ఈ కామర్స్‌కు కంపెనీలకు రియల్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారీ షాక్ ఇవ్వనున్నారు. త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి కొత్త ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు. తద్వారా దేశంలో ఉన్న దేశీయ, విదేశీయ ఈ కామర్స్ కంపెనీలకు ముఖేష్ అంబానీ కాంపిటీటర్‌గా మార్కెట్‌లో దూసుకుపోనున్నారు.
ది ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం..ఈ కామర్స్ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీ వెనకంజలో ఉంది. అందుకే అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీగా ముఖేష్ అంబానీ కొత్త ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌ను బిల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతం జియో మార్ట్‌లో ఇండిపెండెంట్ సెల్లర్స్ అమ్మకాలు జరుపుతుండగా..త్వరలో మార్కెట్‌లో విడుదల కానున్న రిలయన్స్ ఈ కామర్స్ ప‍్లాట్ ఫామ్‌లో థర్డ్ పార్టీ సెల్లర్స్ అమ్మకాలు జరపనున్నారు.
కండీషన్స్ అప్లై
జియో మార్ట్‌లో ఇండిపెండెంట్ సెల్లర్స్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసింది. ఆ ఇండిపెండెంట్ సెల్లర్స్ పరిమిత సంఖ్యలో కొన్ని ప్రొడక్ట్‌లు అమ్మే అవకాశం ఉంది. వాటిలో ఆటోమొబైల్ యాక్ససరీస్, క్రీడా వస్తువులు, బుక్స్,పెర్ ఫ్యూమ్‌తో పాటు ఇతర వస్తులున్నాయి.
ఈ కామర్స్ పాలసీకి అనుగుణంగానే
త్వరలో కేంద్రం విడుదల చేయనున్న ఈకామర్స్ పాలసీకి అనుగుణంగా రియల్స్ ఇండస్ట్రీ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఉంటుందని ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్‌లో తెలిపింది. అందుకే ఇతర ఈ-కామర్స్ విక్రేతలు లేదా బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వాలని, కాబట్టే ప్రత్యేక మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాలని కోరుకుంటున్నట్లు రిలయన్స్ ప్రతినిధి తెలిపారంటూ టైమ్స్ రిపోర్ట్ చెప్పింది.
1000మంది
రిలయన్స్ తన ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు వెయ్యి మంది ఇండిపెండెంట్ సెల్లర్స్ ఉన్నట్లు నివేదించబడింది. ప్రభుత్వం తన ఇ-కామర్స్ విధానాన్ని ప్రకటించే వరకు విక్రేతలు జియోమార్ట్‌లో పనిచేస్తారని, అది ప్రారంభించిన తర్వాత కొత్త ప్లాట్‌ఫారమ్‌కు మార్చబడుతుందని నివేదిక స్పష్టం చేసింది. రిలయన్స్ ప్రస్తుతం ఈ-కామర్స్ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే వెనుకబడి ఉంది. త్వరలో మార్కెట్‌లో విడుదల కానున్న రిలయన్స్ ఇండస్ట్రీకి కొత్త ఫ్లాట్ ఫామ్ మరింత ప్రయోజన కరంగా ఉంటుందని ఆ సంస్థ భావిస్తోంది.
చదవండి👉ముఖేష్ అంబానీ ముందు చూపు మామూలుగా లేదుగా..ఇక లాభాలే లాభాలు!!
Comments
Please login to add a commentAdd a comment