న్యూఢిల్లీ: సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపుతోపాటు మరో 17 సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. దేశీయంగా సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద.. రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను ఐదేళ్ల పాటు ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
10,000 మెగావాట్ల సమగ్ర సోలార్ పీవీ మాడ్యూళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. రూ.17,200 కోట్ల పెట్టుబడులు రాబట్టడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. ‘‘ఆర్‌ఐఎల్, అదానీ గ్రూపు, ఫస్ట్ సోలార్, షిర్టీ సాయి, జిందాల్ పాలీ ఈ పథకం కింద స్టేజ్ 1–4 వరకు అన్ని దశలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించాయి. పాలీ సిలికాన్ (స్టేజ్–1), వేఫర్ (స్టేజ్–2), సెల్స్ అండ్ మాడ్యూల్స్ (స్టేజ్–3, 4) కిందకు వస్తాయి. ఎల్‌అండ్‌టీ, కోల్ ఇండియా, రెన్యూ పవర్, క్యుబిక్ సంస్థలు స్టేజ్–2 నుంచి 4 వరకు ధరఖాస్తులు సమరి్పంచాయి. మేఘ ఇంజనీరింగ్, టాటా పవర్ సహా తొమ్మిది సంస్థలు మూడు, నాలుగో స్టేజ్‌ల కోసం దరఖాస్తులు సమర్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment