న్యూఢిల్లీ: ఎనిమిది రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమల గ్రూప్ నవంబర్‌లో 5.4 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పురోగమించింది. బొగ్గు (12.3 శాతం), ఎరువులు (6.4 శాతం), స్టీల్ (10.8%), సిమెంట్ (28.6 శాతం), విద్యుత్ (12.1 శాతం) రంగాలు మంచి ఫలితాలను నమోదుచేసుకోవడం దీనికి నేపథ్యం.
అధికారిక గణాంకాల ప్రకారం, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టుల నవంబర్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదుచేసుకుంది. అక్టోబర్‌లో ఈ గ్రూప్ వృద్ధిరేటు 0.9 శాతంకాగా, గత ఏడాది ఇదే నెల్లో 3.2 శాతం. ఇక 2022–23 మొదటి తొమ్మిది (ఏప్రిల్–నవంబర్) నెలల్లో గ్రూప్ వృద్ధిరేటు 8 శాతం కాగా, గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 13.9 శాతం.
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ నవంబర్ గణాంకాలు 2023 జనవరి రెండవ వారంలో విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment