ వాహనాల రేట్లు దిగిరానున్నాయని ఇక్రా పేర్కొంది. జీఎస్టీ తరువాత చిన్నకార్ల ధరలు స్వల్పంగా పెరిగొచ్చని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రాయ్ చెప్పారు. ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జిఎస్టిని ప్రకటించినప్పటికీ వైవిధ్యభరితమైన కార్లపై వేర్వేరు పన్నుల స్లాబ్లులపై ఇంకా స్పష్టత లేదని రీసెర్చ్ హెడ్ వైభవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. . అయితే త్రీ వీలర్ ధరలు పెరగనున్నాయని చెప్పారు. చిన్నకార్ల ధరలు 2-3 శాతం పెరుగుతాయనీ, లగ్జరీ కార్ల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందన్నారు. కాగా జీఎస్టీ కౌన్సిల్ 14 వ సమావేశంలో ఆటోమొబైల్స్తో సహా అన్ని వర్గాల వస్తువులపై జీఎస్టీ రేటును ఖరారు చేసింది. ముఖ్యంగా ఆటోమొబైల్ విభాగానికి ఆధార జీఎస్టీ ఆధార రేటు 28శాతంగా నిర్ణయించింది. బేస్ రేటుతో పాటుగా, పెట్రోలు మరియు డీజిల్ ఇంజిన్లతో కూడిన చిన్న కార్లపై 1శాతం, 3శాతం సెస్‌ను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న మొత్తం పరోక్ష పన్ను రేట్లకు దాదాపు అనుగుణంగానే ఉంది. -
జీఎస్టీ: ఆటోఇండస్ట్రీకి మేలు చేస్తుందా?
న్యూఢిల్లీ: జీఎస్టీ పన్నుల రేటుపై ఆటోమొబైల్ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఒకవైపు 18శాతం పన్నురేటుపై టెలికాం పరిశ్రమ నిరాశను ప్రకటించగా, ఆటోఇండస్ట్రీ మాత్రంహర్హం వ్యక్తం చేసింది. జీఎస్టీ తాజా పన్ను రేట్లు పరిశ్రమకు లబ్ది చేకూర్చనుందని ఆటో మొబైల్ పరిశ్రమ పెద్దలు వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ రేట్లు ఊహించిన రీతిలో ఉన్నాయని సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. పన్నుల విషయంలో స్థిరత్వాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. దేశంలో ఆటోమోటివ్ మార్కెట్‌ను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. అలాగే ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2016-26విజన్ సాధనకు మార్గాన్ని సుగమం చేస్తుదని సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. పర్యావరణ హితమైన ఎకోఫ్రెండ్లీ టెక్నాలజీకి ప్రభుత్వం ప్రోత్సాహిన్నిస్తోందన్నారు. ఇలాంటి వాహనాలపై తక్కువ పన్నురేటువిధానాలు గ్రీన్హౌస్ వాయువుల ఉద్గా రాలను,కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సహాయం చేస్తాయన్నారు. అయితే లగ్జరీ వాహనాలపైనా, ప్రజా రవాణాకుపయోగపడే 10-13 సీటర్ వాహనాలపై 15శాతం సెస్ ఊహించలేదన్నారు. దీన్ని సమీక్షించాల్సి ఉందన్నారు. -
ఆటో పరిశ్రమకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఢిల్లీలో భారీ డీజిల్ వాహనాల నిషేధంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తప్పుడు సమాచారం ఆధారంగా కోర్టులు ఈ నిషేధాన్ని విధించాయంటోంది. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్య వాహనాల నిషేధంతో ఆటో పరిశ్రమ భారీగా నష్టపోయిందని సియామ్ ఆరోపిస్తోంది. ఈ నిషేధం మూలంగా గత 8 నెలల్లో రూ .4,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అశోక్ లేలాండ్ ఎండీ, సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) యొక్క 58 వ వార్షిక సమావేశాలలో మాట్లాడిన దాసరి ఈ విషయాన్ని వెల్లడించారు. వాతారణ కాలుష్యానికి గల అసలు కారణాన్ని గుర్తించకుండా ఆటో పరిశ్రమను నియంత్రించాలని ప్రతివారూ చూస్తున్నారని విమ్శించారు. మీడియా సృష్టించిన హైప్, తప్పుడు సమాచారాన్ని ఆధారంగా కోర్టులు నిషేధం విధించాయన్నారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాహనాలపై నిషేధం విధించడం సరికాదన్నారు. దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 50 శాతం తమదేనని, ముప్పయి మిలియన్ల ఉద్యోగాలను ఆటో పరిశ్రమ కల్పిస్తోందని ఇందుకు చాలా గర్వంగాఉందని దాసరి పేర్కొన్నారు.కానీ ఎక్కడ కాలుష్య ఉన్నా.. ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఆటో పరిశ్రమనే తప్పుపడుతున్నారని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిషేధం పొల్యూషన్ నియంత్రించడానికి ఎంతమాత్రం ఉపయోగపడదని దాసరి వ్యాఖ్యానించారు. పర్యావరణ సెస్ 1 శాతం విధింపు మూలంగా 2000 సీసీ పైన డీజిల్ వాహనాలను ప్రజలుకొనడం మానేస్తారా? దాని వలన ఢిల్లీ నగరంలో కాలుష్యం తగ్గిపోతుందనా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆటో పరిశ్రమకు సవాల్ లాంటిదని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆటో పరిశ్రమ తిరిగి తమ ఇమేజ్ పునర్నిర్మాణానికి కలిసి పని చేయాల్సి అవసరం ఉందని దాసరి పిలుపునిచ్చారు.