ముంబై: ఎలక్ట్రిక్ మార్కెట్లో రోజు రోజుకి వేడెక్కిపోతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈవీ తయారీ కంపెనీల పాలిట వరంలా మారింది. మార్కెట్లోకి కొత్త కొత్త కంపెనీలు దూసుకొస్తున్నాయి. ముంబైకి చెందిన స్టార్టప్ ఎర్త్ ఎనర్జీ ఈవీ డిమాండ్ పెరగడంతో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా వంటి 10 రాష్ట్రాల్లో పంపిణీదారులను నియమించినట్లు తెలిపింది. ఏడాదికి 37,000 మంది వారి వాహనాల కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. 2017లో ప్రారంభమైన ఈ స్టార్టప్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలు, అటానమస్ వేహికల్ తయారీపై దృష్టి సారిస్తుంది.
ముంబైలో 20,000 చదరపు అడుగుల గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇంకా అదనంగా 20,000 చదరపు అడుగులకు విస్తరించవచ్చు. మహారాష్ట్రలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46,000 యూనిట్లు అని కంపెనీ ప్రకటన తెలిపింది. ఎర్త్ ఎనర్జీ సీఈఓ, ఫౌండర్ రుషి సెంఘానీ మాట్లాడుతూ.. "ఎర్త్ ఎనర్జీ ఈవి ఆశయం ఏమిటంటే, కేవలం వాహనాలను మాత్రమే తయారు చేయడమే కాకుండా దేశంలోని ఈవీ తయారీ మౌలిక సదుపాయాలు & సామర్థ్యాలను అభివృద్ధి చేస్తాము" అని అన్నారు. కంపెనీ తన స్థానిక వెండర్లు, సప్లై ఛైయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కూడా ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఎర్త్ ఎనర్జీ వాహనాలు ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న అన్ని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కంపెనీ మూడు ఎలక్ట్రిక్ వాహనలను మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. ఇందులో రెండు బైక్స్, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment