గుడ్‌న్యూస్‌: భారీగా పెర‌గ‌నున్న భార‌తీయుల జీతాలు!! చైనా,ర‌ష్యా దేశాల్లో అంత‌సీన్ లేదంట‌! | Indian Employees May Get Highest Salary Hike Better Than China,russia | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: భారీగా పెర‌గ‌నున్న భార‌తీయుల జీతాలు!! చైనా,ర‌ష్యా దేశాల్లో అంత‌సీన్ లేదంట‌!

Published Sat, Feb 19 2022 3:16 PM | Last Updated on Sat, Feb 19 2022 9:33 PM

Indian Employees May Get Highest Salary Hike Better Than China,russia - Sakshi

భార‌తీయ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఈ ఏడాది మ‌న‌దేశానికి ఉద్యోగుల జీతాలు భారీ ఎత్తున పెర‌గ‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు వెలుగులోకి వ‌చ్చాయి. అంతేకాదు రానున్న ఐదేళ్ల‌లో మిగిలిన దేశాల‌కు చెందిన ఉద్యోగుల కంటే మ‌న‌దేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని తేలింది. 

ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే ప్రకారం..2022లో మ‌న‌దేశానికి చెందిన ఉద్యోగుల జీతాలు ఐదేళ్ల గరిష్ఠ స్థాయి 9.9 శాతానికి చేరుకుంటాయ‌ని తేలింది. సంస్థలు సైతం 2021లో జీతాలు 9.3 శాతంతో పోలిస్తే 2022లో 9.9 శాతం జీతాల పెరుగ‌తాయ‌ని అంచనా వేస్తున్న‌ట్లు అయాన్ త‌న స‌ర్వేలో హైలెట్ చేసింది.

40కి పైగా పరిశ్రమలకు చెందిన 1,500 కంపెనీల డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో అత్యధికంగా జీతాలు పెరుగుతాయని అంచనా వేసింది. భారీగా పెర‌గ‌నున్న జీతాలు ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, హైటెక్/ఐటి ,ఐటి ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటిఇఎస్), లైఫ్ సైన్సెస్ రంగాలు ఉన్నాయి.  

జీతాల విష‌యంలో త‌గ్గేదేలా
బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ల‌లో అయాన్ స‌ర్వే చేసింది. ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్‌ దేశాలదే. అయితే ఈ బ్రిక్స్ దేశాల్లో అయాన్ చేసిన స‌ర్వేలో బ్రెజిల్, రష్యా, చైనాల కంటే మ‌న‌దేశంలో ప‌నిచేసే ఉద్యోగుల జీతాలు ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. ఇక ప‌ర్సంటేజీల వారీగా చూసుకుంటే  చైనాలో జీతాల పెంపుదల 6 శాతం, రష్యాలో 6.1 శాతం, బ్రెజిల్‌లో 5 శాతం ఉండ‌నున్న‌ట్లు త‌న త‌న రిపోర్ట్‌లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement