2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయి కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతోంది. ఆదాయపు పన్ను కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2023 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను కొత్త నియమాలను ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: ట్యాక్స్ ప్లానింగ్‌లో చేసే పొరపాట్లు ఇవే.. తెలుసుకుంటే పన్ను ఆదా పక్కా!
- కొత్త పన్ను విధానంలో టీడీఎస్‌ను ప్రభుత్వం తగ్గించింది. దీంతో చాలామంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
- పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువ ఉండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు ఎటువంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద వారికి అదనపు మినహాయింపు ఉంటుంది.
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193 కింద డీమెటీరియలైజ్డ్ రూపంలో లిస్టెడ్ డిబెంచర్లకు టీడీఎస్ కోతలు ఉండవు. అయితే అన్ని ఇతర చెల్లింపులపై 10 శాతం టీడీఎస్ రూపంలో కోత ఉంటుంది.
- ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా డబ్బు గెలుచుకున్న వారు ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టీడీఎస్ రూపంలో కట్ చేస్తారు.
- ఐటీ చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతాయి. రూ. 10 కోట్ల వరకు మూలధన లాభాలకు మాత్రమే ఈ సెక్షన్ల కింద మినహాయింపు ఉంటుంది. అంతకు మించిన మూలధన లాభాలపై 20 శాతం పన్ను విధిస్తారు.
- 2023 ఏప్రిల్ 1 నుంచి ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 24 కింద క్లెయిమ్ చేసే వడ్డీని కొనుగోలు లేదా మరమ్మతు ఖర్చులో చేర్చేందుకు వీలు లేదు.
- మార్కెట్ లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ నుంచి వచ్చే మూలధన లాభాలపై ఇప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది.
- 2023 ఏప్రిల్ నుంచి ఈ-గోల్డ్ రిసీప్ట్‌గా మార్చుకున్న ఫిజికల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్‌గా ఈ-గోల్డ్ రిసీప్ట్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. అయితే ఈ మార్పిడి సెబీ రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ ద్వారా జరిగి ఉండాలి.
ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
Comments
Please login to add a commentAdd a comment