రిలయన్స్ మరో డీల్‌ | Reliance Industries to acquire 50 pc stake in IMG-R | Sakshi
Sakshi News home page

రిలయన్స్ మరో డీల్‌

Dec 25 2020 5:05 PM | Updated on Dec 25 2020 7:19 PM

Reliance Industries to acquire 50 pc stake in IMG-R - Sakshi

సాక్షి, ముంబై: వ్యాపారవేత్త, బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ మరో డీల్‌ కుదుర్చుకున్నారు.  అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సింగపూర్  కుచెందిన  స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్  ఐఎమ్‌జీ వరల్డ్‌వైడ్ ఎల్‌ఎల్‌సీలో మేజర్‌ వాటాను కొనుగోలు చేశారు.  రూ .52.08 కోట్లకు  'ఐఎంజీ-ఆర్‌'లో 50శాతం వాటాను సొంతం చేసుకొంది. ఈ విషయాన్ని ఆర్‌ఐఎల్‌ రెగ్యులేటరీ  ఫైలింగ్‌లో వెల్లడించింది.  ఈ డీల్‌ పూర్తిగా నగదు రూపంలో జరిగింది. డీల్‌ పూర్తికాగానే రిలయన్స్‌ ఐంఎంజీ ఆర్‌ను రీబ్రాండింగ్‌ చేయనుంది.

భారత దేశంలో క్రీడలు,ఫ్యాషన్  వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్‌ చేయడం కోసం 2010లో రిలయన్స్‌-ఐఎంజీ వరల్డ్‌వైడ్‌  సంయుక్తంగా సంస్థను ప్రారంభించాయి. ఆ తర్వాత నుంచి కంపెనీ భారత్‌లో పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్‌ చేసింది. 'షేర్ల కొనుగోలుకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, రూ.52.08 కోట్లకు మించకుండా ఐఎంజీ సింగపూర్‌ పీటీఈ వాటాను కొనుగోలు చేస్తామని రిలయన్స్‌ తెలిపింది. ఈ డీల్‌ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్‌ చేస్తామని వెల్లడించింది.  ముందు చేసుకొన్న ఒప్పందం కావడంతో దీనికి ఎటువంటి క్లియరెన్స్‌లు అవసరం లేదని  కూడా రిలయన్స్‌ తెలిపింది. ప్రస్తుతం ఐఎంజీ-ఆర్‌ ఏటా రూ. 25.79 కోట్లు జీఎస్టీతో  సహా రూ.181.70 కోట్ల మేరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వీటిల్లో నికర లాభం రూ.16.35 కోట్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement