Jio Loses 1.9 Cr Wireless Subscribers In Sep Trai Data, Full Information In Telugu - Sakshi
Sakshi News home page

Reliance Jio: జియోకు భారీ షాకిచ్చిన యూజర్లు..!

Published Mon, Nov 22 2021 8:20 PM | Last Updated on Tue, Nov 23 2021 12:20 PM

Jio Loses 1 9 Cr Wireless Subscribers In Sep Trai Data - Sakshi

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోకు యూజర్లు భారీ షాక్‌ను ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గణనీయంగా వైర్‌లెస్‌ యూజర్లను జియో కోల్పోయింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన డేటా ప్రకారం...సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో దాదాపు 1.9 కోట్ల మంది చందాదారులను కోల్పోయింది. అదే సమయంలో 2.74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను భారతీ ఎయిర్‌టెల్ సొంతం చేసుకుంది.
చదవండి:  యాపిల్‌ ఉద్యోగుల శాలరీ ఎంతో తెలిస్తే షాకే..!

మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా సెప్టెంబర్‌ నెలలో 10.7 లక్షల మంది వీఐను వీడారు. గత పదకొండు నెలలనుంచి యూజర్లు వోడాఫోన్‌ ఐడియాను వీడుతూనే ఉన్నారు.  సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ 0.08 శాతం కొత్త యూజర్‌బేస్‌తో నిలవగా...జియో 4.29శాతం మేర క్షీణించింది. ఇకపోతే వైర్‌లెస్‌ సబ్‌స్రైబర్స్‌ మార్కెట్‌లో మొత్తంగా చూసుకుంటే ఆగస్టులో 1.18 బిలియన్ల నుంచి సెప్టెంబర్ చివరి నాటికి 1.16 బిలియన్లకు చందాదారుల సంఖ్య పడిపోయింది. 

భారతీ ఎయిర్‌టెల్ తన మొబైల్‌ ప్లాన్స్‌ ధరలను కనీసం 20 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎయిర్‌టెల్‌ కస్టమర్లు వేరే నెట్‌వర్క్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. 
చదవండి:  రిలయన్స్‌తో డీల్‌ క్యాన్సల్‌..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement