హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ దిగ్గజం పెన్నార్ గ్రూప్ తాజాగా రూ.511 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. పెన్నార్ అనుబంధ విభాగాలు రిలయన్స్, ఎంఎస్‌ఎన్ ల్యాబొరేటరీస్, యమహా, కోనే, ఐఎఫ్‌బీ, హిందాల్కో, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి వీటిని పొందినట్టు కంపెనీ కార్పొరేట్ స్ట్రాటజీ, ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం.సునీల్ తెలిపారు. జూలై, ఆగస్ట్‌లో ఈ ఆర్డర్లను చేజిక్కించుకున్నామని, వచ్చే రెండు త్రైమాసికాల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్పారు.
చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
Comments
Please login to add a commentAdd a comment