
ముంబై: రికార్డుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి నష్టాల నుంచి బయటపడి ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 53 పాయింట్లు పుంజుకుని 44,006కు చేరగా.. నిఫ్టీ 17 పాయింట్లు బలపడి 12,891 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,030- 43,816 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నిఫ్టీ సైతం 12,897- 12,836 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా కోవిడ్-19 కేసులు పెరిగిపోతుండటంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. మళ్లీ లాక్‌డవున్‌లు విధించవచ్చన్న భయాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు)
బ్లూచిప్స్ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా 0.3 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, సిప్లా 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే బీపీసీఎల్, బ్రిటానియా, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, టైటన్, సన్ ఫార్మా, ఐషర్, ఎయిర్‌టెల్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?)
డెరివేటివ్స్‌లో
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఆర్‌బీఎల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎంజీఎల్, మదర్‌సన్, సీమెన్స్, బాలకృష్ణ 3-1.3 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. ఐసీఐసీఐ లంబార్డ్, పీవీఆర్, ఐబీ హౌసింగ్, ఐడియా, హెచ్‌పీసీఎల్, టొరంట్ ఫార్మా 2-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1023 లాభపడగా.. 615 నష్టాలతో కదులుతున్నాయి.
ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం మార్కెట్లకు సెలవుకాగా.. శనివారం ఎఫ్‌పీఐలు రూ. 78.5 కోట్లు, డీఐఐలు రూ. 20.3 కోట్లు కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. కాగా.. ఈ నెల 2-13 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 29,436 కోట్లను ఇన్వెస్ట్ చేయడం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment