న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)జోరు కొనసాగుతోందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఎఫ్‌డీఐలు 13% వృద్ధితో 4,000 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం నెలకొన్నా, మ న దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం ఆ గలేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ సీఐఐ నిర్వహిం చిన భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు.
పూర్తి సహకారం..
భారత్‌లో వివిధ రంగాల్లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందిగా విదేశీ ఇ న్వెస్టర్లను గోయెల్ ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పూర్తి సహకారం అందిస్తామన్నారు.
మరిన్ని సంస్కరణలు...
భారత్ మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఫిన్లాండ్ విదేశీ వాణిజ్య మంత్రి విల్లె టపియో స్కిన్నారి వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్, భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాకారం కావడం కోసం ఒక గడువును నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయమై వీలైనంత త్వరగా సంప్రదింపులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఒప్పందం విషయమై 2013 నుంచి ప్రతిష్టంభన నెలకొన్నది.
తొమ్మిది రంగాల్లో నిషేధం
అన్ని రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నామని గోయెల్ పేర్కొన్నారు. టెలికం, మీడియా, ఫార్మా, బీమా, రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం అవసరమని వివరించారు. లాటరీ వ్యాపారం, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, చిట్ ఫండ్స్, నిధి కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, పొగాకు ఉపయోగించే సిగరెట్లు, సిగార్లు తయారు చేసే వ్యాపారాలు... వీటిల్లో ఎఫ్‌డీఐలపై నిషేధం ఉందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment