Engineering works
-
ఆజాద్ ఇంజనీరింగ్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఆజాద్ ఇంజనీరింగ్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ కోసం హైదరాబాద్ సమీపంలోని తునికిబొల్లారం వద్ద రూ.165 కోట్లతో ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా స్థాపిస్తోంది. 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2024 మధ్యకాలంలో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
మౌలికవసతుల కల్పనలో రికార్డు వ్యయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) ఇంజనీరింగ్ పనుల్లో రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చేయని విధంగా 2021–22లో ఈ పనుల కోసం రూ.348.71 కోట్లు వ్యయం చేసింది. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చుచేస్తే అందులో టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.1,021 కోట్లు ఖర్చుచేశారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ సర్కారు మూడేళ్లలో రూ.1,058 కోట్లు ఖర్చుచేశారు. అంతేకాక.. ఈ సమయంలో మొత్తం 51 పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు కల్పించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కృషిచేస్తున్నామని, అందులో భాగంగా ఇంజనీరింగ్ పనులపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌వల్ల రెండేళ్లుగా అనుకున్న లక్ష్యాలను పూర్తిగా చేరుకోలేకపోయామని, ఈ ఏడాది గతేడాది కంటే అత్యధికంగా వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కృష్ణపట్నం వద్ద చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా క్రిస్‌సిటీ పేరుతో 2,500 ఎకరాల్లో రూ.1,500 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ‘రెడీ టు బిల్డ్’పై ప్రత్యేక దృష్టి ఇక తక్షణంఉత్పత్తి ప్రారంభించేలా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఐఐసీ వీటి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు గోవిందరెడ్డి తెలిపారు. కొప్పర్తి, తిరుపతి, పెద్దాపురం, విజయవాడ వంటి చోట్ల 20కిపైగా రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నామని, వీటివల్ల 4.80 లక్షల చదరపు అడుగులు అందుబాటులోకి వస్తోందన్నారు. కేవలం మౌలిక వసతుల కల్పనలోనే కాకుండా ఆదాయ ఆర్జనలో కూడా ఏపీఐఐసీ రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన ఏడేళ్లుగా చూస్తే ఏపీఐఐసీ సగటు వార్షిక ఆదాయం రూ.590 కోట్లుగా ఉంటే 2021–22లో రూ.656 కోట్లు ఆర్జించినట్లు తెలిపారు. 50 ఏళ్ల క్రితం రూ.20 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఏపీఐఐసీ ఇప్పుడు రూ.వేల కోట్ల ప్రాజెక్టులను చేపడుతోందని.. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని ప్రాజెక్టులను అభివృద్ధిచేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు. -
పెన్నార్‌కు రూ.511 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ దిగ్గజం పెన్నార్ గ్రూప్ తాజాగా రూ.511 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. పెన్నార్ అనుబంధ విభాగాలు రిలయన్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, యమహా, కోనే, ఐఎఫ్బీ, హిందాల్కో, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి వీటిని పొందినట్టు కంపెనీ కార్పొరేట్ స్ట్రాటజీ, ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం.సునీల్ తెలిపారు. జూలై, ఆగస్ట్‌లో ఈ ఆర్డర్లను చేజిక్కించుకున్నామని, వచ్చే రెండు త్రైమాసికాల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్పారు. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా! -
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఒక పనికి పరిపాలన ఉత్తర్వులు, సాంకేతిక అనుమతి జారీ చేసినప్పటి నుంచి.. అది పూర్తయ్యేదాకా బిల్లుల చెల్లింపులను ‘ఈఎంబుక్’–డిజిటల్(ఎలక్ట్రానిక్) మెజర్మెంట్ బుక్ ద్వారా చేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో ఆర్నెల్ల క్రితం ప్రయోగాత్మకంగా జలవనరుల శాఖ సారథ్యంలో చేపట్టిన పనులకు ఈ–ఎంబుక్ ద్వారా బిల్లుల చెల్లింపును చేపట్టింది. అది విజయవంతం కావడంతో ఏప్రిల్ 1 నుంచి జలవనరుల శాఖలో చేపట్టే అన్ని పనులకూ ఈ విధానాన్నే వర్తింపజేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా మిగిలిన ఇంజనీరింగ్ శాఖల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే టెండర్ వ్యవస్థ ప్రక్షాళన 2014–2019 మధ్య రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో గత టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఇంజనీరింగ్ పనుల టెండర్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం కలిగిన పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించాలని సూచించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండర్ల వ్యవస్థ కట్టుదిట్టంగా తయారయ్యింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఒక్క జలవనరుల శాఖలోనే ఇప్పటిదాకా రూ.1,141.89 కోట్లు ఆదా అయ్యాయి. ఇక కొత్తగా చేపట్టిన పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క ఈ శాఖలోనే ఇప్పటిదాకా రూ.223.94 కోట్లు మిగలడం గమనార్హం. టీడీపీ హయాంలో వందల కోట్ల దోపిడీ గత ప్రభుత్వ హయాంలో ఎం–బుక్ (సాధారణ నోట్‌బుక్) ఉపయోగించేవారు. పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేయడం, చేసిన పనినే మళ్లీ కొత్తగా చేసినట్లు రికార్డు రాయడం, చేసిన పని పరిమాణం కంటే ఎక్కువ చేసినట్లు చూపించడం చేశారు. తద్వారా భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. పోలవరంలో మట్టి తవ్వకం పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.109 కోట్లు దోచేశారు. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేసిన పనులనే 2015–19 మధ్య నీరు–చెట్టు కింద మళ్లీ చేసినట్లు చూపి భారీ ఎత్తున దోచేశారు. ఈ అక్రమాల బాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. దీంతో ఈ తరహా అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ–ఎంబుక్ ద్వారా బిల్లులు చెల్లించాలని నిర్ణయించి, సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సర్వీస్)లో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయించింది. దీనిద్వారా కర్నూలు జిల్లాలో జలవనరుల శాఖ సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ–ఎంబుక్ విధానం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అందువల్ల దీనిని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఈ–ఎంబుక్ ఏం చేస్తుందీ.. ♦గతంలో చేపట్టిన పనిని మళ్లీ కొత్తగా చేపట్టడానికి, ఈ–ఎంబుక్ విధానంలో బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పనిని నమోదు చేయడానికే ఈ–ఎంబుక్ సాఫ్ట్వేర్ అనుమతించదు. ♦పనులను పర్యవేక్షించే జేఈ క్షేత్రస్థాయిలో ఏ రోజు చేసిన పనుల పరిమాణాన్ని ఆ రోజే కొలిచి, వారికి ఇచ్చిన ట్యాబ్‌లోని ఈ–ఎంబుక్‌లో పొందుపరుస్తారు. అగ్రిమెంట్ నిబంధనల మేరకు15 రోజులు లేదా నెలకు ఒకసారి కాంట్రాక్టర్ చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లును ఈ–ఎంబుక్ సాఫ్ట్వేర్ దానంతటదే సిద్ధం చేస్తుంది. ♦వాటిని ఆన్లైన్లో డీఈ, ఈఈలకు పంపుతుంది. ఈ–ఎంబుక్‌లో పొందుపరిచిన పనుల పరిమాణం సక్రమంగా ఉందో లేదో పరిశీలించేందుకు డీఈ, ఈఈలు మరోసారి క్షేత్ర స్థాయిలో పనులను కొలిచి, లోపాలు ఏవైనా ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత లోపాలను సరిదిద్ది ఎస్ఈ, సీఈల ద్వారా బిల్లు చెల్లించాలని పీఏవో (పే అండ్ అకౌంట్స్ ఆఫీస్)కు ఆన్లైన్లో ప్రతిపాదన పంపుతారు. తర్వాత కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లిస్తారు. ♦దీనివల్ల చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. బిల్లులు చెల్లించడానికి కమీషన్లు ఇవ్వాల్సిన అగత్యం ఉండదు. ♦జేఈ, డీఈ, ఈఈలు రోజు వారీగా క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి ఈ–ఎంబుక్‌లో పొందుపర్చాల్సి ఉండటంతో, వారు రోజూ క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారా లేదా అన్నది బయటపడుతుంది. రోజూ పనులను పర్యవేక్షించడం వల్ల పనుల్లో నాణ్యత మరింత పెరుగుతుంది. పారదర్శకతకు అత్యున్నత ప్రామాణికం ఇంజనీరింగ్ పనుల్లో పారదర్శకతకు అత్యున్నత ప్రమాణికం ఈ–ఎంబుక్ విధానం. ప్రస్తుతం ఒక పని పూర్తయ్యేవరకూ బిల్లులను చెల్లించాలంటే పదుల కొద్దీ పనులు ఎం–బుక్‌లలో రికార్డు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా అనేకరకాల అవకతవకలకు అవకాశం ఉంది. అదే ఈ–ఎంబుక్ విధానంలో జేఈ రోజూ క్షేత్ర స్థాయికి వెళ్లి తనకు కేటాయించిన పనుల పరిమాణాన్ని కొలిచి ఈ–ఎంబుక్‌లో రికార్డు చేస్తారు. ఒకసారి ఈ–ఎంబుక్‌లో కొలతలను నమోదు చేసిన తర్వాత వాటిని మార్చడానికి అవకాశం ఉండదు. ఇతర అవకతవకలకు తావుండదు. తద్వారా ప్రజాధనం వృథా కాదు. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ (చదవండి: 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!) పోలవరంలో కీలక ఘట్టం పూర్తి -
హైటెక్ రాముడు
సాక్షి, రామచంద్రపురం(తూర్పుగోదావరి) : సామాన్య మధ్య తరగతి వ్యక్తి. చదివింది ఏడో తరగతే. అయినా ఆరితేరిన మెకానికల్ ఇంజినీర్లా యంత్రాలు తయారుచేస్తాడు జిల్లాలోని రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు చెందిన రెడ్డి రాము. ఆ ఊరిలో బియ్యంపేటకు చెందిన అతన్ని అంతా ఇంజినీరూ అని పిలుస్తారు. ఎవరొచ్చి ఏ అవసరం చెప్పి తన పని సులువు చేయమని అడిగినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ యంత్రం చేసి ఇచ్చేస్తాడు. 16 ఏళ్ల వయసు చిత్ర నిర్మాత అంగర సత్యానికి చెందిన ట్రాక్టర్ ట్రక్కులు తయారు చేసే ఇంజినీరింగ్ వర్క్స్‌లో రాము పనికి కుదిరాడు. అప్పటికి అతడి వయసు 14. తరువాత తోటపేటలో ఉన్న చెల్లూరి భూరికి చెందిన లేతు వర్కుషాపులో, అనపర్తి మండలం పందలపాకలో కిలపర్తి సూర్యారావు చెందిన లేతు వర్కుషాపులో పనిచేశాడు. చివరిగా ఆ అనుభవంతో ద్రాక్షారామలో ఇంటి కిటికీలకు మెష్‌లు, మెట్లకు గ్రిల్స్ తయారు చేసే వెల్డింగ్ షాపును సొంతంగా ప్రారంభించాడు. జీవనోపాధికి వెల్డింగ్ వర్కు చేస్తున్నా బుర్ర నిండా ఇంజినీంగ్ ఆలోచనలే. ఇవి చాలవన్నట్టు మరోవైపు బాడీ బిల్డింగ్. ఈ ఆసక్తితో స్థానిక శాకా వీరభద్రరావుకు వ్యాయామశాలలో చేరాడు. అక్కడ అతని దృష్టి వ్యాయామ పరికరాలపై పడింది. విడివిడిగా ఉన్న పరికరాలపై పడింది. వాటి స్థానంలో బహుళ ప్రయోజనకరమైన పరికరాల తయారీ ప్రారంభించాడు. ఇతని దగ్గర వ్యాయామ పరికరాలు కంపెనీ పరికరాలకు దీటుగా, తక్కువ ధరలోనే దృఢంగా ఉంటున్నాయని ఆనోటా ఈనోటా పాకి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆర్డర్లు రావడం మొదలుపెట్టాయి. రాము రూపొందించిన మల్టీపర్పస్ అబ్డామిన్ మెషీన్, ఇటుక తయారీ యంత్రం రాజమహేంద్రవరంలోని గౌతమి వ్యాయామశాల వంటి అనేక వ్యాయామశాలలు రాముతో అనేక వ్యాయామ పరికరాలు తయారు చేయించుకున్నారు. రాము అక్కడితో ఆగలేదు. ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్టు వారికి ఎన్నో పరికరాలు చేసి ఇచ్చేవాడు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్టణాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టుల కోసం రామును సంప్రదించి వారి ప్రాజెక్టులు తయారు చేయించుకుని వెళ్తుండడం ద్రాక్షారామకే గర్వకారణం. రాము తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఇటుకల తయారీ యంత్రం కోసం ఏళ్ల తరబడి శ్రమించాడు. కంపెనీలు తయారు చేసే ఇటుకల తయారీ మెషీన్లు ఉన్నా, మరింత సులువుగా పని జరిగేలా పలు నమూనాల్లో ఇటుకల తయారీ యంత్రాలను రూపొందించడంలో ఆరితేరాడు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి ఇటుకల తయారీదారులు వచ్చి రాముతో ఆ యంత్రాలు తయారు చేయించుకుంటున్నారు. మోటారు సైకిల్ ఇంజిన్‌తో చిన్నపాటి జీపు పొలం గట్లపై వాడుకోవడానికి అనువుగా చిన్నపాటి జీపును రూపొందిస్తున్నాడు రాము. పాత వాహనాల్లోని పార్టులు ఉపయోగించుకుని రూపొందించే పనిలో ఉన్నాడు. మోటారు సైకిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నా దీనికి రివర్స్ గేర్ కూడా ఏర్పాటు చేస్తుండటం విశేషం. -
రివర్స్ గేర్
ఇంజినీరింగ్ పనుల్లో దండిగా సంపాదించే అవకాశాలెన్నో.. పనికి అంచనాలు వేయడం నుంచి టెండర్ల పని పూర్తయి తుది చెల్లింపుల వరకు రకరకాల పేర్లలో ప్రజల డబ్బు కాజేస్తున్నారు. అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంజినీరింగ్ శాఖల నుంచి ఏటా రూ.కోట్లలోనే ప్రజల డబ్బు పక్కదారి పడుతోంది. ఇక నుంచి కాంట్రాక్టర్ల అక్రమాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. టెండర్లలో కూటమి కట్టకుండా, సిఫార్సులకు పీట వేయకుండా అడ్డగోలు ధరలు వేయకుండా, అస్మదీయులు పని దక్కించుకొనే విధానానికి చెల్లు చీటీ ఇస్తూ టెండర్ విధానంలో సమూల మార్పులు తీసుకురాబోతోంది. సంస్కరణల దిశగా తొలి అడుగు వేసింది. ఈ అడుగు విప్లవాత్మక మార్పు దిశగా పయనిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒంగోలు సిటీ: జిల్లాలో పలు శాఖల్లో ఏటా రూ.కోట్లలోనే పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల పనులు జిల్లా నుంచి జరుగుతున్నాయి. రోడ్లు భవనాలు, జల వనరులు, పంచాయతీరాజ్, నీటి పారుదల ప్రాజెక్టులు, మురుగు నీటి పారుదల ప్రాజెక్టులు ఇలా ఒకటేంటి సుమారు 74 శాఖల్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో నాబార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నుంచి వచ్చే నిధులు, కేంద్ర గ్రాంటులు, విదేశీ సంస్థల రుణాల సహకారంతో జరిగే పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటులు, అభివృద్ధి నిధులు, బడ్జెటరీ నిధులతో పనులు జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక శాఖలో టెండర్లు జరుగుతూనే ఉంటాయి. ఇంజినీరింగ్ శాఖలు, ఇంజినీరింగ్ పనుల్లోనే రూ.కోట్లలోనే అవినీతి జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవినీతి వ్యవహారాలు, అక్రమాలు, టెండర్లలో అడ్డగోలుతనాన్ని ప్రొత్సహించింది. ఈ అవినీతి విధానం ఇంజినీరింగ్ పనుల్లో వేళ్లూనుకుంది. ఈ వ్యవస్థలో సమూలంగా మార్పులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘రింగ్’ రాకెట్‌కు చెక్.. టెండర్లలో కూటమి కట్టడం ఇక్కడ బాగా ప్రసిద్ధి. పోటీదారులు టెండర్లలో పాల్గొనకుండా చేస్తారు. ఇందులో అధికారులను ప్రలోభపెడతారు. జిల్లాలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న తంతు ఇదే. ఏటా జిల్లాలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనుల టెండర్ల ద్వారానే సుమారు రూ.2 వేల కోట్లకుపైగా ప్రజల డబ్బులు గుత్తేదారులు, అవినీతికి పాల్పడే అధికారుల జేబులు నింపుతున్నాయి. బినామీల పేరుతో కొందరు అధికారులు ఇక్కడ టెండర్లు వేయడం.. అవకాశం ఉన్న కాడికి దండుకోవడం నిత్యకృత్యం. టెండర్లలో పోటీదారులు వస్తే కూటమి (రింగ్) కట్టడడమే. ఇక అన్ని స్థాయిల్లో నిఘా.. వివిధ ఇంజినీరింగ్ శాఖల్లో పనులకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్స్(ఈపీసీ) పద్ధతి ఒకటి కాగా.. రెండో పద్ధతి లంప్సమ్ ఓపెన్ విధానం. ఈపీసీ విధానం ప్రకారం పనులకు కాంట్రాక్టర్ డిజైన్ రూపొందించాలి. పని పూర్తయ్యాక ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అంచనా విలువ కన్నా ఎక్కువ ఖర్చు చేశానని ఆ మేరకు అదనపు బిల్లు ఇవ్వాలని కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉండదు. కాంట్రాక్టర్ కోట్ చేసిన ధరల ఆధారంగానే వర్గీకరించి హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపుతారు. అందరి కన్నా తక్కువ కోట్ చేసిన గుత్తేదారునికి అప్పగించేలా హై పవర్ కమిటీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక టెండర్ల విధానంపై అన్ని స్థాయిల్లోనూ నిఘా ఏర్పడనుంది. నష్టం వచ్చే ద్వారాలకు మూత.. ఇంజినీరింగ్ పనుల్లో ఎక్కడా నష్టం రాకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగానే ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటి వరకు కాంట్రాక్టు పనుల్లో కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలు అడ్డగోలుగా తుంగలో తొక్కారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై టెండర్ల విధానాన్నే అపహాస్యం చేశారు. కొన్ని పనులకు పరిపాలనా అనుమతులు తీసుకోకుండానే పని అంచనా వ్యయాలను భారీగా పెంచేసి టెండర్ల నోటిఫికేషన్లు జారీ చేయించారు. జిల్లాలో వెలుగొండ పనులకు అడ్డగోలుగా అంచనాలు పెంచి ఎస్ఆర్ ధరలను పెంచి చంద్రబాబు ప్రభుత్వం వేరే సంస్థకు పనులు కట్టబెట్టడంతో పాత కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో వెలుగొండ పరిధిలోని కొన్ని ప్యాకేజీల్లో పనులు ముందుకు పోకుండా నిలిచాయి. ఖజానాకు భారీగా నష్టం వచ్చింది. 2017లో హైపవర్ కమిటీని రద్దు చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది. తమ కాంట్రాక్టు పనులకు కొన్ని నిబంధనలు అడ్డు వస్తున్నాయని రద్దు చేయించారు. ఇక పనుల్లో అడ్డగోలు తనం పెరిగింది. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టు పనుల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. అక్రమాలకు కళ్లెం.. ఇక నుంచి అస్మదీయులకే పని విధానానికి కాలం చెల్లనుంది. కమీషన్లు, అదనపు చెల్లింపులు ఉండవు. ముఖ్యమంత్రి జగన్ తన తొలి సంతకంతోనే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. రూ.వందల కోట్ల అవినీతికి ఆలవాలంగా మారిన ఇంజినీరింగ్ పనుల్లో ప్రక్షాళనకు రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఖజానాపై క్రమేణా భారం తగ్గుతుంది. ఇక టెండర్లలో అడ్డగోలు తనం ఉండదు. టెండర్ల స్థాయిలోనే అన్ని రకాల అక్రమాలకు చెక్ పడనుంది. హైకోర్టు జడ్జి నేతృత్వంలో జుడీషియర్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ సిఫార్సు మేరకు టెండర్లు పిలుస్తారు. భారీగా ఆదాయం.. టెండర్ల విధానంలో రానున్న మార్పుల నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. ఇటీవల ఆర్ అండ్ బి నుంచి నిర్వహించిన టెండర్లలోనే తక్కువ ధర కోట్ చేసిన కాంట్రాక్టర్లను విడిచిపెట్టి అధిక ధరలను కోట్ చేసిన వారికి పని ఒప్పందం కుదుర్చుకున్నారు. సుమారు రూ.10 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. ఇక జలయజ్ఞం పనుల్లో అయితే పెద్ద ఎత్తున ఖజానా ఆదాయానికి గండి పడింది. జిల్లాలో జరుగుతున్న రూ.వందల కోట్ల పనుల్లో పెద్ద ఎత్తునే ప్రజల డబ్బు పక్కదారి పడుతోంది. టెండర్ల విధానంలో రానున్న సమూల మార్పుల నేపథ్యంలో వచ్చే ఆదాయాన్ని జగన్ ప్రభుత్వం పేదల సంక్షేమానికే ఖర్చుచేయనుంది.ఆదా అయ్యే నిధులతో పేదల సంక్షేమానికి వినియోగిస్తారు. ఈ కొత్త వి«ధానం వినూత్న మార్పుకు ప్రగతి అడుగు అన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. కాంట్రాక్టర్లలో గుబులు.. జిల్లాలో పెద్ద కాంట్రాక్టర్లు 32 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగే పనులకు అర్హత ఉన్న కాంట్రాక్టర్లు కేవలం 9 మందే. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే పనులు చేస్తున్నారు. జలవనరులశాఖ, ఆర్అండ్బీ, ప్రజారోగ్యశాఖ, వైద్య ఆరోగ్యం, మానవవనరులు, పరిశ్రమలు ఇతర శాఖల్లో టెండర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు ఉన్నాయి. అవినీతి జరిగిన టెండర్లను రద్దు చేయనున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. అర్హులైతేనే పని.. జిల్లాలో అనర్హులు ఎందరో ఆర్ అండ్ బీ, నీటి పారుదల తదితర ఇంజినీరింగ్ శాఖల్లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. హాట్ మిక్స్ ప్లాంట్, మినషనరీ ఇతర యంత్రాలు, అర్హతలు అన్ని సరిపోతేనే పని చేసేందుకు కాంట్రాక్టర్‌కు అర్హత ఉంటుంది. జిల్లాలో చేస్తున్న పనులకు పలువురు కాంట్రాక్టర్లకు పనికి సంబంధించి అర్హత లేకున్నా టీడీపీ ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేశారు. జిల్లాలో కొన్ని రకాల పనులకు సాంకేతిక పరమైన అర్హతలు లేని కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. కొప్పోలు రోడ్డు పనిని కూడా అర్హత లేని కాంట్రాక్టర్ చేశాడు. -
అతివేగం.. నిద్రమత్తు
నకిరేకల్, న్యూస్‌లైన్: అతివేగం..నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. వారంతా ఇంజినీరింగ్ వర్క్స్ షాపు నడుపుతూ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50శాతం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసే యాంత్రీకరణ పరికరాలను తయారు చేస్తారు. దీనిలో భాగంగా నల్లగొండ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సూర్యాపేట నుంచి ఆరుగురు ఇంజినీరింగ్ వర్క్స్‌షాప్ యజమానులు బొలెరో వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు వెంటాడింది. ఆగి ఉన్న లారీని వీరి వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. వాహనం అయితే నుజ్జునుజ్జయింది. ఈ ఘోరం నకిరేకల్ శివారు దేవి పెట్రోల్ బంక్ సమీపంలోని నగేష్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. అతివేగంతో.... అదుపుతప్పి.. సూర్యాపేటకు అతివేగంతో బొలెరో వాహనం వెళ్తున్నది. నకిరేకల్ శివారులోని దేవి పెట్రోల్‌బంక్ సమీపంలో నగేష్ హోటల్ ముందు లారీ డ్రైవర్ భోజన నిమిత్తం రోడ్డు పక్కన దూరంగానే లారీని ఆపాడు. బొలెరో వాహనం అక్కడికిరాగానే అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని బొడ్డు నాగయ్య నడుపుతున్నాడు. ఒక్కక్షణంలో అంతా తారుమారైంది. బొలెరో వాహనం 40 మీటర్ల దూరంలో ఎగిరి పడి డివైడర్‌పై పల్టీలు కొట్టింది. వాహనం పైకప్పు పూర్తిగా లేచిపోయి నుజ్జునుజ్జయింది. ఇరుక్కుపోయిన మృతదేహాలు నుజ్జునుజ్జయిన వాహనంలో నూకల నర్సిం హారెడ్డి(48), కోదాటి జగదీష్(30), వాసంపల్లి లింగారెడ్డి(50), వంగేటి నర్సింహారెడ్డి (45) అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. వాహనం నడుపుతున్న బొడ్డు నాగయ్యకు కాళ్లు, చేతులు విరిగాయి. మరో యజమాని కొండ శ్రీనివాస్ తల, కాళ్లు చేతులకు బలమైన దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ఇరుక్కుపోయిన మృతదేహాల ను బయటికి తొలగించారు. క్రేన్ సాయంతో బొలెరో వాహనాన్ని పక్కకు తొలగించారు. కొండ శ్రీనివాస్, బొడ్డు నాగయ్యలను చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరిద్దరికి ప్రాథమిక చికిత్స చేశారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మృతుల్లో ఒకరైన నూకల నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ వర్క్స్‌షాప్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇదే ప్రాంతంలో గతంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. జేడీఏ సందర్శన.. సంఘటన విషయం తెలుసుకున్న జేడీఏ నర్సింహారావు హుటాహుటిన నకిరేకల్‌కు చేరుకున్నారు. ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ఇంజనీరింగ్ వర్క్స్ షాపు యజమానులంతా వారు పంపిణీ చేసే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల పనినిమిత్తం తనను కలిసేందుకు వచ్చారు. ఆ తరువాత వెళ్లిపోయారు. ఇది చాలా ఘోరమైన సంఘటన’ అని పేర్కొన్నారు. డీఎస్పీ పరిశీలన.. నల్లగొండ డీఎస్పీ రామోహన్‌రావు ప్రమాద ఘటనను పరిశీలించారు. సీఐ శ్రీనివాసరావుతో ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నా రు. బొలెరో వాహనం నడుపుతున్న నాగయ్య అతివేగంగా నడుపుతూ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. పూర్తి విచారణ చేస్తామని చెప్పారు. ఒక్క సారిగా కళ్లు మూతపడ్డాయి : బొడ్డు నాగయ్య మధ్యాహ్నం నల్లగొండలోని ఓ హోటల్లో భోజనం చేసి సూర్యాపేటకు బయలుదేరాం. వాహనం కూడా చాలా స్పీడ్‌లోనే ఉంది. ఒక్కసారిగా కళ్లు మూత పడ్డాయి. ఎదో అడ్డువస్తున్నట్లు అనిపించింది. వాహనంలో ఉన్న వారు కూడా నన్ను కంగారు పెట్టారు. అప్పుడు ఎం జరిగిందో అర్థం కాలేదు. ఆ తరువాత స్టీరింగ్ కింద ఇరుక్కుపోయాను. కాళ్లు చేతులు పని చేయడంలేదు.