వాషింగ్టన్: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన మొట్ట మొదటి చిత్రాన్ని విడుదల చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సమక్షంలో ఈ ఫోటోను సోమవారం ప్రపంచానికి చూపించారు. ఈ విశ్వంలో ఇప్పటివరకు తీసిన ఫోటోల్లో ఇదే అత్యంత అద్భుతమైనదని ఆయన పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇదో చారిత్రక క్షణమని చెప్పారు. ఖగోళశాస్త్రం, అంతరిక్ష అన్వేషణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, అమెరికాతో పాటు మానవాళికి ఇదో గొప్ప మైలురాయి అని బైడెన్ ట్వీట్ చేశారు.
The first image from the Webb Space Telescope represents a historic moment for science and technology. For astronomy and space exploration.
And for America and all humanity. pic.twitter.com/cI2UUQcQXj
— President Biden (@POTUS) July 11, 2022
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఈ తొలి ఫోటో విశ్వం పుట్టుకపై మానవుల దృక్కోణాన్ని మార్చేలా ఉంది. పాలపుంతల సమూహాం ఎంతో అందంగా, అత్యంత స్పష్టంగా కన్పిస్తోంది. విశ్వంలో ఇప్పటివరకు ఇంత లోతైన చిత్రాన్ని చిత్రీకరించడం ఇదే తొలిసారి.
ఈ టెలిస్కోప్ తీసిన మరిన్ని చిత్రాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వాటికి టీజర్‍గా తొలి చిత్రాన్ని బైడెన్ రివీల్ చేశారు. ఇదే ఇంత అద్భుతంగా ఉంటే.. మిగతా ఫోటోలు ఇంకెంత అందంగా ఉన్నయో అనే ఆసక్తి నెలకొంది.
చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే.. రేసులో రిషి సునక్ సహా 11 మంది!
Comments
Please login to add a commentAdd a comment