గత రెండేళ్లుగా అదానీ గ్రూపు జోరుమీదుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, గ్రీన్ ఎనర్జీ, పెట్రో ఉత్పత్తులు ఇలా అన్నింటా భారీ లాభాలను కళ్ల జూస్తోంది. ఇదే తరుణంలో ఆ కంపెనీల యజమానీ గౌతమ్ అదానీ సంపద సైతం జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. ప్రపంచంలోనే టాప్‌టెన్ ధనవంతుల జాబితాలో అదానీకి చోటు లభించింది. అయితే ఈ ప్రయాణంలో అదానీ ఒక్కడే కాదు అతన్ని నమ్మి పెట్టుబడులు పెట్టిన వారు సైతం భారీ లాభాలను కళ్లజూశారు.
అదానీ గ్రూపు నంచి వంట నూనెలు, ఇండస్ట్రియల్ ఎసెన్షియల్స్, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు అందించే సంస్థగా విల్మర్ ఉంది. కొన్నేళ్లుగా ఈ రంగంలో గణనీయమైన లాభాలు సాధిస్తు వచ్చిన విల్మర్ ఈ ఏడాది స్టాక్‌మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ స్టాక్స్‌పై పెట్టుబడులు పెట్టిన వారు రెట్టింపు లాభాలను అందుకుంటున్నారు.
బాంబే స్టాక్ మార్కెట్‌లో విల్మర్ 2022 ఫిబ్రవరి 8న లిస్టయ్యింది. ఆ సయమంలో షేరు ధర రూ.221గా నమోదు అయ్యింది. ఈ షేరు లిస్టింగ్ ప్రైస్ రూ. 230గా నిర్ణయించినా డిస్కౌంట్‌తో కలిసి రూ.221లో ట్రేడ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత అంతర్జాతీయ పరిస్థితు కారణంగా ఒక్కసారిగా వంట నూనె ధరలు అమాంతం పెరగడం మొదలెట్టాయి. దీంతో విల్మర్ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది.
మార్కెట్ పండితుల ముందస్తు అంచనాలను బద్దలు కొడుతూ విల్మర్ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. దీనికి ఉక్రెయిన్ యుద్ధం అనంతరం తలెత్తిన పరిస్థితులు కూడా తోడయ్యాయి. వెరసి రెండు నెలల వ్యవధిలోనే విల్మర్ షేర్ల ధర మూడింతలయ్యింది. 2022 ఫిబ్రవరి 8న రూ.221 ఉన్న షేరు ధర 2022 ఏప్రిల్ 20న రూ.684 దగ్గర ట్రేడవుతోంది. కేవలం యాభై రోజలు వ్యవధిలో ఒక్క షేరు ధర రూ.418 పెరిగింది. ఒక్కో షేరు 156 శాతం వృద్ధిని కనబరిచింది.
విల్మర్ షేర్లలో లాభాలను సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఫిబ్రవరిలో ఈ షేర్లపై లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడా షేర్ల విలువ మూడు లక్షలయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి మూడు కోట్ల రూపాయలు అయ్యింది. నికరంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే లక్ష రూపాయల పెట్టుబడిపై రెండు లక్షల లాభం అందించింది అదానీ విల్మర్. గౌతమ్ అదానీతో పాటు అతని కంపెనీలను నమ్ముకున్న వారి సంపద కూడా పెరిగింది.
చదవండి: Gautam Adani: అమాంతం పెరిగిన సంపద..ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి 6వ స్థానం!
Comments
Please login to add a commentAdd a comment