టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్‌గేట్స్‌కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా బిలియనీర్ బిల్‌గేట్స్ కోవిడ్-19 తీవ్రత కొద్దిగా తగ్గినట్లు పేర్కొన్నారు. కానీ, భవిష్యత్ కాలంలో మరో మహమ్మారి వచ్చే అవకాశం ఉన్నట్లు బిల్‌గేట్స్ పేర్కొన్నారని సీఎన్‌బిసీ నివేదించింది.
ప్రపంచ జనాభాలో అధిక భాగం కరోనా వైరస్ నుంచి ఒక స్థాయి రక్షణను సాధించారని బిల్‌గేట్స్ మీడియాతో చెప్పారు. ఓమిక్రాన్ వేరియంట్ వల్ల సంక్రామ్యత తీవ్రత తగ్గిందని ఆయన తెలిపారు. అయితే, ఆయన ఇలా హెచ్చరి౦చాడు: "మన మీద మరో మహమ్మారి దాడి చేసే అవకాశం ఉ౦ది. ఇది మరో కొత్త రకం వ్యాధి అవుతుంది" అని అన్నారు. వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పుడు పెట్టుబడులు పెడితే, భవిష్యత్తులో మహమ్మారిపై పోరాడటానికి ప్రపంచం మెరుగైన స్థితిలో ఉంటుందని గేట్స్ చెప్పారు. "తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉండటానికి అయ్యే ఖర్చు అంత పెద్దది కాదు" అని గేట్స్ సీఎన్‌బిసీకి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment