Jack Sweeney Tracking Vladimir Putin and Russian Oligarchs - Sakshi
Sakshi News home page

'బాబూ పుతిన్‌..మనదగ్గర బేరాల్లేవమ్మా'

Published Mon, Mar 7 2022 4:08 PM | Last Updated on Mon, Mar 7 2022 7:59 PM

Jack Sweeney tracking Vladimir Putin and Russian oligarchs - Sakshi

బాబూ పుతిన్‌..మనదగ్గర బేరాల్లేవమ్మా అంటూ అమెరికాకు చెందిన జాక్​ స్వీన్​ 19 ఏళ్ల జాక్​ స్వీన్​ అనే స్టూడెంట్​ ఝలక్‌ ఇస్తున్నాడు. ఉక్రెయిన్‌ పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌తో పాటు రష్యన్ ఒలిగార్చ్స్ ను టార్గెట్‌ చేస్తున్నాడు.

 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో పాటు చట్టాల్ని చెప్పు చేతుల్లోకి తీసుకొని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్న ఒలిగార్చ్స్ అనే సంపన్న వర్గానికి చెందిన వారి రహస్యాల్ని బహిర్ఘతం చేస్తున్నాడు. వాళ్లు ఎప్పుడు ఏం చేస్తున్నారు. వారి ప్రైవేట్‌ జెట్‌లు ఎక్కడున్నాయనే విషయాల్ని బోట్‌ సాయంతో కనిపెడుతున్నాడు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాడు. 

అలా చేయడం వల్ల జాక్‌ స్వీన్‌కు లాభం లేకపోయినా.. రష్యా ఆదాయం తగ్గిపోవడంతో పాటు, భద్రతా కోణంలో వాళ్లకి జరిగే నష్టం ఎక్కువ. పైగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్‌ పై దాడి చేస్తుంది. ఈ సంక్షోభం సమయంలో ఉక్రెయిన్‌ ఇది బాగా లాభపడనుంది. అందుకే ఇప్పుడు జాక్​ స్వీన్ పుతిన్‌తో పాటు ఒలిగార్చ్స్ ను వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా జాక్‌ స్వీన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస‍్తోంది. అందుకోసం సామధాన భేద దండోపాయల్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.   

జాక్​ స్వీన్​ బాధితులెందరో! 
జాక్​ స్వీన్ జాబితాలో భాదితులు చాలా మందే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌, ఒలిగార్చ్స్, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిచ్, వ్యాపారవేత్త అలిషర్ ఉస్మానోవ్, మరియు రష్యన్ గ్యాస్ ఉత్పత్తిదారు నోవాటెక్, బిలియనీర్ ఛైర్మన్ లియోనిడ్ మిఖేల్సన్, ఎలన్‌ మస్క్‌లు ఉన్నారు.

చదవండి: పోయి పోయి వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement