'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్‌లో మోదీ | PM Narendra Modi Reacts About AI Impact On Employment At AI Action Summit In Paris | Sakshi
Sakshi News home page

'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్‌లో మోదీ

Published Tue, Feb 11 2025 4:44 PM | Last Updated on Tue, Feb 11 2025 5:02 PM

PM Narendra Modi Reacts About AI Impact On Employment At AI Action Summit In Paris

భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' (Narendra Modi) పారిస్‌లో నిర్వహించిన ప్రపంచ ఏఐ (AI) శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో కృత్రిమ మేధస్సు ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి వివరించారు. ఏఐ ప్రయోజనాలను మాత్రమే కాకుండా.. నష్టాలను కూడా కలిగిస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఏఐ జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఏఐ పాత్ర కీలకం. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం.. ప్రయాణాన్ని సులభంగా, వేగవంతం చేయడానికి ఏఐ సహాయపడుతుందని మోదీ అన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనడం సరైంది కాదు.

సాంకేతిక అనేది నైపుణ్యం పెంచుకునేవారికి ఓ మంచి అవకాశం. కాలానుగుణంగా ఉద్యోగాల స్వభావం మారుతుంది. కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మోదీ అన్నారు. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా భారత్ ముందుకు దూసుకెళ్తోంది. పాలించడం అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు.. కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పించడం కూడా. అప్పుడే దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది.

ఏఐ యాక్షన్ సమ్మిట్‌ (AI Action Summit)కు అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ.. ఏఐకి భారత్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గణాంకాలతో సహా వివరించారు. అలాగే ‘‘మంచి కోసం ఏఐ.. అందరికీ ఏఐ’’ ఇదే భారత్‌ నినాదమని ఆయన ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ, తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించుకోవాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అవసరమైన అప్లికేషన్‌లను సృష్టించాలని అన్నారు.

ఇదీ చదవండి: మస్క్ ఆఫర్.. రిజెక్ట్ చేసిన ఆల్ట్‌మన్: ట్వీట్స్ వైరల్..

టెక్ పరిశ్రమలో భారతదేశం సాధించిన విజయాలను కూడా ప్రధాని మోదీ.. ఈ వేదికపై హైలైట్ చేశారు. చాలా తక్కువ ఖర్చుతో 1.4 బిలియన్లకు పైగా ప్రజలకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విజయవంతంగా నిర్మించామని అన్నారు. మేము మా డేటా సాధికారత, రక్షణ నిర్మాణం ద్వారా డేటా శక్తిని అన్‌లాక్ చేసాము. డిజిటల్ వాణిజ్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా.. అందరికీ అందుబాటులోకి తెచ్చామని ఆయన అన్నారు. మనం మానవాళి గమనాన్ని రూపొందించే AI యుగం ప్రారంభంలో ఉన్నామని కూడా ప్రధాని మోదీ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement