ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అమెరికా వీసా, సిటిజన్ షిప్ కోసం ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు విఫలమై భారీ మొత్తంలో ఖర్చు పెట్టీ మరి వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయినప్పటికీ ఫెయిల్ అవుతున్నారు. ఈ తరుణంలో భారత్‌లో నవీ ముంబైకి చెందిన మంగేష్ ఘోగ్రే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐన్‌స్టీన్ వీసాను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటీ? ఈ వీసాను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
2004లో ఎంబీఏ పూర్తి చేసిన భారతీయ సంతతికి చెందిన మంగేష్ ఘోగ్రే నవీ ముంబై కేంద్రంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేసేవారు. తాజాగా, మంగేష్ ఈ ఐన్‌స్టీన్ వీసాను దక్కించుకున్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తూనే క్రాస్ వర్డ్‌లను (ఫజిల్)పూరించడంలో ప్రావిణ్యం సంపాదించారు. మంగేష్ ఘోగ్రే రూపొందించిన ఫజిల్స్ అంతర్జాతీయ మీడియా సంస్థలైన న్యూయార్క్ టైమ్స్, ది వాషింస్టన్ పోస్ట్, ది వాల్ స్ట్రీట్ జర్నల్స్‌లు ప్రచురితమయ్యాయి. ఇటీవల, అమెరికన్ రైటర్ బ్రెండన్ ఎమ్మెట్ క్విగ్లీతో కలిసి న్యూయార్క్ టైమ్స్‌లో క్రాస్‌వర్డ్ రూపొందించారు. తాజ్ మహల్ ఫజిల్‌లో క్రియేట్ చేయడంతో హైలెట్‌గా నిలిచారు. దీనిని స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత రోజు అంటే ఆగస్ట్ 16,2016న న్యూయార్క్ టైమ్స్ దీనిని ప్రచురించింది.
అందుకే ఆ ఘనత
న్యూయార్క్ టైమ్స్ క్రాస్‌వర్డ్ కాలమ్‌లో భారతీయుడు కనిపించడం చాలా అరుదు. దాన్ని ఇప్పుడు ఘోగ్రే అధిగమించాడు. మహాత్మా గాంధీ, భారతీయ చిహ్నాలకు నివాళులర్పించే పజిల్స్‌ను సృష్టించారు. ఫలితంగా ఈ ఐన్‌స్టీన్ వీసాను దక్కించుకున్నాడు.
ఐన్ స్టీన్ వీసా అంటే?
ఐన్‌స్టీన్‌ను ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ (ఈబీ-1) వీసా అని అంటారు. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ పోర్టల్ ఈబీ-1 వీసా వివరాల ప్రకారం.. సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెట్ వంటి రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులై ఉండాలి. ఐన్ స్టీన్ ఈ వీసాతో అమెరికాలో అడుగు పెట్టారు. అందుకే దీన్ని ఐన్ స్టీన్ వీసా అంటారు.
చదవండి👉 చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు?
Comments
Please login to add a commentAdd a comment