ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాలపై దృష్టి సారించింది తెలంగాణ సర్కారు. అందులో భాగంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇప్పటికే టీ హబ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ వచ్చిన స్పందన బాగుండటంతో వీహబ్, టీవర్క్స్ ఇలా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహకారం అందిస్తోంది. తాజాగా యంగ్ టాలెంట్ కోసం వై హబ్‌ను ప్రారంభించబోతున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
వరల్డ్ క్లాస్ కంపెనీలకు విద్యార్థి దశలో ఉన్న ఎంట్రప్యూనర్లకు సంధానకర్తగా ఈ వై హబ్ పని చేయనుంది. ఇప్పటికే ఉన్న టీ హబ్, టీ వర్క్స్ వంటివి కాలేజీ లెవల్, కాలేజీ చదువు పూర్తి చేసిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ స్టార్టప్‌ల నిర్మాణం జోరందుకుంది. దీంతో కొత్త ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు కింది స్థాయి నుంచే గట్టి పునాది వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
కొత్త రకం ఆవిష్కరణలను స్కూల్ స్థాయి నుంచే ప్రోత్సమించేందుకు వై హబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూత్‌తో పాటు స్కూల్ చిల్డ్రెన్స్‌లో ఇన్నోవేషన్, టెక్నాలజీపై ఆసక్తి కలిగేలా చేయడంతో పాటు వారిలో ఉన్న కొత్త రకం ఆలోచనలను ప్రోత్సహించడం వై హబ్ ప్రధాన లక్ష్యం. ఈ వై హబ్‌కి తెలంగాణ ప్రభుత్వంతో పాటు యూనిసెఫ్ సైతం తన వంతు సహకారం అందివ్వనుంది.
After Telangana Govt’s @THubHyd @WEHubHyderabad and @TWorksHyd now @teamTSIC is geared up to launch Y-Hub 👍
— KTR (@KTRTRS) April 5, 2022
We need to catch our innovators at a young age and nurture them to be able entrepreneurs
Telangana believes in the power of Innovation & inclusive growth pic.twitter.com/jftRBtbewD
Comments
Please login to add a commentAdd a comment