నాసా సైంటిస్ట్‌ల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ శనివారంతో తన రెండు వారాల విస్తరణ దశను పూర్తి చేసింది. కాస్మిక్ చరిత్రలోని ప్రతి దశను అధ్యయనం చేయడానికి సిద్ధంగా ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చివరి మిర్రర్ ప్యానెల్‌ను ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా లాస్ట్ వింగ్ డిప్లాయ్ పూర్తి చేసింది అంటూ నాసా ట్వీట్ చేసింది.
అయితే ఈ ప్రయోగం సత్ఫలితాల్ని అందించడంతో నాసా కేంద్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా కాన్ఫిగరేషన్ సమయంలో తలెత్తిన సమస్యను నాసా సైంటిస్ట్‌లు చాకిచక్యంగా వ్యవహరించి..గండం నుంచి గట్టెక్కించడంపై ప్రముఖలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Congratulations, @NASAWebb! You are fully deployed! 🥳
— NASA (@NASA) January 8, 2022
Stay tuned over the coming months as the space telescope reaches its destination of Lagrange point 2 and prepares to #UnfoldTheUniverse: pic.twitter.com/qg6jmVRCsH
కాగా డిసెంబర్ 25 శనివారం నాసా ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం నిర్వహించిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్‌లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకునేలా భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల రోజుల సమయం పడుతుండగా, ఈ ప్రయోగం కీలక దశ విజయవంతమైందని నాసా ట్వీట్ చేసింది.
చదవండి: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతం..!విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా!
Comments
Please login to add a commentAdd a comment