Milk prices
-
దేశంలో పెరిగిన పాల ధర
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్‌కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది. 30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సకాలంలో టీకాలు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది. -
సామాన్యులకు మరో షాక్, పెరిగిన పాలధర..నిన్న అమూల్, నేడు మరో కంపెనీ!!
దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు సామాన్యుడికి మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. రోజుల వ్యవధిలో పాల ఉత్పత్తి సంస్థలు పాల ధరల్ని పెంచడంలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాల ధరలను రూ.2పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించగా.. తాజాగా దేశవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్న మదర్ డెయిరీ సైతం పాల ధరను ఢిల్లీలో రూ.2 పెంచుత్నుట్లు ప్రకటించింది. పెరిగిపోతున్న రవాణాతో పాటు ఇతర ఖర్చుల కారణంగా పాల ధరల్ని పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. పెరిగిన ఈ కొత్త ధర ఢిల్లీలో ఆదివారం (రేపే) నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మదర్ డెయిరీ లీటర్ పాల ధర ఢిల్లీలో రూ.57 ఉండగా రేపటి నుంచి రూ.59కి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ►టోన్డ్ మిల్క్ ధరలు రూ.49కి పెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.43కి పెరుగుతుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.49 నుండి రూ.51కి పెరిగింది . ►బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ.44 నుంచి రూ.46 కి పెంచబడింది . ►హర్యానా, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో కూడా పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచింది. ►ఈ ఎంపిక చేసిన ప్రాంతాలకు మించిన మార్కెట్లు దశలవారీగా సవరించబడతాయి. చదవండి: భారీగా పెరిగిన అమూల్ పాల ధర.. రేపటి నుంచే కొత్త రేటు -
సామాన్యుడిపై మరోభారం!
హైదరాబాద్: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలతో నానా ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడనుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకు తున్నాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత సుమారు రూ.200 వరకు గ్యాస్ ధర పెరిగినట్టు అంచనా. ఇప్పటికే వీటి విషయంపై మండిపోతున్న ప్రజలు వారి ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా పాల ధరలు పెరగనున్నాయి అని సమాచారం. ప్రస్తుతం పాల ధర బహిరంగ మార్కెట్ లో లీటరు రూ.60గా ఉంది. పదకొండు రోజుల నుంచి డీజిల్ రేట్లు ఏకధాటిగా పెరగడంతో రవాణా ఛార్జీలు కూడా పెరుగడంతో ఆ భారం వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి అని పాల ఉత్పత్తి దారులు తెలియజేస్తున్నారు. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా పశువుల దాణా కోసం, సేకరించిన పాలను విక్రయించడాయినికి అయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నట్లు పాల ఉత్పత్తి దారులు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పెరిగిన ధరలను ప్రజలపై వేయక తప్పదని ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. పెరిగే పాల ధర కనీసం లీటర్ మీద రూ.2 వరకు పెరగొచ్చని ప్రతినిధి చెప్పారు. భవిష్యత్ లో ఇదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే పాల ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: జీఎస్టీపై కేంద్రం కీలక నిర్ణయం? బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
పాల ధరలు తగ్గించినా హెరిటేజ్ లాభం పెరిగింది!
♦ క్యూ2లో రూ. 26 కోట్ల నికర లాభం ♦ విదేశీ విస్తరణపై కంపెనీ దృష్టి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : తొలి త్రైమాసిక ఫలితాల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. గత త్రైమాసికంలో పాల ధరలు గణనీయంగా తగ్గడంతో లాభాలు తగ్గుతాయన్న మార్కెట్ వర్గాల అంచనాలను తల్లకిందులు చేస్తూ డెయిరీ వ్యాపార నికర లాభంలో 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో రూ. 23 కోట్లుగా (డెయిరీ విభాగం) ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 26 కోట్లకు చేరింది. ఇదే సమయంలో డెయిరీ అమ్మకాలు రూ. 404 కోట్ల నుంచి రూ. 437 కోట్లకు చేరుకున్నాయి. ఒక పక్క పాల సేకరణ వ్యయం తగ్గకుండా రిటైల్ మార్కెట్లో ధరలు తగ్గించినా సంస్థకు లాభాలు మాత్రం పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. హెరిటేజ్ సంస్థ ఇతర కంపెనీల పోటీకి తలొగ్గి గత మూడు నెలల కాలంలో పాల విక్రయ ధరను లీటరుకు దాదాపు 15 శాతం తగ్గించింది. దీంతో ఇదే కాలంలో పాలసేకరణతో సహా ఇతర ముడి పదార్థాల వ్యయం(కన్సాలిడేటెడ్) రూ.343 కోట్ల నుంచి రూ. 350 కోట్లకు పెరిగింది. ఒకవైపు వ్యయం పెరిగి, మరోవైపు ధర తగ్గించినా లాభం మాత్రం పెరగటం విశేషమే. అన్ని వ్యాపారాలు తీసుకుంటే తొలి త్రైమాసికంలో రూ. 578 కోట్ల ఆదాయంపై సంస్థ రూ.11 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. గడిచిన ఏడాది నాల్గవ త్రైమాసికంలో రూ.544 కోట్ల ఆదాయంపై రూ. 13 కోట్ల నికరలాభం రావటం గమనార్హం. గతేడాది ఇదే కాలానికి రూ. 5 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 5 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 506 కోట్ల నుంచి రూ. 578 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్‌పై దృష్టి: విదేశీ మార్కెట్లో అవకాశాల కోసం యూరోప్‌నకు చెందిన ఒక అతిపెద్ద డెయిరీ ప్రోడక్టుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇండియాతో పాటు విదేశాల్లో డెయిరీ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించి ఒక భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్‌ను నియమించింది. -
పోటాపోటీగా... తగ్గిస్తున్నారు!
పాల కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ - తగ్గింపు ధరలు, డిస్కౌంట్ ఆఫర్లు... - ‘నందిని’ రాకతో ముదిరిన పోరు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బ్రాండ్ల ప్రవేశంతో పాల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా పాల వినియోగం పెరుగుతూ వస్తున్నా... పోటీ కారణంగా కంపెనీలు డిస్కౌంట్ల బాట పడుతున్నాయి. సహకార దిగ్గజం అమూల్ ఇక్కడి మార్కెట్లోకి అడుగుపెట్టడంతో ఆరంభమైన ఈ పోటీ... మరో సహకార బ్రాండ్ ‘నందిని’ రావటం... ఇటీవలే ఆ సంస్థ తన పాల ధరను మరింత తగ్గించటంతో తీవ్రమైంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పాల కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి డిస్కౌంట్లు, ఆఫర్లతో రంగంలోకి దిగుతున్నాయి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ గోవర్దన్ బ్రాండ్ పాలను రూ.40కి విక్రయిస్తోంది. ఒక లీటరు పాలను కొన్న కస్టమర్‌కు రూ.12 విలువ చేసే 200 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ను ఇటీవలి వరకు ఉచితంగా ఇచ్చింది. మదర్ డెయిరీ ... లిమిటెడ్ ఆఫర్ కింద లీటరు ప్యాక్‌ను రూ.33కే విక్రయిస్తోంది. జూలై 22 వరకూ ఈ ఆఫర్ ఉంది. కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) నందిని స్పెషల్ పేరుతో 3.5 శాతం వెన్న కలిగిన పాలను లీటరుకు రూ.34కే అందిస్తోంది. నిజానికి ఈ స్థాయిలో వెన్న ఉన్న పాలను ప్రైవేటు కంపెనీలు రూ.42-44 మధ్య విక్రయిస్తున్నాయని కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడే ధర ఎక్కువ... హైదరాబాద్ మార్కెట్లో ప్రయివేటు పాల కంపెనీల ధరలు మరీ ఎక్కువగా ఉన్నట్లు కేఎంఎఫ్ చెబుతోంది. ఇక్కడ దాదాపు 20 బ్రాండ్ల వరకూ ఉన్నా... ధర మాత్రం దేశంలో ఎక్కడా లేనంతగా లీటరుకు రూ.6-10 వరకూ అధికంగా ఉన్నట్లు అమూల్ బ్రాండ్‌తో పాలను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వెల్లడించింది. పంపిణీ వ్యవస్థ అసమర్థత, దళారుల వల్లే పరిస్థితి ఇలా ఉందని సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి ఇటీవల చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కేఎంఎఫ్ మాత్రమే పాల రైతులకు అత్యధికంగా లీటరుకు రూ.27 చెల్లించి సేకరిస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు రైతులకు రూ.19 కూడా చెల్లిస్తున్నాయని సంస్థ ఎండీ ఎస్.ఎన్.జయరామ్ ఇటీవల చెప్పారు. ‘దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారు. కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే జరుగుతోంది’ అన్నారాయన. కేఎంఎఫ్ కర్ణాటకలో లీటరు ప్యాకెట్‌ను రూ.29కే విక్రయిస్తోంది. రవాణా తదితర చార్జీలుంటాయి కనక హైదరాబాద్‌లో రూ.34కు విక్రయిస్తున్నట్లు జయరామ్ తెలిపారు. అమూల్‌తో మొదలు... హైదరాబాద్‌లో రోజుకు 17 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలు అమ్ముడవుతున్నాయి. అమూల్ రాక ముందు వరకు ప్రభుత్వ రంగ సంస్థ విజయ మాత్రమే అతి తక్కువగా లీటరు పాలను రూ.38కి విక్రయించేది. ప్రైవేటు కంపెనీలు రూ.44 వరకు అమ్మేవి. విజయ బ్రాండ్‌ను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో అమూల్ కూడా లీటరు ధరను రూ.38గానే నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో అమూల్ రావటంతో అప్పటికే పాగావేసిన కంపెనీలకు ఏం చేయాలో పాలుపోలేదు. అన్ని ప్రైవేటు కంపెనీలు పాల ధరను తగ్గించాల్సి వచ్చింది. ఇక నందిని బ్రాండ్ రాకతో వీటికి షాక్ కొట్టినట్టయింది. 2015 మేలో రూ.36 ధరతో రంగంలోకి దిగిన నందిని... ఇటీవల రూ.34 ధరతో స్పెషల్ టోన్డ్ పాలను మార్కెట్లోకి తెచ్చింది. మిగతా కంపెనీలు ఏ మేరకు తగ్గిస్తాయో చూడాల్సిందే. -
పాల ప్యాకెట్లో ధరల పోరు!
రూ. 36కే లీటరంటూ హైదరాబాద్‌లోకి ‘నందిని’ ⇒ ఇది... కర్ణాటక పాల రైతుల సమాఖ్య సొంత బ్రాండ్ ⇒ రెండేళ్లలో రూ.2,000 కోట్లతో విస్తరించడానికి సన్నాహాలు ⇒ ఇటీవలే అమూల్ దెబ్బకు ధరలు తగ్గించిన ప్రైవేటు డెయిరీలు ⇒ తాజా పరిణామంతో మరింత తగ్గడానికీ చాన్స్! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో పాల ధరల యుద్ధం పదునెక్కుతోంది. గుజరాత్ సహకార దిగ్గజం అమూల్ ప్రవేశంతో ప్రైవేటు డెయిరీలు ధరలు తగ్గించి రెండుమూడు నెలలు కూడా గడవకముందే కర్ణాటక సహకార దిగ్గజం ‘నందిని’ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. లీటరు పాలు రూ.36కే విక్రయిస్తున్నట్లు ప్రకటించి... ధరల యుద్ధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. హైదరాబాద్ తమకు ఆరంభమేనని, తెలుగు రాష్ట్రాలు రెండింటా పూర్తి స్థాయిలో విస్తరిస్తామని చెప్పిన కర్ణాటక సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (కేఎంఎఫ్) ఎండీ ఎస్.ఎన్.జయరామన్... గురువారమిక్కడ కంపెనీ ఉత్పత్తుల్ని ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఎంఎఫ్ చైర్మన్ పి.నాగరాజుతో కలసి మీడియాతో మాట్లాడారు. లక్ష లీటర్లు లక్ష్యంగా...: ప్రస్తుతం తాము హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లో రోజుకు 35 వేల లీటర్ల తాజా పాలు సరఫరా చేయగలుగుతామని జయరామ్ చెప్పారు. ‘కొద్ది రోజుల్లో దీన్ని లక్ష లీటర్లకు పెంచుతాం. కర్నాటకలోని బెల్గాం, బీజాపూర్ నుంచి పాలు సేకరించి హైదరాబాద్ సమీపంలోని థర్డ్ పార్టీకి చెందిన ప్రాసెసింగ్ కేంద్రానికి తరలిస్తున్నాం. డిమాండ్ పెరిగితే స్థానికంగా పాల సేకరణ చేపట్టడంతో పాటు సొంత ప్రాసెసింగ్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలకు విస్తరిస్తాం’ అని తెలిపారు. సేకరణ వ్యవస్థ వైఫల్యంతోనే...: వ్యవస్థీకృత విధానంలో పాల సేకరణ జరుగుతున్నది కేవలం గుజరాత్, కర్ణాటకలోనేనని కేఎంఎఫ్ ఎండీ చెప్పారు. పాడి రైతుకు దేశంలో ఎక్కడా లేనంతగా తమ సంస్థ లీటరుకు రూ.27 చెల్లిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లీటరుకు రూ.19 చెల్లిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. దళారీ వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోతున్నారని, కస్టమర్లు అధిక ధర చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. వ్యవస్థీకృత సేకరణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోందని వివరించారు. క్లిక్ చేస్తే ఇంటికే పాలు.. ఈ-కామర్స్ కంపెనీ బిగ్ బాస్కెట్ ఇప్పటికే నందిని ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయిస్తోంది. ‘‘మేం ఈ వారంలో మొబైల్ యాప్‌ను తెస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ నుంచి కస్టమర్లు తాజా పాలను కూడా ఆర్డరు చేయొచ్చు. ప్రస్తుతానికి బెంగళూరు వాసులకు మాత్రమే ఈ సౌకర్యం. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరిస్తాం. కేఎంఎఫ్ 20% వృద్ధితో 2015-16లో రూ.12,720 కోట్ల టర్నోవర్‌ను అంచనా వేస్తోంది. పాల సేకరణ సామర్థ్యం జూన్ నాటికి రోజుకు 64 లక్షల నుంచి 70 లక్షల లీటర్లకు చేరుకుంటుందని భావిస్తున్నాం’’ అని జయరామ్ తెలియజేశారు. మౌలిక వసతుల కోసం వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్లు వ్యయం చేస్తున్నట్టు వెల్లడించారు. అమూల్ రాకతో... రెండుమూడు నెలల కిందట అమూల్ ప్రవేశించేంత వరకూ రాష్ట్రంలో ఒక్క ‘విజయ’ బ్రాండ్ తప్ప మిగిలిన పాల ధరలు ఎక్కువగానే ఉండేవి. విజయ కూడా సహకార సమాఖ్యే కనక దాన్ని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదని, అందుకే తాము కూడా విజయ మాదిరే రూ.38 ధరనే నిర్ణయించామని అప్పట్లో అమూల్ ఎండీ ఆర్.ఎస్.సోధి చెప్పారు కూడా. అయితే అమూల్ రాకతో హెరిటేజ్ వంటి ప్రయివేటు డెయిరీ పాలను అధిక ధర పెట్టి కొంటున్న వారు అటువైపు మళ్లారు. ఇంతలో నల్గొండ జిల్లా సహకార సమాఖ్య నార్ముక్ కూడా నార్ముక్ బ్రాండ్‌తో లీటరు రూ.38కే ఇస్తూ మార్కెట్లోకి ప్రవేశించింది. చివరికి విధి లేక హెరిటేజ్ కూడా తన పాల ధరను రూ.40కి తగ్గించింది. తాజాగా ‘నందిని’ రాకతో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారిం ది. నందిని ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు రూ.50, డబుల్ టోన్డ్ పాలు 300 మిల్లీలీటర్లు రూ.10, పెరుగు 200 గ్రాముల ప్యాక్ రూ.10 చొప్పున విక్రయిస్తోంది. -
పాల మోత
ప్రభుత్వం (ఆవిన్), ప్రయివేటు సంస్థలు పోటీ పడి పాల ధరను పెంచేస్తున్నాయి. ప్రయివేటు పాల కంపెనీలు లీటరుపై రూ.2 నుంచి రూ.4వరకు ధర ను పెంచాయి. పెరిగిన ధరలను సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఆవిన్ పాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇది కాక తిరుమల, హెరిటేజ్, టోడ్లా, జెర్సీ వంటి ప్రయివేటు కంపెనీలు సైతం ప్యాకెట్ పాలను, పాల ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. ఆవిన్ పాలధరను లీటరుకు రూ.24 నుంచి రూ.34కు ఇటీవలే ప్రభుత్వం పెంచింది. పాల సేకరణ ధరను పెంచడం వల్ల అమ్మకం రేట్లను పెంచక తప్పలేదని ప్రభుత్వం సర్ది చెప్పుకుంది. ప్రజలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తినా లెక్కచేయక ఈ నెల 1వ తేదీ నుంచి పెంచిన ధరలను అమల్లోకి తెచ్చింది. దీంతో ప్రయివేటు సంస్థలు రూ.4 వరకు పెంచడానికి సిద్ధమయ్యాయి. తిరుమల, హెరిటేజ్ సంస్థలు ఫుల్‌క్రీం పాల ధర రూ.48 నుంచి రూ.52కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారుు. మరో రకం పాలపై ప్రభుత్వంతో పాటూ పెంచిన ప్రయివేటు కంపెనీలవారు తాజాగా మరోసారి పెంచారు. ఈ నెల మొదటి వారంలో పాలు లీటరుపై రూ.36 నుంచి రూ.40కు పెంచి నేడు మళ్లీ రూ.40 నుంచి రూ.44 పెంచారు. టోడ్లా, జెర్సీ సంస్థలు లీటరుపై రూ.2 మాత్రమే పెంచాయి. ఆరోగ్యపాల సంస్థ ఈనెల 6న రూ.4 పెంచింది. ప్రయివేటు పాల ధర పెంపు ప్రభావం పెరుగుపై కూడా పడింది. 100, 120 ఎమ్ఎల్ పెరుగు కప్ ధర రూ.10 నుంచి రూ.12, రూ.12 నుంచి రూ.14గా పెరిగింది. 200, 400ఎమ్ఎల్ పెరుగు కప్పుల ధర రూ.15 నుంచి రూ.18, రూ.32 నుంచి రూ.35గా పెరిగింది. అంటే కప్పు పెరుగుపై రూ.3 భారం పడింది. ప్రయివేటు పాల ఉత్పత్తి దారులు ఈ ఏడాది ఐదు సార్లు పాలధరను పెంచడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ప్రయివేటు కంపెనీలు లీటరుపై రూ.12 పెంచేశాయి. -
పాలపై రూ.10 భారం
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆవిన్ పాల ధరపై ప్రభుత్వం రూ.10 అదనపు భారం మోపింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి లీటరు రూ.34 లెక్కన అమ్మనున్నట్లు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పాల సేకరణ ధరను కూడా పెంచాలని పాల ఉత్పత్తిదారుల సమాఖ్య కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దీంతో సేకరణ ధరపై రూ.5 పెంచి, అమ్మకంపై రూ.10 పెంచుతూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ వ్యవసాయదారులకు పాల ఉత్పత్తి ప్రధాన ఆదాయవనరుగా ఉందని చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వం ఈ వాస్తవాన్ని విస్మరించి ఆవిన్ సంస్థను ఆర్థిక ఊబిలోకి నెట్టివేసిందని విమర్శించారు. రైతుల నుంచి సేకరించిన పాలకు 45 రోజుల తరువాత కూడా చెల్లింపులు ఇవ్వలేని దుర్భర స్థితికి ఆవిన్ సంస్థ చేరుకుందన్నారు. ఆవిన్ సంస్థ సైతం పాల సేకరణను కుదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ.17 కోట్ల చొప్పున ఆరు నెలల పాటు ఆర్థిక సహకారం అందించారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందిన రూ.192 కోట్ల ఆవిన్ ఆర్థికంగా బలపడిందన్నారు. ఆవిన్ బాగుపడింది, రైతులను కూడా ఆదుకోండనే విజ్ఞప్తులను స్వీకరించినట్లు సీఎం చెప్పారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరి 1 నుంచి సేకరణ ధరను లీటరుకు రూ.3 పెంచినట్లు చెప్పారు. అయితే ఆనాడు సేకరణ ధరను పెంచినా అమ్మకం ధర పెంచలేదని గుర్తు చేశారు. పశువుల, దాణా ధరలు పెరగడం, పాడిరైతుల పెంపకంలో రైతుల ఖర్చులు ఆకాశాన్ని అంటడంతో సేకరణ ధరను మరోసారి పెంచామని తెలిపారు. ఆవుపాలు సేకరణ ధర లీటరుకు రూ.23 నుంచి 28, గేదెపాలు లీటరుకు రూ.31 నుంచి 35కు పెంచుతూ నిర్ణయించినట్లు చెప్పారు. అంటే ఆవుపాలు సేకరణపై రూ.5, గేదెపాలు సేకరణపై రూ.4 పెంచినట్లు తెలిపారు. సేకరణ ధర పెంచిన భారాన్ని తట్టుకునేందుకు ఆవిన్ పాల అమ్మకంలో సైతం లీటరుకు రూ.24 నుంచి రూ.34కు పెంచక తప్పలేదని సీఎం చెప్పారు. కరుణ ఖండన ఏ ప్రభుత్వ చరిత్రలోనూ పాల ధరపై ఒకేసారి రూ.10 భారం మోపడం జరగలేదని డీఎంకే అధినేత కరుణానిధి విమర్శించారు. ఆవిన్ పాల అమ్మకాల్లో సాగిన కోట్లాది రూపాయల కుంభకోణం ఇటీవల బట్టబయలైందని, ఈ లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై భారం మోపారని ఆయన దుయ్యబట్టారు. పెంచిన పాల అమ్మకాల ధరను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.