దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు సామాన్యుడికి మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. రోజుల వ్యవధిలో పాల ఉత్పత్తి సంస్థలు పాల ధరల్ని పెంచడంలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాల ధరలను రూ.2పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించగా.. తాజాగా దేశవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్న మదర్ డెయిరీ సైతం పాల ధరను ఢిల్లీలో రూ.2 పెంచుత్నుట్లు ప్రకటించింది.
పెరిగిపోతున్న రవాణాతో పాటు ఇతర ఖర్చుల కారణంగా పాల ధరల్ని పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. పెరిగిన ఈ కొత్త ధర ఢిల్లీలో ఆదివారం (రేపే) నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మదర్ డెయిరీ లీటర్ పాల ధర ఢిల్లీలో రూ.57 ఉండగా రేపటి నుంచి రూ.59కి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
►టోన్డ్ మిల్క్ ధరలు రూ.49కి పెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.43కి పెరుగుతుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.49 నుండి రూ.51కి పెరిగింది .
►బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ.44 నుంచి రూ.46 కి పెంచబడింది .
►హర్యానా, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో కూడా పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచింది.
►ఈ ఎంపిక చేసిన ప్రాంతాలకు మించిన మార్కెట్లు దశలవారీగా సవరించబడతాయి.
చదవండి: భారీగా పెరిగిన అమూల్ పాల ధర.. రేపటి నుంచే కొత్త రేటు
Comments
Please login to add a commentAdd a comment