
అందుబాటు ధరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ముంబై జాతీయ రహదారిలో పలు లే–అవుట్లను హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రా నిర్మిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి ప్రజల పెట్టుబడులకు భద్రతను, రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా వెంచర్లను అభివృద్ధి చేస్తుంది యోషిత హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రా. అందుబాటు ధరల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న ముంబై జాతీయ రహదారిలో పలు లే–అవుట్లను నిర్మిస్తోంది. ఆయా ప్రాజెక్ట్ వివరాలను కంపెనీ ఎండీ గణాది కమలాకర్ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు.
► సదాశివపేటలోని ఆరూర్‌లో ధరణి పేరిట 32 ఎకరాల లే–అవుట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ముంబై హైవే ఫేసింగ్ వెంచర్‌లో 300 ఓపెన్ ప్లాట్లుంటాయి. ఒక్కో ప్లాట్ 165 నుంచి 500 గజాల్లో ఉంటుంది. డీటీసీపీ అనుమతి పొందిన ఈ వెంచర్ ప్రారంభమైన రెండు నెలల్లోనే 60 శాతానికి పైగా అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పటికే బ్లాక్‌టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, పార్క్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెమీ క్లబ్‌హౌస్ వంటి అన్ని రకాల వసతుల నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి.
► సదాశివపేటలోని ఎన్కాపల్లిలో 11 ఎకరాల్లో నీల్ గార్డెన్స్ వెంచర్‌ను చేస్తున్నాం. ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇందులో 140 ప్లాట్లుంటాయి. ఒక్కోటి 165 గజాల నుంచి 300 గజాల మధ్య ఉంటాయి. ప్రస్తుతం భూగర్భ విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ ఏర్పాట్ల పనులు జరుగుతున్నాయి. రెండు నెలల్లో అన్ని రకాల వసతుల నిర్మాణ పనులను పూర్తి చేస్తాం.
తొలి హౌసింగ్ ప్రాజెక్ట్..
సంగారెడ్డిలోని కొత్లాపూర్‌లో 5 ఎకరాల్లో ఎస్‌ఎస్‌ఆర్ గ్రీన్ మెడోస్ పేరిట హెచ్‌ఎండీఏ వెంచర్‌ను అభివృద్ధి చేయనున్నాం. వచ్చే రెండేళ్లలో నగరంలో 200 ఎకరాల్లో సుమారు ఐదు వెంచర్‌లను ప్రారంభించనున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి పశ్చిమ హైదరాబాద్‌లో తొలి గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. 2016 సెప్టెంబర్‌లో యోషిత హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాను ప్రారంభించాం. అమరావతిలోని మోతడక, ఇబ్రహీంపట్నంలో వంద ఎకరాలలో పలు వెంచర్లను అభివృద్ధి చేశాం.
ముంబై హైవేలోనే ఎందుకంటే?
హైదరాబాద్ గుండా వెళ్లే ఇతర జాతీయ రహదారుల వైపు ఇన్వెస్టర్లను ఆకర్షించాలంటే రాయితీలు, ప్రోత్సాహక పథకాల వంటివి ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ముంబై హైవే అలా కాదు. సహజసిద్ధంగానే అభివృద్ధి చెందింది. ఎన్‌హెచ్ 65 ఎగుమతి, దిగుమతుల కేంద్రంగా, లాజిస్టిక్ హబ్‌గా డెవలప్‌మెంట్ ఉంది. జహీరాబాద్‌లో సుమారు 13 వేల ఎకరాల్లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫర్ మ్యానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) రానుంది. ఇందులో డిఫెన్స్, ఎయిరోస్పేస్, లాజిస్టిక్, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్, మెటల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్విప్‌మెంట్ వంటి రంగాల కంపెనీలు కొలువుదీరనున్నాయి.
ఇక్కడ చదవండి:
ఇళ్ల ధరలు పెరిగిన ఏకైక నగరం ఏదో తెలుసా?