న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)లతో బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశం కానున్నారు. డిపాజిట్ల మందగమనం, రుణ వృద్ధి పటిష్టత సంబంధిత అంశాలపై ఈ సమావేశం చర్చించనున్నదని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
గత ఏడాది అక్టోబర్‌తో ముగిసిన వార్షిక కాలానికి డిపాజిట్ వృద్ధి రేటు 10.2 శాతం ఉంటే, ప్రస్తుతం 9.6 శాతంగా ఉంది. ఇక రుణవృద్ధి 6.5 శాతం నుంచి 18 శాతానికి చేరింది. రిటైల్, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలో రుణ నాణ్యత, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల వంటి అంశాలపై కూడా బ్యాంకింగ్ సమావేశం చర్చించనున్నదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment