వచ్చే ఏడాది ఏ ఉద్యోగుల జేబులు నిండుతాయి.. ఏ రంగంలో జీతాలు ఎక్కువగా పెరుగుతాయి? దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 2025 ఏడాదిలో జీతాలు ఎంత మేర పెరుగుతాయన్న దానిపై ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే నిర్వహించింది.
30వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2024-25 మొదటి దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో 40కి పైగా పరిశ్రమల నుండి 1,176 కంపెనీల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. దీని ప్రకారం 2025లో అన్ని రంగాల్లో సగటు వేతన పెంపు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా ఈ ఏడాది వాస్తవిక పెంపు 9.3 శాతంగా ఉంది.
డబుల్ డిజిట్ ఈ రంగాలదే..
ఇంజనీరింగ్, తయారీ, రిటైల్ పరిశ్రమలు 2025లో అత్యధికంగా 10 శాతానికి పైగా వేతనాలు పెంచుతాయని అంచనా వేశారు. 9.9 శాతంతో తర్వాత స్థానంలో ఆర్థిక సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ సెక్టార్‌కు ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్రారంభమైనప్పటికీ వచ్చే ఏడాది ఆశాజనకంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీ
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లు, టెక్నాలజీ ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్‌లు 9.9 శాతం, 9.3 శాతం వేతనాల పెంపును ఆశిస్తున్నాయి. అయితే టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ రంగ సంస్థలు 8.1 శాతమే ఇంక్రిమెంట్‌ను అందించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అధ్యయనం రెండో దశలో భాగంగా వచ్చే డిసెంబర్, జనవరిలో డేటాను సేకరించి 2025 ప్రారంభంలో వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment