Paytm RRR Movie Voucher: Win RRR Movie Voucher Up to Rs 150 Free - Sakshi
Sakshi News home page

ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు లక్కీ ఛాన్స్.. రూ.1కే సినిమా టికెట్!

Published Wed, Mar 16 2022 5:03 PM | Last Updated on Wed, Mar 16 2022 6:13 PM

Paytm: Win RRR Movie Voucher up to Rs 150 FREE - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

ఈ నేపథ్యంలో పేటీఎమ్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. రూ.1కే ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు అని పేటీఎమ్ తన ట్విటర్ వేదికగా తెలిపింది. ఇందుకోసం ప్రేక్షకులు, అభిమానులు పేటీఎమ్ యాప్ ద్వారా పేటీఎమ్ జెనీ మొబైల్ నంబర్‌‌కి ₹1 పంపిస్తే ₹150 వరకు విలువైన ఆర్ఆర్ఆర్ మూవీ వోచర్ పొందవచ్చు. ఇంకా, మరో విషయం ఏమిటంటే మీరు పేటీఎమ్ జెనీకి పంపిన ₹1ని కూడా తిరిగి మీ ఖాతాలో రీఫండ్ చేయనున్నట్లు తెలిపింది. అంటే, ఉచితంగా ఈ ఆర్ఆర్ఆర్ మూవీ టికెట్ పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

(చదవండి: దిగొస్తున్న బంగారం ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement